ye maaya chesave Posted September 5, 2015 Report Posted September 5, 2015 కథ: లక్కరాజు అలియాస్ లక్కీ (నాని) ఓ మతిమరుపు మహారాజు. ఆ మతిమరుపు వల్లే తనకు పిల్లనివ్వడానికి వచ్చిన మామ గురించి మరిచిపోయి ఫ్రెండుతో ముచ్చట్లు చెబుతుంటాడు. దీంతో అతడికి మామ కావాల్సిన వ్యక్తి అతణ్ని అసహ్యించుకుని వెళ్లిపోతాడు. ఐతే ఇదే మతిమరుపు వల్ల అనుకోకుండా అతడి కూతురితోనే (లావణ్య) లక్కీకి పరిచయ భాగ్యం దక్కుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఐతే తనను అసహ్యించుకున్న వ్యక్తే తనకు కాబోయే మావ అని లక్కీకి తెలుస్తుంది. ఇలాంటి స్థితిలో తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేసాడు అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ: కధగా చూస్తే చాలా సింపుల్ లైన్, సాధారణంగా ప్రతి మనిషి లో ఉండే మతిమరుపే హీరో కి కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది . సింగిల్ లైన్ ని పట్టుకుని కామెడీ సహాయం తో సినిమాని నడిపించాడు మారుతి. హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే మొదటి సన్నివేశం లోనే మారుతి మార్కులు కొట్టేసాడు. సినిమా అంతా హీరో కి ఉన్న లోపాన్ని బాగా వాడుకుని కామెడీ పండించాడు. హీరోయిన్ కి తన మతిమరుపు గురించి చెప్పకుండా హీరో మేనేజ్ చేసే సందర్భాలన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. కొన్నిసార్లు హీరో మీద కోపం, మరికొన్ని సార్లు సానుభూతి కలిగేలా, ఆ క్యారెక్టర్ లోపం మనకు తెలిసి ఎప్పుడు ఎం చేస్తాడో ఎం మరిచిపోతా డో అన్న భయం సినిమా అంతా కొనసాగేలా ఆయా సన్నివేశాలు బాగా ఉపయోగ పడ్డాయి. ముఖ్యంగా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' స్పూఫ్ సీన్, చివర్లో హీరోకి ఇంకా మతిమరుపు తగ్గలేదు అని చూపించే ముగింపు సన్నివేశాల్లో దర్శకుడి ముద్ర కనిపిస్తుంది. అతనికి నాని పెర్ఫార్మన్స్ తోడవ్వడంతో హీరో క్యారెక్టర్ ద్వారా పండిన కామెడీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది ఐతే ఫస్టాఫ్ లో నాన్ స్టాప్ ఎంటర్తైన్మెంట్ ని అందిచడంలో ఫస్ట్ క్లాసు లో పాస్ అయిన మారుతి సెకండాఫ్ లో రొటీన్ కన్ఫ్యూజన్ కామెడీ ఫార్ములా ని నమ్ముకోవడం తో ఆ ఫ్లో ని కంటిన్యూ చేయలేకపోయాడు. వెన్నెల కిశోర్ పరిచయ సన్నివేశం, ఆ తరువాత తను హీరో ప్లేస్ లో వెళ్ళే మురళి శర్మ/అజయ్ కాంబినేషన్ సీన్ లో కామెడి బాగా పండింది. హీరో తనకి తానుగా తన లోపాన్ని దాచిపెట్టడం అతని పరిస్థితి ప్రకారం ఎంత కరెక్ట్ అయినప్పటికీ ఆ ప్రాసెస్ అంతగా ఆకట్టుకోలేదు. పైగా ముందే చెప్పుకున్నట్టు కన్ఫ్యూజన్ కామెడీ ఫార్ములా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిందే ,కాకపొతే ఎప్పుడూ బ్రహ్మి చేసే రోల్ ని ఈసారి శ్రీనివాసరెడ్డి పోషించాడు అంతే తేడా. ఆ కామెడీ ని కాస్త తగ్గించి ,హీరోయిన్ తండ్రి పాత్ర చివర్లో ట్విస్ట్ ఇచ్చే సీన్ పై మరింత శ్రద్ద వహించి ఉంటే బాగుండేది. నటీనటులు:సినిమాకి దర్శకుడు మారుతి తో పాటు సమానంగా క్రెడిట్ కొట్టే క్యారెక్టర్ దక్కింది నాని కి, ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు సినిమా అంతా తానే అన్నట్టు కనిపించిన నాని కామేడి ఆదరగోట్టటం తో పాటు ఉన్న ఒకే ఒక్క ఎమోషనల్ సీన్ లో కూడా ఆకట్టుకున్నాడు ప్రీ క్లైమాక్స్ లో. లావణ్య త్రిపాటి హీరోయిన్ పాత్రకి సరిపోయింది. హీరోయిన్ తండ్రిగా మురళి శర్మ మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ని అవలీలగా పోషించాడు. నరేష్ , సితార ఉన్నంత లో తమ ఉనికిని చాటుకున్నారు, అజయ్ క్యారెక్టర్ కి మొదట్లో ఇచ్చిన బిల్డప్ బాగున్నా, ఆ తరువాత తేలిపోయింది. వెన్నెల కిశోర్ బాగానే నవ్వించాడు, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఒకే. సాంకేతికవర్గం: డైలాగ్స్ బాగానే ఉన్నాయి, గోపి సుందర్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి, ముఖ్యంగా 'మొట్టమొదటిసారి' పాట చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదు. కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ ఒకే. రేటింగ్: 6/10
andhrapradesh@123 Posted September 5, 2015 Report Posted September 5, 2015 9/10 idhi aakhari sari - ide nijamaina review.
jamesbond Posted September 5, 2015 Report Posted September 5, 2015 Cinema hit, blockbuster antunte.. 6 out of 10 aa...... jambalakadipamba review
mustang302 Posted September 5, 2015 Report Posted September 5, 2015 nani gaadi range ki IH antunnaru mari...!!
tom brady Posted September 5, 2015 Report Posted September 5, 2015 6/10 takkuva deeniki...nee reviews lo quality thaggutondi unkul
mahesh1 Posted September 5, 2015 Report Posted September 5, 2015 Evadu eee pilla aakathayi Balayya babu fan from Mumbai
Picha lite Posted September 5, 2015 Report Posted September 5, 2015 6/10 takkuva deeniki...nee reviews lo quality thaggutondi unkul Last ki review kuda great andhrA nunchi copy dengaaduu, andharu reviews rayatame
Tadika Posted September 5, 2015 Report Posted September 5, 2015 CP ga nee reviews chusi thiduthunnarra ninnu
Recommended Posts