Jump to content

Recommended Posts

Posted

                    

                                                 download.jpg





కథ:

‘కిక్’ కళ్యాణ్ దొంగతనాలు మానేసి పోలీసు ఉద్యోగంలో చేరాక.. అది బోర్ కొట్టేసి అమెరికాకు వెళ్లి సెటిలవుతాడు. అతడి కొడుకు రాబిన్ హుడ్ (రవితేజ) కళ్యాణ్ కంటే తేడాగా తయారవుతాడు. తండ్రి ఎదుటోళ్లను ఆనందంగా ఉంచడంలో కిక్కు వెతుక్కుంటే.. ఇతను తన కంఫర్టే అన్నింటికన్నా ముఖ్యం అనుకునే టైపు. తన తండ్రి ఆస్తిని ఎవరో రౌడీ కబ్జా చేశాడని తెలుసుకుని దాన్ని దక్కించుకోవడానిక�� � హైదరాబాద్ కు వచ్చిన రాబిన్  కి  చైత్ర (రకుల్ ప్రీత్ సింగ్) పరిచయమవుతుంది . చైత్ర ప్రేమలో పడ్డ రాబిన్ విలాస్ పుర్  అనే గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ ఆటను ఎదుర్కున్న పరిస్థితులేంటి  అనేది మిగతా కధ.


కథనం - విశ్లేషణ:

ఫస్టాఫ్ లో  హీరో  ఇంట్రో , మరోపక్క విలాస్ పూర్ లో విలన్ అరాచకాలని  చూపిస్తూ సినిమా ఘనంగానే ఆరంభమవుతుంది. అలాగే ఫస్ట్ ఫైట్ తో హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు సినిమాపై మరింత ఆసక్తి  కలిగేలా  చేస్తుంది. ఆ తరువాత బ్రహ్మి- రవితేజ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మి ఇల్లు అమ్మేసే సన్నివేశం చాలా  బాగా వర్కౌట్ అయింది. ఆ తరువాత వచ్చే కోవై సరళ-పోసాని సన్నివేశం కాస్త ఓవర్ అయినా ఒకానొక  ట్విస్ట్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే లో ఉన్న లాక్ వల్ల హీరో క్యారెక్టర్ పాసివ్ అయిపోయి, గ్రామస్తుల గోల ఎక్కువవడం , ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కి కామెడీ ట్రీట్మెంట్  అంతగా ఆకట్టుకోలేదు. హీరో కి విలన్ కి మధ్య శత్రుత్వం అనేది లేదు, గ్రామస్తుల భాదలు హీరో తెలుసుకుని తిరగబడడానికి సరైన సన్నివేశాలు లేకుండా  హీరో కి అసలు నిజం  తెలియకుండా గ్రామస్తుల రకరకాల ప్లాన్ లు వేసే కామెడి సీన్స్ తో టైం  పాస్  చేసాడు దర్శకుడు.  వాళ్ళు తమ  భాదని దిగమింగుకుని తంటాలు పడుతున్నారు అన్న ఫీలింగ్  కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ అవలేదు . హీరో విలన్  ని ఎదుర్కోవడానికి మంచి లీడ్ కావలసిన కమలాభాయి కూతురు ఎపిసోడ్ ని అసలు టచ్ చేయకుండా పక్కా  సినిమాటిక్ సిచుయేషన్  లో  హీరో-విలన్ ని ఎదుర్కునేలా ప్లాన్ చేయడం తో సరైన ఎమోషన్ పండలేదు. అయితే   టెంపుల్ ఫైట్ నుండి కధనం ఊపందుకుంటుంది, ముఖ్యంగా హాస్పిటల్ సీన్ సినిమాకే హైలైట్ గా  చెప్పుకోవచ్చు. చివరి అరగంట కధనాన్ని వేగంగా నడిపి కాస్త ఆకట్టుకుంటాడు దర్శకుడు.


నటీనటులు: రవితేజ ఎప్పటిలానే తనదైన  ఎనర్జీతో అలరించాడు, వీలు చిక్కినపుడల్లా చెలరేగిపోయాడు.  రకుల్ ప్రీత్ సింగ్ పరవాలేదు, విలన్ గా  రవి కిషన్ రేసుగుర్రం లోని ఓవరాక్షన్ కంటిన్యూ చేసాడు. జిల్ ఫేం కబీర్ ఒకే. తనికెళ్ళ భరణి ఒకే  , గ్రామస్తులు గా  నటించిన వాళ్ళలో  రాజ్ పాల్ యాదవ్ ఇరిటేట్ చేయగా మిగత నటులు పరవాలేదు  అనిపించుకున్నార ు  అందరు ఒకే. బ్రహ్మి కామెడీ షరా మామూలే.


ఇతర సాంకేతిక వర్గం:  డైలాగ్స్ బాగానే ఉన్నాయి. మనోజ్ పరమహంస కేమెరా  వర్క్ చాలా  బాగుంది, తమన్ సంగీతం లో పాటలు పరవాలేదు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగుంది. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది, సెకండాఫ్ పై మరింత జాగ్రత్త తీసుకుని ఉంటె అవుట్పుట్ మరింత బాగుండేది.



రేటింగ్: 5.5/10

 
×
×
  • Create New...