Jump to content

105 Crores Transfer Chesi Malli Case Filing? Vahrevah Apseb


Recommended Posts

Posted

ఇంటర్ నిధులు ముట్టుకోవద్దని హైకోర్టు ఆదేశం
- తెలంగాణ ఏజీ వాదనతో మారిన సీన్
- ఏపీ పిటిషనే దురుద్దేశపూరితం
- 105కోట్లు అక్రమంగా తరలించింది
- మిగతా సొమ్ము కూడా పోతుందనే ఖాతాల స్తంభన
-కోర్టుకు నివేదించిన తెలంగాణ ఏజీ

ఇప్పటికే రూ.105 కోట్లు తరలించుకుపోయారు
ఇంటర్‌బోర్డు బ్యాంకు ఖాతాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని ఏజీ స్పష్టంచేశారు. విభజన చట్టంలోని పదో షెడ్యూల్ 27వ క్రమసంఖ్యలో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల స్తంభనపై హైకోర్టు 2015 మే ఒకటిన ప్రకటించిన తీర్పును ఏజీ గుర్తుచేశారు. పదో షెడ్యూల్‌లోని సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే వాటిపై ఆ రాష్ర్టానికే సర్వ హక్కులుంటాయని కోర్టు తీర్పు వెలువరించిందని వివరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఈ తీర్పు నేపథ్యంలో తన సలహా తీసుకొనే జూన్ 9, 10 తేదీల్లో బ్యాంక్ ఖాతాల విషయంలో ఏపీ ఇంటర్ బోర్డుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి లేఖ రాశారని, ఆ వెంటనే హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ ఖాతా నుంచి ఏపీ ఇంటర్‌బోర్డు రూ.105 కోట్లను విజయవాడలోని ఆంధ్రాబ్యాంకుకు తరలించిందని చెప్పారు.

ఈ నిధుల తరలింపు విషయంపై వివరణ కోరినా స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని, అందుకోసం తానే స్వయంగా పిటిషన్ తయారు చేసినట్లు ఏజీ నివేదించారు. అయితే, సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్ వ్యవహారంలో డాక్యుమెంట్లను బదిలీ చేసే సమయంలో అధికారుల పొరపాటుతో ఆ పిటిషన్ ప్రతులు ఏపీ అధికారుల చేతికి అందాయని, దాంతో వారు అత్యవసరంగా పిటిషన్ వేశారని చెప్పారు. రూ 105 కోట్లను తరలించినట్లుగానే ఖాతాలోని మిగిలిన సొమ్మును కూడా అక్రమంగా తరలిస్తారనే అనుమానంతోనే ఖాతాను స్తంభింపచేయాలని కార్యదర్శి లేఖ రాశారని తెలిపారు.

దాంతో ధర్మాసనం స్పందిస్తూ ఏజీ వాదనల తర్వాత నిర్ణయం ప్రకటించాలని అనుకున్నామని, కానీ ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది. దీనిపై రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. రూ 105 కోట్ల తరలింపు, బ్యాంక్ అకౌంట్ల స్తంభనపై మొత్తంగా విచారణ చేపట్టాలని కోరారు. ఆయన వినతిని పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం, బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం ఉన్న నిధులను అలాగే ఉంచాలని, ఖాతాల ద్వారా లావాదేవీలు మాత్రం కొనసాగించడానికి అనుమతిస్తామని పేర్కొంది. అయితే, ఖాతాలోని నిధులను తీసుకోబోమని హామీ ఇస్తేనే ఆ విధమైన ఆదేశాలిస్తామని ఏపీ ఏజీకి స్పష్టంచేసింది. ఆ షరతుకు ఏపీ ఏజీ అంగీకరించటంతో ఖాతాల నిర్వహణకు కోర్టు అనుమతిచ్చింది. ఈ వ్యవహారంపై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

  • Replies 62
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • gundubabu

    7

  • aadwi

    7

  • ChandraSekharCherukuri

    6

  • posaanisam

    5

Posted

NT artcile  ()>>  ()>>

 

goosebumps achinaaya ledhaa
 

Posted

goosebumps achinaaya ledhaa
 

jagan speech kante ekkuva vachey gallery_12949_2_610729.gif

Posted

NT v6 laanti reliable source untey veyu :(

NT already postd knw, v6 knchm bettr gallery_12949_2_610729.gif

Posted

inka vachi edavadam begins....ninna edo complete ga telvakundane evado vesadu thread TG board ki high court punch ani...

Posted

inka vachi edavadam begins....ninna edo complete ga telvakundane evado vesadu thread TG board ki high court punch ani...

 

 

please stay on the line your crying is important to us

 

this crying will be recorded for training and quality evaluation purpose

Posted

NT already postd knw, v6 knchm bettr gallery_12949_2_610729.gif

NT and V6 are relaible sources ani Arjjun baa cheppadu 


ABN and al other snews lo vasthe fake avi photo-thumb-35771.jpg?_r=1437854486

Posted

NT and V6 are relaible sources ani Arjjun baa cheppadu


ABN and al other snews lo vasthe fake avi photo-thumb-35771.jpg?_r=1437854486

abn thappa anni fake ba
Posted

abn thappa anni fake ba

For me Sakshi is 500% genuine 

edaki poyav Rajanna kota-comedy1-o.gif?1290163557

×
×
  • Create New...