Jump to content

Punchhhh....


Recommended Posts

Posted

Comments - ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు.
విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?
రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : గడ్డి..
వి : మరి తెల్లమేకకు..?
రై : గడ్డి..
వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?
రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?
వి : నల్లమేకను..
రై : బయటి వసారాలో..!!
వి : మరి తెల్లమేకను..?
రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!
వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : నీటితో..
వి : మరి తెల్లమేకకు..?
రై : దానికి కూడా నీటితో..!!
వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?
రై : ఎందుకంటే నల్లమేక నాది.
వి: మరి తెల్లమేక..?
.
.
.
.
.
.
.
రై : అదికూడా నాదే..!!
.
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు..
ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి
తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా
ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?
మెరుగైన సమాజం కోసం...
చూస్తూనే ఉండండి...

Posted

dubbed aa.... lol,hindhi lo chinnappudu chadhivaale :D

 

Posted

dubbed aa.... lol,hindhi lo chinnappudu chadhivaale :D


Dayyalaa maanthrika mayya namasthee...
×
×
  • Create New...