Jump to content

Recommended Posts

Posted

బాహుబలి 2 ఫైనల్ వార్… టీంలు రెఢీ

Posted

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.450 కోట్ల గ్రాస్ను వసూలు చేసి..మరిన్నిరికార్డుల దిశగా దూసుకెళుతోంది. ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్లో జరిగిన వార్లో రానా, ప్రభాస్ మహిష్మతి రాజ్యం తరపున యుద్ధం చేస్తారు. ఇక వీరు కాలకేయులైన కాలకేయుడు(ప్రభాకర్) టీంతో తలపడి విజయం సాధిస్తారు. యుద్ధంలో ఒకానొక దశలో కాలకేయులు విజయం సాధించినట్టు ఉన్నా తర్వాత శివుడు(ప్రభాస్) ధైర్యం నూరిపోయడంతో తర్వాత కాలకేయులపై తిరగబడి విజయం సాధిస్తారు.

చివరకు కాలకేయుల నాయకుడైన కాలకేయుడ్ని అంతమెందిస్తాడు. అయితే బాహుబలి 2లో కూడా కాలకేయులు మళ్లీ వస్తారట. తమ అన్న కాలకేయుడ్ని చంపిన పగతో ఉన్న కాలకేయుడు తమ్ముడు మాహిష్మతి రాజ్యంపై పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడట. ఇక ఇటు శివుడు కూడా తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపించి రాజ్యం హస్తగతం చేసుకున్న భల్లాలదేవుడిపై పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు.

బాహుబలి 2 క్లైమాక్స్లో జరిగే చివరి వార్లో శివుడు(ప్రభాస్), అవంతిక నాయకత్వం వహిస్తున్న దళం, శివుడిని పెంచిన గూడెం సభ్యులందరు మహేంద్ర బాహుబలి తరపున మహిష్మతి రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. వీరికి కట్టప్పతో పాటు ఫర్షియారాజు అస్లాంఖాన్(సుదీప్) కూడా సాయం చేస్తారు.
ఇక అటు భల్లాలదేవుడు కాలకేయుడ్ని చంపింది బాహుబలి అని కాలకేయుడి తమ్ముడితో చెప్పి..ఇప్పుడు మనం అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలి కొడుకును చంపి పగ తీర్చుకోవాలని వారికి నూరిపోస్తాడు. దీంతో కాలకేయుడి తమ్ముడి నేతృత్వంలో కాలకేయులు భల్లాలదేవుడికి అండగా నిలుస్తారు. ఇక మహిష్మతి సైనికులు, కాలకేయులు కలిసి భల్లాలదేవుడి టీంలో ఉంటారు.

వీరిద్దరి మధ్య చివరి అరగంట పాటు హోరాహోరీగా సాగే యుద్ధంలో శివుడు భల్లాలదేవుడిని చంపి మహిష్మతి పీఠాన్ని కైవసం చేసుకుని..ఆ రాజ్యంలో ప్రజలకు ఆ దుర్మార్గపు పాలననుంచి విముక్తి కలిగిస్తారు. అది స్టోరీ

 

  • 2 weeks later...
×
×
  • Create New...