Jump to content

Srimanthudu - Ithano Swadesi


Recommended Posts

Posted

ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగటం' ,'సాటి మనిషికి కష్టం అనేది చూడకపోతే మనము భూమ్మీద సంఘంలో బ్రతకటం ఎందుకు?' అని చెప్తూ, 'శ్రీమంతుడు' వచ్చేసాడు. రెగ్యులర్ రొటీన్ మసాలా కథలకు కాస్త కామా పెట్టి మన చుట్టూ ఉండే వాస్తవ పరిస్ధితులు ముడిపెడ్తూ ఉన్నంతలో మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ చిన్నపాటి మెసేజ్ ని సైతం మోసుకొచ్చాడు. కామెడీకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వని ఈ సినిమాలో... ఫస్టాఫ్ మంచి రన్ తో పరిగెట్టి,సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్స్ బీట్స్ తో ప్రెడిక్టుబుల్ క్లైమాక్స్ తో స్లో అయ్యిందనిపించినా మహేష్ ఛార్మ్ తో లాక్కెళ్ళిపోయాడు. అఫ్ కోర్స్ దానికి అద్బుతమైన సినిమాటోగ్రఫీ కూడా సహకరించిందనుకోండి. అలాగే మహేష్ ప్రీ క్లైమాక్స్ లో అద్భుతమైన ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శక,రచయిత కొరటాల శివ సైతం ...పంచ్ డైలాగులుకు వెళ్లకుండా...'నా కడుపున పుట్టినందుకు ధాంక్స్ రా నాన్న' వంటి ఎమోషనల్ డైలాగ్స్ తో కథనం స్మూత్ గా రన్ చేసాడు. రెండు గంటల 43 నిముషాలు సమయం...లెంగ్త్ మరీ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది..ఓ పదిహేను ..ఇరవై నిముషాలు ..ట్రిమ్ చేస్తే మరింత బాగుంటుంది. ఇవన్నీ ప్రక్కన పెడితే... ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశాన్ని మహేష్ వంటి సూపర్ స్టార్ ఎంచుకోవటం, అదీ పరాజయాల్లో ఉన్నప్పుడు గొప్ప విషయం..అందుకు ఆయన్ని అభినందించాలి. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హర్ష వర్ధన్ (మహేష్) చదువుపూర్తి చేసుకుని బిజినెస్ చూసుకోవాలని తండ్రి రవికాంత్(జగపతిబాబు) ఆశపడతాడు. అయితే తనకు అన్నీ ఉన్నా తనకు అనుకున్న సంతోషం దక్కలేదని ఇంకేదో కావాలని వెతుకుతూంటాడు హర్ష. ఆ క్రమంలో అతనికి చారుశీల(శృతిహాసన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తే...ఆమె హర్ష...ఫలానా రవికాంత్ కొడుకు అని తెలుసుకుని రిజెక్టు చేస్తుంది. దానికి కారణం...నీకు నీ సొంత ఊరు కూడా తెలియదు..మీ ఊరుకి ఏమీ చెయ్యలేదు అంటుంది. అప్పుడు తన సొంత ఊరు దేవరకోట అని తెలుసుకుని హర్ష అక్కడి వెళ్లతాడు. ఆ ఊరిలో చారుశీల తండ్రి నారాయణరావు(రాజేంద్రప్రసాద్)తో కలిసి ఆ ఊరుని బాగుచేయటం మొదలెడతాడు. అయితే అక్కడ లోకల్ గా శశి(సంపత్)అనే గూండా ఉండి అడ్డుపడతాడు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అంతేకాకుండా హర్ష కు ఇంకో షాక్ అయ్యే విషయం తెలుస్తుంది...ఇంతకీ హర్ష తెలుసుకున్న ఆ విషయం ఏమిటి...ఇంతకీ గ్రామంలో ఏం చేసాడు...చివరకు హర్ష ఆమె ప్రేమను ఎలా సాధించాడు. ముఖేష్ రుషి పాత్ర కథలో ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హర్ష వర్ధన్ (మహేష్) చదువుపూర్తి చేసుకుని బిజినెస్ చూసుకోవాలని తండ్రి రవికాంత్(జగపతిబాబు) ఆశపడతాడు. అయితే తనకు అన్నీ ఉన్నా తనకు అనుకున్న సంతోషం దక్కలేదని ఇంకేదో కావాలని వెతుకుతూంటాడు హర్ష. ఆ క్రమంలో అతనికి చారుశీల(శృతిహాసన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తే...ఆమె హర్ష...ఫలానా రవికాంత్ కొడుకు అని తెలుసుకుని రిజెక్టు చేస్తుంది. దానికి కారణం...నీకు నీ సొంత ఊరు కూడా తెలియదు..మీ ఊరుకి ఏమీ చెయ్యలేదు అంటుంది. అప్పుడు తన సొంత ఊరు దేవరకోట అని తెలుసుకుని హర్ష అక్కడి వెళ్లతాడు. ఆ ఊరిలో చారుశీల తండ్రి నారాయణరావు(రాజేంద్రప్రసాద్)తో కలిసి ఆ ఊరుని బాగుచేయటం మొదలెడతాడు. అయితే అక్కడ లోకల్ గా శశి(సంపత్)అనే గూండా ఉండి అడ్డుపడతాడు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అంతేకాకుండా హర్ష కు ఇంకో షాక్ అయ్యే విషయం తెలుస్తుంది...ఇంతకీ హర్ష తెలుసుకున్న ఆ విషయం ఏమిటి...ఇంతకీ గ్రామంలో ఏం చేసాడు...చివరకు హర్ష ఆమె ప్రేమను ఎలా సాధించాడు. ముఖేష్ రుషి పాత్ర కథలో ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇలా సూపర్ స్టార్ ని పెట్టుకుని ఆ ఇమేజ్ కు భంగం వాటిల్లకుండా అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్లలో తను అనుకున్న మెసేజ్ కప్పడిపోకుండా కథ రెడీ చేయటం కష్టమే. కాలు బ్యాలెన్స్ తప్పకుండా కాలువ మీద తాటిపట్టి మీద నడచి,అవతలి వైపు వెళ్లటం లాంటిది. అలాంటి ఫీట్ ని దాదాపు విజయవంతంగానే పూర్తి చేసాడు కొరటాల శివ. దానికి తోడు ఈ మధ్య కాలంలో గ్లోబులైజేషన్ నేపధ్యంలో మారుతున్న పల్లెటూరుని చూపే, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలు అరుదైపోయాయి. అడపా దడపా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చినా అవన్నీ వంశీ పల్లెటూరులో అప్పట్లో తీసిన సినిమాలను అనుకరిస్తూ వచ్చినవే..వస్తున్నవే.లేదా ఏ తమిళ సినిమాలో పల్లెటూరో ఉన్నట్లు లొకేషన్స్, క్యారెక్టర్స్ ఉంటున్నాయి. అంతేకానీ ఇప్పటి మన పల్లెని, గ్రామాలని అక్కడ కష్టాలని, ఆనందాలని,సమస్యలను చూపటం లేదు. అవన్నీ చూపటం మొదలెడితే అది మై విలేజ్ అని ఏదో డాక్యుమెంటరీ తీసినట్లు,చూసినట్లు తయారవుతున్నాయి. దాంతో దర్శక,రచయితలు ఇప్పుడొస్తున్న కథలన్నిటినీ అర్బన్ బ్యాక్ డ్రాప్ లోనే రాసేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సమయంలో గో బ్యాక్ టు విలేజెస్ అనే నినాదం మనస్సులో పెట్టుకుని సిని ప్రపంచానికి దూరమైపోతున్న విలేజ్ ని తెరపై ఆవిష్కరించాడు కొరటాల శివ. అదే సమయంలో గతంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ చేసిన అతడు చిత్రం ఛాయలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మహేష్ సైతం తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలన్న తపనతో చేసినట్లు కనపడుతుంది. జగపతిబాబు పాత్ర సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలిచేలా డిజైన్ చేసారు. అయితే మహేష్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కొత్తగానూ అదే సమయంలో ఎమేషన్ సీన్స్ బేస్ గా నడవటంతో కాస్త డల్ గానూ అనిపిస్తుంది.

×
×
  • Create New...