Vinni_chinni Posted July 27, 2015 Author Report Posted July 27, 2015 బయట కంటే కూడా ట్విట్టర్ ద్వారా పంచ్ లైన్లతో వార్తల్లో కనిపించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్.. తాజాగా మరోసారి తన ట్వీట్ ద్వారా వార్తల్లోకి వచ్చారు.సంప్రదాయ రాజకీయ నాయకులు.. ఎవరి మీదనైనా విమర్శలు చేయాలంటే మీడియ ముందు మాట్లాడతారు. కానీ.. లోకేశ్ మాత్రం ఘాటు వ్యాఖ్యలన్నీ ట్విట్టర్ ద్వారా మాత్రమే చేస్తుంటారు.తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. ‘‘క్యాట్ ఈజ్ ఔట్ ఆప్ ద బ్యాగ్’’ అంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. రహస్యం బట్టబయలు అయ్యిందని.. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తాజాగా పలు ట్వీట్స్ చేసిన ఆయన.. ట్యాపింగ్ వ్యవహారం బట్టబయలు అయ్యిందని.. ఇప్పటివరకూ తాము చెప్పిన విషయాల్నే.. టెలికం సంస్థలు సుప్రీంకోర్టుకు చెప్పాయన్నారు.కేసీఆర్ అండ్ కంపెనీ చెప్పే మాటలు.. చేసే పనులకు సంబంధం ఉండదని.. వారు చేయలేదంటే చేశామని.. చేశామని చెబితే చేయలదన్నట్లుగా ఉంటుందని ఏసుకున్న నారా లోకేశ్.. ట్యాపింగ్ చేయలేదని కేసీఆర్ అండ్ కో వాదించారని. . టెలికం కంపెనీలే కోర్టుకు ట్యాపింగ్ చేశాయని చెబుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెబుతారంటూ వ్యాఖ్యానించారు. మరి లోకేశ్ తాజా ట్వీట్స్ కు టీఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. - See more at: http://telugu.gulte.com/tnews/10697/Nara-Lokesh-punch-for-KCR-on-Twitter#sthash.uyNlZHgx.dpuf
Recommended Posts