Jump to content

Recommended Posts

Posted
కళ్లు బైర్లు కమ్మేలా ఢిల్లీ టాప్ లాయర్ల ఫీజు
న్యూఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్. ఎలైట్ క్లాస్‌కు చెందిన సీనియర్ అడ్వకేట్లు ఇక్కడే నివసిస్తుంటారు. ఒక్కో హియరింగ్ కు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలు తీసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే అడ్వకేట్లు నివసించే రోడ్డు ఇదే. ఇదంతా చూస్తుంటే దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న సీనియర్ అడ్వకేట్స్ గురించేనా మాట్లాడేది అంటే అవును. ఎలైట్ క్లాస్‌కు చెందిన వీరు వసూలు చేసే ఫీజు ఎంతో చూస్తే మీ కళ్లు తిరుగుతాయి. వీరంతా సుప్రీంకోర్టులోనే పని చేస్తుంటారు. దేశ న్యాయవ్వవస్థలో అపర మేధావిగా పేరుగాంచిన రాం జెఠ్మలానీ ఢిల్లీలోనే కాదు, దేశంలో ఏ కోర్టులో వాదించాలన్నా రామ్ జెఠ్మలాని ఒక్కో హియరింగ్ కు మినిమం రూ. 25 లక్షలు తీసుకుంటారు. మనదేశంలో ఏ రాజకీయనాయకుడైనా అవినీతి చేసి దొరికిపోతే వారికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు రాం జెఠ్మలానీ. మన దేశంలో రాజకీయ నేతలైన లాయర్లు కూడా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న వారిలో ఉన్నారు. మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం ఒక్కో హియరింగ్‌కు రూ. 6 నుంచి 7 లక్షలు తీసుకుంటారు. ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు ఫాలీ నారీమన్ రూ. 11 నుంచి 15 లక్షలు తీసుకుంటారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా ఒక్కో హియరింగ్ కు రూ. 8 నుంచి 15 లక్షలు తీసుకుంటారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, హరీష్ సాల్వేలు సైతం రూ. 6 నుంచి 15 లక్షలు వరకు తీసుకుంటున్నారు.
 
 

Posted

Nalsar lo admissions eppudu start avuthayi bhayaaa???

 

nee bidda emayyindu... kanapadta ledu... ban cheyinchava??

×
×
  • Create New...