Jump to content

Recommended Posts

Posted
ఏయ్… మేము ఫోన్ ట్యాపింగ్ చెయ్యలేదు. చంద్రబాబు మొత్తం బండారం మా చేతిలో ఉంది. ఆయన రాజకీయ చరిత్ర ఇక ముగిసినట్లే  అని ప్రగల్బాలు పలికిన తెలంగాణ హోంమంత్రి సప్పుడు చేయడం లేదు. ఏపీ గవర్నమెంటు చాలా సీరియస్ గా తీసుకోవడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ అయ్యింది. మొదట్లో ట్యాపింగ్ చేయలేదని బుకాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మేము ట్యాపింగ్ చేశాము అని,  ఆ మాత్రం మాకు హక్కుండదా అని, అసలు ట్యాపింగ్ డీటెయిల్స్ అడగొద్దని రకరకాలుగా తన ఫ్రస్ట్రేషను చూపుతోంది. 
తమాషా ఏంటంటే.. ఇక దొరికిపోయి ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో తమ కేసు వాదించడానికి కాస్త గట్టి లాయరును తీసుకురావడానికి హుటాహుటిన ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు దేశంలో ప్రముఖ క్రిమినల్ లాయర్ అయిన రాంజెఠ్మలానీని ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో ట్యాపింగ్ కేసు నడుస్తోంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున రాంజెఠ్మలానీ వాదిస్తున్నారు. 
 
 
×
×
  • Create New...