Jump to content

Recommended Posts

Posted

తిక్క రేపిన....‘కిక్-2’ చిత్ర సమీక్ష
తిక్క రేపిన....‘కిక్-2’ చిత్ర సమీక్ష

సినీ వినోదం రేటింగ్ : 2/5

నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకం ఫై వక్కంతం వంశీ రచన , సురేందర్‌ రెడ్డి దర్శకత్వం లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు

అమెరికా లో ఉన్న కిక్ (రవితేజ) కొడుకు రాబిన్ హుడ్ (రవితేజ). కంఫర్ట్ గా ఉండటమే అతని ప్రధాన ధ్యేయం. తనకు తను కంఫర్ట్ గా ఉండాలంటే డాక్టర్ అవ్వడం కరెక్ట్ అనుకుని మెడిసిన్ చదువుతాడు. తన కోసం ఓ హాస్పటల్ కట్టుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న తన తాత స్థలం ఇవ్వమని తండ్రి కిక్ ని అడుగుతాడు. ఆ స్థలం కబ్జాలో ఉందని చెప్పడంతో యు.యస్ నుంచి హైదరాబాద్ వస్తాడు. తన స్థలం కబ్జా చేసిన సెటిల్ మెంట్ దుర్గ (ఆశిష్ విద్యార్ధి) ని కలిసి రాబిన్ హుడ్ - తన స్థలం తనకు ఇచ్చేయమని అడుగుతాడు. కానీ రౌడీ అయిన దుర్గ ఇందుకు ఒప్పుకోడు. దాంతో చాలా కంఫర్ట్ గా అతనే తనకు స్థలం ఇచ్చేలా చేస్తానని చెప్పి, రాబిన్ హుడ్ తెలివితేటలను ఉపయోగించి అన్నంత పని చేస్తాడు. ఈ సమయంలో రోడ్డు మీద కంఫర్ట్ గా ఉన్న తనను యాక్సిడెంట్ చేసి కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోయిన బలరామ్ (మధు)ని వెతుక్కుంటూ వెళ్లి చితక్కొడతాడు రాబిన్ హుడ్. అక్కడే ఉన్న చందు రాబిన్ హుడ్ లోని పోరాట పటిమను గ్రహించి ... అతని తో బీహార్ లోని తమ గ్రామానికి పట్టిన గ్రహణం వదిలించాలనుకుంటాడు

రాబిన్ హుడ్ కి ఓ కాఫీ షాపులో పరిచయం అవుతుంది చైత్ర (రకుల్ ప్రీత్ సింగ్). అతనిని ప్రేమిస్తుంది. కానీ తనకు కంఫర్ట్ గా ఉంటేనే ప్రేమిస్తానని, లేకపోతే ఫీల్ అవ్వకూడదని చెప్పేస్తాడు రాబిన్. హైదరాబాద్ లో తనకు దక్కాల్సిన స్థలం దక్కడంతో యు.యస్ వెళ్లడానికి సిద్ధపడతాడు రాబిన్. తనను ప్రేమించిన చైత్రను ఓ ఫ్రెండ్ గానే భావించి వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన తర్వాత చైత్రను తను ప్రేమిస్తున్న విషయం గ్రహించి ఆమె కోసం తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు చైత్ర హైదరాబాద్ అమ్మాయి కాదని, ఆమె బీహార్ లోని విలాస్ పూర్ గ్రామానికి చెందిన అమ్మాయని తెలుసుకుంటాడు. ఆమె కోసం విలాస్ పూర్ బయలుదేరతాడు. అక్కడ సోలమన్‌ సింగ్‌ ఠాకూర్‌(రవికిషన్‌)దే రాజ్యం. అసలు చైత్ర ఎవరు? ఆమె రాబిన్ ని విలాస్ పూర్ ఎందుకు రప్పిస్తుంది? విలాస్ పూర్ లో ఉన్న పరిస్థితులు ఏంటి ... దాన్ని హీరో ఎలా సరిచేసాడనేది సినిమాలో చూడాలి ....

గతం లో రవితేజ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'కిక్' మంచి విజయం సాధించడం... దానికి తోడు ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించడం తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది . అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది . ఇందులో హీరో తరచూ 'కంఫర్ట్' అనే మాట వాడుతుంటాడు ... అయితే ప్రేక్షకులు మాత్రం మహా చిరాకుతో ఈ సినిమా చూసి బయట పడతారు. ఎక్కడో బీహార్ లోని ఓ కు గ్రామానికి చెందిన వ్యక్తి ఇక్కడ జడ్చెర్ల లో జరిగిన సంఘటనలో గడకర్రలా కనిపించే హీరో పోరాటాన్ని చూసి ... అసలు దేశం లోనే ఇంతకన్నా మొనగాడు లేడనే విధం గా అతని వెంటపడటం , ఆఖరికి అమ్మాయిని ప్రయోగించి తమ ఊరికి రప్పించడం ...తెలుగు కూడా నేర్చేసుకుని ,హీరో కోసం భారీ గా ఖర్చు చెయ్యడం ... అసలు విషయం అతనికి తెలియకుండా అర్ధం లేని నాటకాలాడటం ... ఇందులో ప్రధానాంశం . విలాస్ పూర్ గ్రామస్తుల్లో ప్రధాన పాత్రలకి హిందీ అర్టిస్తుల్ని పెట్టి, ఈ చిత్రాన్ని ఎంత పేలవం గా తియ్యాలో అంత నిస్సారం గా తీసారు . దీనికి సురేంద్ర రెడ్డి దర్శకుడంటే నమ్మబుద్ధి కాదు . ఇటువంటి డ్రామా కధాంశాలు అందరూ హ్యాండిల్ చెయ్యలేరు . కోన వెంకట్ ,శ్రీను వైట్ల వంటి వారు ఇందులో ప్రసిద్ధులు . వక్కంతం వంశీ రచన ఈ చిత్రానికి హై లెట్ అని భావించారు . అయితే అది వ్యతిరేక ఫలితాలనే ఇచ్చింది . కధాంశం సంగతి పక్కన పెడితే ... వంశీ రాసిన సంభాషణలు కూడా చప్ప చప్పగా ఉన్నాయి .

కామెడి పండించడం లో రవితేజది ఒక ప్రత్యేక బాణీ . బలహీన మైన సీన్ ని కూడా తన నటన తో పండించగలడు . ఇందులో కూడా చాలా బాగా చేసాడు .కానీ సినిమా రెండవ భాగం లో అతని క్యారెక్టరైజేషన్ మరీ వీక్ . అలాగే , యంగ్ గా కనిపించడం కోసం అతని తాపత్రయం వల్ల మరీ పీలగా, ఇబ్బందికరం గా కనిపించాడు . రవితేజ, బ్రహ్మానందం జంట ఇందులో కూడా కొన్ని నవ్వులు పండించారు,కానీ ఆశించిన స్థాయి హాస్యం పండలేదు . రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్యారెక్టర్‌ కి సరైన గ్రాఫ్ లేదు . అయినా , ఆమె మాత్రం తన గ్లామర్‌తో,నటనతో ఓకే అనిపించుకోగలిగింది. సంజయ్‌ మిశ్రా, రాజ్‌పాల్‌ యాదవ్‌ కామెడీ ఫలించలేదు . రవికిషన్‌, కబీర్‌ ఫర్లేదనిపించారు. ఉన్నంతలో తనికెళ్ల భరణి క్యారెక్టర్‌ బాగుంది ... .దీనికి మంచి డై లాగ్స్ తోడైతే సినిమాకి ప్లస్ అయ్యేది . సి జి వర్క్ తో పాటు , మనోజ్‌ పరమహంస ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్‌గా మనోజ్‌ తన శక్తిమేరకు బాగా చూపించే ప్రయత్నం చేశాడు. కళ్యాణ్‌రామ్‌ ఖర్చుకి వెనుకాడలేదనే సంగతి స్పష్టంగా కనిపించింది. థమన్‌ పాటలు అంతంత మాత్రం గానే ఉన్నాయి . బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమా కి బలాన్ని చేకూర్చాలనే తమన్ కష్టాన్ని అభినందించాలి - రాజేష్

Posted

Ravi teja gaadu inka character artist ayithe better, like Jagapati Babu

×
×
  • Create New...