ramudu3 Posted September 14, 2015 Report Posted September 14, 2015 దువ్విన తలనే దువ్వడం.. అద్దిన పౌడరు అద్దడం..అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం.. ఉండి ఉండి నవ్వడం నవ్వి చుట్టూ చూడడం...! ఇవన్నీ ప్రేమకు సంబంధించిన వింత లక్షణాలే! మనం ఎవరినైనా ప్రేమిస్తున్నా లేక మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలన్నా అది కొంచెం కష్టమైనపనే. ప్రేమిస్తున్నారని రూఢీగా తెలుసుకోవడానికి చిన్నపాటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే చాలు. చాలా వరకు మనకే అర్థమైపోతుంది. ఆ లక్షణాలేంటో చదవండి... అమ్మాయైునా సరే, అబ్బాయైునా సరే ఒకరికొకరు స్నేహంగా ఉంటూంటే అది ప్రేమా లేక స్నేహమా అనే సంశయం రాకపోదు. ఈ రెండింటికీ మధ్య ఒక చిన్న తెర అడ్డు పడుతుంది. ఆ తేడా తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా పొరపాటున ప్రపోజ్ చేసేశారే అనుకోండి ఇక ఉన్న ఆ కాస్త స్నేహాన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఆచితూచి అన్నీ జాగ్రత్తగా గమనించి ఇష్టమైన వారికి తమ ప్రేమ సందేశాన్ని అందించాలి. ప్రేమిస్తే ఆనందానుభూతి మీరెవరి ప్రేమలోనైనా పడ్డారో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ శరీరంలో కొన్ని మార్పులు గమనిస్తే చాలు అంటున్నారు కొందరు పరిశోధకులు. మీలో ఎక్కువ ఉత్కంఠ, ఆందోళన వల్ల గుండె బరువుగా అనిపించడం లేదా శరీరమంతా ఒకరకమైన ఆనందానుభూతి వ్యాపించడం... ఈ లక్షణాలన్నీ ఉంటే మీరు ప్రేమలో పడినట్లే! ఫిన్లాండ్ ఆల్టో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనాలు ఈ విషయాన్ని నిర్థారించాయి. అమ్మాయిలు ప్రేమలో పడితే అమ్మాయిలు ప్రేమలో పడితే తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారంత త్వరగా బయట పడలేరు. కానీ వారిలో కొన్ని కొన్ని మార్పులు గమనించడం ద్వారా వారు లవ్ చేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని గుర్తుపట్టవచ్చు. ఏకాంతం ఎప్పుడూ అందరితో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడే అమ్మాయి సడెన్‌గా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ప్రేమలో ఉన్నందువల్లనే ఆమె ఆ ఏకాంతాన్ని కోరుకుంటుంటే అది చాలా ప్రమాదకరం. ఎందు కంటే కొన్నాళ్లకే ఆ ఏకాంతం కాస్తా ఒంటరితనంగా భావించే ప్రవర్తనగా మారవచ్చు. తనలో తానే నవ్వుకోవడం దీనికి కూడా ప్రేమే కారణం అనుకోనవసరం లేదు. తనకేవో ఫ్రెండ్స్ జోక్స్ గుర్తుకు రావచ్చు. లేక ఆరోజు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గుర్తుకు వచ్చి నవ్వి ఉండవచ్చు. అయితే ఈ నవ్వుకోవడం అనేది పరధ్యానంగా మారితే మాత్రం అమ్మాయి ఎవరితోనైనా ప్రేమలో పడిందని గుర్తుపట్టవచ్చు. మెసేజ్‌లతోనే పగలు లేదు, రాత్రి లేదు వేళ్లు ఎప్పుడూ మొబైల్‌లోని ఏబీసీడీలనే టైప్ చే స్తూ ఉంటాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎస్సెమ్మెస్‌లు నడుస్తూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నవాళ్లు మాటల కంటే కూడా మెసేజ్‌లను ఎక్కువగా ఇష్టపడతారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఎడతెగని ఆలోచన ఏం చెబుతున్నా వింటున్నట్లే ఉంటారు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు. తిరిగి ‘ఆ ఏం చెప్పావ్ ?’ అని అడుగుతుంటారు. తాము చెప్పదలచుకున్నదాన్ని స్పష్టంగా చెప్పరు. వేరే మూడ్‌లోకి వెళ్లిపోతారు. కుటుంబ సభ్యులంతా ఒక టాపిక్‌పై మాట్లాడుతుంటే వీరు అందులో ఇన్‌వాల్వ్ కాలేకపోతారు. తమ లోకంలో తాము ఉంటుంటారు. అందానికి ఎక్కువ సమయం మామూలుగానే అమ్మాయిలు అందం గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. కానీ ప్రేమ మత్తులో ఉన్న వాళ్లు రెడీ కావడానికి మామూలుగా కంటే ఇంకా ఎక్కువ సమయమే కేటాయిస్తారు. తను ఇష్టపడే వారి దృష్టిలో ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయ పడుతుంటారు. ఎప్పటికప్పుడు ఆరా ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటకెళితే ఎప్పుడు వస్తారని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దాని ప్రకారం వారు తమ టైమ్‌ను ప్లాన్ చేసుకుంటారు. అంతేకాక తమకు సంబంధించిన వస్తువుల దగ్గరికి, పుస్తకాల దగ్గరికి ఎవ్వరినీ రానివ్వరు. ప్రతీ దానికి అబద్ధం ఆడుతుంటారు. అది బయటపడుతుందేమో అని కంగారు పడుతుంటారు. కొన్ని సమయాల్లో వీరి ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అబ్బాయిలైతే ఇలా.... నిజానికి ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం చాలా సులభం. అయితే కొందరు మొహమాటం వల్ల ‘ఐ లవ్ యూ’ అని చెప్పలేరు. కానీ అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలు ప్రేమను మాటల ద్వారా కంటే చేతల ద్వారానే ఎక్కువగా వ్యక్తం చేస్తారనేది అనేక అధ్యయనాల్లో నిరూపితం అయింది. కళ్లతోనే మాట్లాడేస్తారు.. అందరబ్బాయిలూ కళ్లతోనే మాట్లాడతారనేం లేదు. కొందరు డైరెక్టుగా మాట్లాడి తే, మరికొందరు అబ్బాయిలు భయం వల్ల తమ నెచ్చెలిని ఓర కంటితో చూస్తూ మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయి అతని వైపు తిరగగానే చూపులు మరల్చుకుంటారు. ఏదైనా ఉంటే కనుబొమ్మలను ఎగరేస్తుంటారు. అంతేకాక వారు మాట్లాడే సమయంలో జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఈ రకమైన ప్రవర్తన అతనిలో మీ పట్ల ఉండే ప్రేమను, ఇంట్రెస్ట్‌ను తెలియజేస్తుంది. టచ్ చేయాలని... ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే ఎప్పుడూ ఆమెను చేతులతో టచ్ చేయాలనుకుంటాడు. అలా టచ్ చేసినప్పుడు అమ్మాయి ఏమీ అనకుండా ఉంటే అప్పుడు అతను తన ప్రవర్త నని కంటిన్యూ చేస్తాడు లేకుంటే రిజర్వ్‌డ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను నవ్వించడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఎప్పుడూ అలాంటి ప్రయత్నంలోనే ఉంటాడు. రాజీకి సిద్ధం అబ్బాయిలు చాలా విషయాల్లో అమ్మాయిలతో గొడప పడినా చివరకు రాజీపడడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని పద్ధతుల ద్వారా, మాటల ద్వారా తనకి ఆమే ముఖ్యం అనే సంకేతాలను పంపిస్తాడు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణల్లో అమ్మాయి అభిప్రాయాన్ని అతడు గౌరవిస్తాడు. ఆశ్చర్యపరిచే యత్నం.. లవ్‌లో ఉన్న అబ్బాయిలు ప్రియురాలిని ఎప్పుడూ ఆశ్చర్యంలో ముంచెత్తడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రత్యేక కారణాలు ఏవీ లేకపోయినా అమ్మాయికి నచ్చిన కొన్ని విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు. అమ్మాయిలకు సంతోషం కలిగించే పనులు చేయాలని అనుకుంటారు. అనుకోకుండా మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు, సరదాగా బయటకు తీసుకెళ్తూ ఉంటారు. తను చేయాల్సిన కొన్ని పనులను పక్కన పెట్టేసి అమ్మాయిపైనే శ్రద్ధ్ద చూపిస్తారు. అమ్మాయిల అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవిస్తుంటారు. ఆసక్తి కనబరచడం చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు చెప్పే విషయాలను సోది అని కొట్టి పారేస్తుంటారు. అమ్మాయిలు తమ ఫ్రెండ్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ చెప్తుంటే వింటున్నట్టు నటిస్తారు గానీ శ్రద్ధ్దగా వినరు. అలాకాకుండా, అమ్మాయిలు చెబుతున్న విషయాలను శ్రద్ధ్ద్దగా వినడం లేదా వారి విషయాలను గురించి ఆరా తీయడం, అమ్మాయిలకు ఇష్టమైన వ్యక్తుల గురించి ప్రశ్నించడం వంటివి చేస్తున్నట్లయితే ఆ అమ్మాయిని అబ్బాయి ఇష్టపడుతున్నటే లెఖ్ఖ! లవ్ టెస్ట్ 1. మెసేజ్ కానీ, కాల్ గానీ రాకపోతే డల్‌గా ఉంటారా, మూడ్ మారిపోతుందా?అవును, కాదు2. ఎప్పడూ వారి గురించే ఆలోచిస్తూ ఉంటారా? అవును, కాదు3. కోపం, బాధ, సంతోషం ఏదైనా వాళ్ళతోనే పంచుకోవాలనుకుంటారా?అవును, కాదు4. జీవిత భాగస్వామి అంటే తనలానే ఉండాలనుకుంటారా?అవును, కాదు5. ఎలాంటి కష్టమైనా ఇష్టపడి భరిస్తారా?అవును, కాదు6. వారి పట్ల రొమాంటిక్ ఫీలింగ్‌తో ఉంటారా?అవును, కాదు7. అతను/ ఆమె ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందిస్తున్నారా?అవును, కాదు8. వారి కోసం ప్రత్యేకంగా తయారవుతున్నారా?అవును, కాదుపై ఎనిమిది ప్రశ్నలలో ఐదు కంటే ఎక్కువ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం వస్తే మీరు ఆ అబ్బాయి లేదా అమ్మాయితో లవ్‌లో ఉన్నట్టే లెక్క, లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహ బంధమే.
ramudu3 Posted September 14, 2015 Author Report Posted September 14, 2015 Just answer below questions and tell your results here లవ్ టెస్ట్ 1. మెసేజ్ కానీ, కాల్ గానీ రాకపోతే డల్‌గా ఉంటారా, మూడ్ మారిపోతుందా?అవును, కాదు2. ఎప్పడూ వారి గురించే ఆలోచిస్తూ ఉంటారా? అవును, కాదు3. కోపం, బాధ, సంతోషం ఏదైనా వాళ్ళతోనే పంచుకోవాలనుకుంటారా?అవును, కాదు4. జీవిత భాగస్వామి అంటే తనలానే ఉండాలనుకుంటారా?అవును, కాదు5. ఎలాంటి కష్టమైనా ఇష్టపడి భరిస్తారా?అవును, కాదు6. వారి పట్ల రొమాంటిక్ ఫీలింగ్‌తో ఉంటారా?అవును, కాదు7. అతను/ ఆమె ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందిస్తున్నారా?అవును, కాదు8. వారి కోసం ప్రత్యేకంగా తయారవుతున్నారా?అవును, కాదుపై ఎనిమిది ప్రశ్నలలో ఐదు కంటే ఎక్కువ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం వస్తే మీరు ఆ అబ్బాయి లేదా అమ్మాయితో లవ్‌లో ఉన్నట్టే లెక్క, లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహ బంధమే. too long didn't read.. +1
TOM_BHAYYA Posted September 14, 2015 Report Posted September 14, 2015 Last para regarding interest okate right
ramudu3 Posted September 14, 2015 Author Report Posted September 14, 2015 Sodara nee test results enti??? needhi premaa , kamama??? Last para regarding interest okate right
kiladi bullodu Posted September 14, 2015 Report Posted September 14, 2015 Gist: Press the b000b if 1.girl is silent then it is friends with benefits 2. Girl say wait till marriage then it is love 3. Girl say Anniya then ur bro zoned 4. Girl say I did not expect this from you we are just friends. 5. Girl say 25$ for song she is a stripper
Raja123 Posted September 14, 2015 Report Posted September 14, 2015 Gist: Press the b000b if 1.girl is silent then it is friends with benefits 2. Girl say wait till marriage then it is love 3. Girl say Anniya then ur bro zoned 4. Girl say I did not expect this from you we are just friends. 5. Girl say 25$ for song she is a stripper gp
SUBBARAVU Posted September 14, 2015 Report Posted September 14, 2015 Gist: Press the b000b if 1.girl is silent then it is friends with benefits 2. Girl say wait till marriage then it is love 3. Girl say Anniya then ur bro zoned 4. Girl say I did not expect this from you we are just friends. 5. Girl say 25$ for song she is a stripper 6. Girl files sexual harassment charges then colleague only
nako_job_kavali Posted September 14, 2015 Report Posted September 14, 2015 enimidhi ki enimidhi vachaay bhayaa...kaani ammayiki pelli ipoindhi recent gaa :( :(...papa full rich manam yaverage... prema odipole....paisal odinchesay nannu #$1 #$1 #$1 Just answer below questions and tell your results here లవ్ టెస్ట్ 1. మెసేజ్ కానీ, కాల్ గానీ రాకపోతే డల్‌గా ఉంటారా, మూడ్ మారిపోతుందా?అవును, కాదు2. ఎప్పడూ వారి గురించే ఆలోచిస్తూఉంటారా? అవును, కాదు3. కోపం, బాధ, సంతోషం ఏదైనా వాళ్ళతోనే పంచుకోవాలనుకుంటారా?అవును, కాదు4. జీవిత భాగస్వామి అంటే తనలానే ఉండాలనుకుంటారా?అవును, కాదు5. ఎలాంటి కష్టమైనా ఇష్టపడి భరిస్తారా?అవును, కాదు6. వారి పట్ల రొమాంటిక్ ఫీలింగ్‌తో ఉంటారా?అవును, కాదు7. అతను/ ఆమె ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందిస్తున్నారా?అవును, కాదు8. వారి కోసం ప్రత్యేకంగా తయారవుతున్నారా?అవును, కాదుపై ఎనిమిది ప్రశ్నలలో ఐదు కంటే ఎక్కువ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం వస్తే మీరు ఆ అబ్బాయి లేదా అమ్మాయితో లవ్‌లో ఉన్నట్టే లెక్క, లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహ బంధమే.
ramudu3 Posted September 14, 2015 Author Report Posted September 14, 2015 naaku kuda same 8 ki 8 bhayaaa ...... but inka ammayi ee dorkaledhu.... :( :( enimidhi ki enimidhi vachaay bhayaa...kaani ammayiki pelli ipoindhi recent gaa :(...papa full rich manam yaverage... prema odipole....paisal odinchesay nannu #$1 #$1
Nellore Pedda reddy Posted September 15, 2015 Report Posted September 15, 2015 Gist: Press the b000b if 1.girl is silent then it is friends with benefits 2. Girl say wait till marriage then it is love 3. Girl say Anniya then ur bro zoned 4. Girl say I did not expect this from you we are just friends. 5. Girl say 25$ for song she is a stripper Lol.1q
donganaaK Posted September 15, 2015 Report Posted September 15, 2015 Gist: Press the b000b if 1.girl is silent then it is friends with benefits 2. Girl say wait till marriage then it is love 3. Girl say Anniya then ur bro zoned 4. Girl say I did not expect this from you we are just friends. 5. Girl say 25$ for song she is a stripper Citi_c$y
Force Posted September 15, 2015 Report Posted September 15, 2015 Gist: Press the b000b if 1.girl is silent then it is friends with benefits 2. Girl say wait till marriage then it is love 3. Girl say Anniya then ur bro zoned 4. Girl say I did not expect this from you we are just friends. 5. Girl say 25$ for song she is a stripperCITI_c$y
Recommended Posts