Jump to content

Onion Sollu Story


Recommended Posts

Posted

ఉల్లిపాయలు, టమాట, ఉప్పు మంచి స్నేహితులు... ఈ మూడు శివరాత్రికి శివదర్శనం కోసం శ్రీశైలం వెళ్ళాయి.. విపరీతంగా జనం.. సరే దర్శనానికి ముందు స్నానం చెయ్యాలి కదా మూడు పాతళగంగకి వెళ్ళాయి... విపరీతమయిన జనం.. జనం కాళ్ళ కింద పడి టమాట నలిగిపోయింది... మిత్రుడు చనిపోయాడు అని ఉప్పు, ఉల్లిపాయ చాలాసేపు భాధపడ్డాయి.. గుండె ధైర్యం తెచ్చుకుని ఉప్పు, ఉల్లిపాయ పాతాళగంగలోకి దిగాయి.. నీళ్ళల్లోఉప్పు కూడా కరిగిపోయింది... ఈ మిత్రుడు కూడా చనిపోయేసరికి ఉల్లిపాయ చాలాసేపు ఏడ్చింది.. ఇంతలో దానికి ఒక అనుమానం వచ్చింది.. టమాట చచ్చిపోతే ఇద్దరం ఏడ్చాము.. ఉప్పు చనిపోతె నేను ఏడ్చాను... మరి నేను కూడా పోతే ఎవరు ఏడుస్తారు అని?? ఆ అనుమానాన్ని శివుడు ముందు మొర పెట్టుకుని ఏడ్చింది.. వెంటనే శివుడు ఒక వరం ఇచ్చాడు.. ఆ వరమే ఉల్లిని కోసినా కన్నీళ్ళే... కొందామన్నా కన్నీళ్ళే....

ఇంతకి శివుడు ఏమని ఇచ్చి ఉంటాడు వరం ఉల్లిపాయకి????

 

×
×
  • Create New...