Jump to content

Andra Palakula Pida Inka Veedaledu


Recommended Posts

Posted

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రా గ్రహనం వీడలేదని, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 లేఖలు రాసిందని, ఎన్నో కొర్రీలు పెడుతోందని, ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా పత్రికలు అడ్డగోలుగా రాస్తున్నాయని, పాత ప్రాజెక్టులకు కొత్త సున్నాలు వేస్తున్నారని నమస్తే తెలంగాణ సంచలన కథనం ఇచ్చింది. ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా నిద్రపోనివ్వాలనుకోవడం లేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తమ సామ్రాజ్యం కుప్పకూలినట్టు, కిరీటం పడిపోయినట్టు వాళ్ళు భావిస్తున్నాయని, ఇవాళ సీమాంధ్ర మీడియా ప్రచురణలు, ప్రసారాల్లో సీమాంధ్ర కనిపించదని పేర్కొంది. అక్కడి ప్రజల కష్టాలు కనిపించవు, కానీ తెలంగాణ మీద చల్లుతున్న విషం పేజీ పేజీనా కనిపిస్తుందని, సీమాంధ్ర పాలకులు తమ రాష్ట్ర పాలన పట్టించుకోరని, తెలంగాణను దెబ్బ కొట్టేందుకు మాత్రం ఎత్తులు వేస్తుంటారని, తమ బానిసలను, మీడియాను ఉసిగొల్పుతుంటారని పేర్కొంది. తాజాగా సీమాంధ్ర పార్టీలు, మీడియా తెలంగాణ ప్రాజెక్టులకు లక్ష్యంగా చేసుకున్నాయని రాసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టుల మీద విషం చిమ్ముతున్నాయని పేర్కొంది. తెలంగాణ తన వాటా తాను వాడుకునేందుకు ఇప్పుడు సిద్ధమైతే భరించలేకపోతున్నారని పేర్కొంది. సీమాంధ్ర మీడియాకైతే నిద్రే పట్టడం లేదని ఎద్దేవా చేసింది. పోతిరెడ్డిపాడు కాలువను నదీమార్గంగా మార్చేసినపుడు, బేసిన్‌లో లేని ప్రాంతాలకు నదులకు నదులనే మళ్లించినపుడు నోరు విప్పని మీడియా ఇవాళ తెలంగాణ తన హక్కుగా నీరు వాడుకుంటే గగ్గోలు పెడుతున్నదని పేర్కొంది. సీమాంధ్రలో పట్టిసీమ చేపట్టిననాడు మాట్లాడని మీడియా ఇవాళ పాలమూరు, డిండి రెండు కొత్త ప్రాజెక్టులేనని రుజువు చేయడానికి పడరాని పాట్లు పడుతున్నదని పేర్కొంది. ఎప్పుడో జీవోలు వచ్చాక ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఎలా అవుతాయని పేర్కొంది.

 

ఏపీ మంత్రి దేవినేని పనిగట్టుకుని పత్రికాసమావేశం పెట్టి ఇవి అక్రమ ప్రాజెక్టులని ప్రకటించారంటేనే ఏపీ పాలకులకు తెలంగాణ మీద ఉన్న కుట్ర స్వభావాన్ని అర్థంచేసుకోవచ్చని రాసింది. 22.4.2014న మహబూబ్‌నగర్ జిల్లాను సందర్శించిన అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని తన ప్రసంగంలో దశాబ్దం క్రితం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం విపరీతమైన జాప్యానికి గురవుతున్నదని ప్రస్తావించారు. ఇప్పుడు అదే పాలమూరు ప్రాజెక్టు ఎలా కొత్త ప్రాజెక్టుగా మారిందని ప్రశ్నించింది.

 

పాలమూరు, డిండిలపై ఇంత రాద్ధాంతం చేస్తున్న బాబు తన కింద నలుపును మాత్రం దాచేస్తున్నారని, పట్టిసీమ అనే ప్రాజెక్టు రాష్ట్ర విభజన వరకు ఎవరికీ తెలియదని, కేంద్ర జలసంఘం కూడా ఈ పేరుతో ఒక ప్రాజెక్టు ఉన్నట్టు ఎపుడూ వినలేదని స్పష్టం చేసిందని రాసింది. ఈ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని ఏపీ సీఎం చెబుతున్నారని, కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి పట్టిసీమ అనే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికిగానీ, తమ శాఖకుగానీ ఎలాంటి సమాచారం లేదన్నారని, ఈ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే కాదని కూడా కుండబద్దలు కొట్టారని గుర్తు చేసింది.

 

కెసిఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ఆంధ్రా పార్టీలు అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని అభిప్రాయపడింది. విద్యుత్, న్యాయవ్యవస్థ, విద్యా వ్యవస్థ, హైదరాబాద్.. ఇలా అన్నింటి పైన కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. మహబూబ్ నగర్ ప్రాజెక్టు పైన చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు అంటూ ప్రచురించింది.

 

Posted

andhra valla kutra PK-1_1.gif?1344496355PK-1_1.gif?1344496355

Posted

andhra valla kutra PK-1_1.gif?1344496355PK-1_1.gif?1344496355

 

Inka enni dinalu ee muchata cheptaru PK-1_1.gif?1344496355

Posted

KChiR mandu manese daanka.....



Inka enni dinalu ee muchata cheptaru PK-1_1.gif?1344496355

Posted

KChiR mandu manese daanka.....


 

 

aithe inka aagadannamaata uGHqUQx.gif

Posted

ela kannadu raa baabu mee ayya neelanti vaanni..... PK-1_1.gif?1344496355

Posted

Haha... Okavela adhika madhyam sevinchi poina, pota pota gaudugede gaadi chetilo whisky bottle, dubai sheikla daggara pakkalu charche daani chetilo eeta kalla bottle petti potadu kada bro....


aithe inka aagadannamaata uGHqUQx.gif

Posted

ela kannadu raa baabu mee ayya neelanti vaanni..... PK-1_1.gif?1344496355

 

mistakes happens.. 

×
×
  • Create New...