Jump to content

Oka God Pk Pan


Recommended Posts

Posted

పవన్ కళ్యాణ్ నా అభిమాన నటుడు కాదు నా స్పూర్తిదాత తెలుగు సినిమాలో ఎంతోమంది నటులు ఉన్న నేను ఎందుకు ఈయన అభిమానే అయ్యాను...?? ప్రశ్నచిన్నదే సమాధానం శూన్యం. మిగితా వాళ్ళతో పోలిస్తే అంత అందగాడు కాదు,పొడుగు లేడు,నాట్యం రాదు,కండలుతిరిగే దేహం కాదు మరి ఎందుకు ఏ అభిమానిని అడిగినా సమాదానం తెలిదనే అంటాడు. కచ్చితంగా సినిమాలు చూసి మాత్రమే కాదు వ్యక్తిగతంగా చూసి కూడా మనకి ఎవరీనా నచ్చితే తెలుసుకోకుండా ఉండము అదే అభిమాన నటుడు గురించి అయితే 360 డిగ్రీలు తెలుసుకుంటాం అలా ఎంత వెతికితే అంత దొరకగా అంచులంచులగ అభిమానం పెరుగుతూ వచిందే తప్ప ఎక్కడ వెలితి కనిపీల. నేను ఆయన గొప్పవాడు అనట్ల మనిషిలొ ఉండే లక్షణాలు ఉన్నాయి మనలా మృగాల్ల పక్కవాడు భాధాల్లో ఉంటే నవ్వే మనిషి కాదు చేత అయినంత సహాయం చేసే మనిషి గుణాలు ఉన్నాయ్ సహాయం చేయలేకపోయిన చూసి జాలి పడతాడు తప్ప నవ్వడు. ఖుషి సినిమానించి ఆయన అభిమానిగా మారిపోయా మొదట సినిమా వల్లే కాగ రాను రాను ఆయన వ్యక్తిగతoగా అభిమానం కాస్త పిచ్చిగా మార్చింది. ఆయనలో ఎదో ఆకర్షణ ఉంది లేక పోతే నాదే పిచి అనుకుంటే నాకంటే ఎక్కుమంది ఎందుకు ఉంటారు.ఆయనలోని నిజాయితి,మరియాద,భయంలేని గుణం,అందరికి అవకాశo దొరుకుతుంది నీ పని నువ్వు చేస్కుంటూ పో,పక్క వాడు రాక్షసుడి అయి నిన్ను కిందికి లాగిన కుంగిపోకు విజయం సాధించినపుడు పొంగిపోకు రాక్షసుడి మీదకు యుద్ధానికి వేళ్ళకు మంచి చెడులు చూడటానికి దేవుడుఉన్నాడు,నీ కోపం పక్కవాడి ఫై చూపికు,నీ భాదను కసిగా మార్చుకో ఎవ్వరికి చెప్పకు చెపితే భాదపాడేవాళ్ళ కన్నా నీకు సమస్యలున్నాయి అన్న సంతృప్తిపదేవల్లె ఎక్కువ,కష్టాన్నినమ్ముకో కాని నేలని మర్చిపోకు,పక్క వాడు నీ వళ్ళ నష్టపోకూడదు వేరే వాళ్ళ వల్ల నష్టపోయిన నువ్వు చూస్తుఉండకు ఇంకా చాల దీనిలో ఒక్కటి ఆయన చెప్పినవి లేవు ఆయన చేతల్లో మేము గుర్తిన్చినవే.మిగితా అబిమానులతో గొడవ పడతాం అన్నాతమ్ముడు గొడవ పడినట్టు అంతే.నాకు అనిపిచ్చింది చెప్పా ఏదో మీ తిట్లు పొగడ్తల కోసం మాత్రం కాదు. హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఏది చేసిన ఎం అన్న మీ వెన్నంటే ఉంటాం,నడుస్తాం అది మీ పైన మాకు ఉన్న నమ్మకం. జైహింద్

×
×
  • Create New...