Jump to content

Pattiseema And Uma Success

Recommended Posts

Posted

పట్టిసీమ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎవరి సాయం లేకుండా… ఎవరో ఓ చేయివేస్తారని చూడకుండా అమాంతం ఆగమేఘాల మీద ఓ కొత్త పంథాలో పూర్తిచేసిన ప్రాజెక్ట్ గా పట్టిసీమ చరిత్రలో శిలాక్షరాలతో నిలుస్తుంది. నీరిస్తుంది. డెల్టా రాతనే కాదు రాయలసీమ గీతని కూడా మార్చి ఏపీ స్పిరిట్ కి సింబాలిజమ్ నీళ్ల పరవళ్లలో చూపిస్తోంది పట్టిసీమ. దురుద్దేశంతోనో రాజకీయం కోసమో లేదంటే పట్టీసీమ పూర్తయితే పుట్టగతులు ఉండవనే భయంతోనో కొందరు వేసిన కొర్రీలకి ఇపుడు ఫెర్రీనే సమాధానం ఇస్తోంది. అన్నిటినీమించి కాన్ఫిడెన్స్ పెంచేపరిణామం.
ఇదో ఉజ్వలఘట్టం. పట్టిసీమ పూర్తి కావడానికి పట్టుదల మొదటి కారణం అయితే రెండోది నాయకత్వం. ఇబ్బందులొచ్చినా లిమిటేషన్స్ ఉన్నా ఆరోపణలు చుట్టుముడుతున్నా ధైర్యంగా ఢీకొట్టిన నీటిపారుదల శాఖ ప్రాధాన్యాన్ని కూడా ప్రస్తావించి తీరాలి. ఎందుకంటే ఇది ఏపీ సొంత కాళ్ల పై సాధించిన తొలి విజయం. అడ్డంకుల్ని దాటి ఉవ్వెత్తున ఉత్సాహంతో ఎగసిన తొలి సందర్భం. అందుకే ఇదో అనుసంధానంగానో… నీళ్లిచ్చే కాలువగానో మాత్రమే చూడలేం. మరి ఇంతటి మహత్తర ఘట్టం స్థానిక నాయకులతోపాటు రాష్ట్ర స్థాయిలో కూడా కొత్త చర్చకి తెరదీస్తోంది. ఎఫిషియంట్ లిస్ట్ తయారు చేస్తే ఎవరెక్కడ అనే అంచనాలకి ఊతమిస్తోంది.
వెనక్కితగ్గడు సుమా… ఉమ…
కాకపోవడానికి కారణాలు చెప్పేడం కాదు… అవ్వడానికి అవకాశాలు వెదకాలి. ఇదే ఇపుడు ఏపీకి కావాలి. రెవిన్యూ లోటు ఉందని… కేంద్రం ఓ చేయి వేయడం లేదని… ఉద్యోగులు కూడా మొండికేస్తున్నారని…రాజధానిపై రాజకీయ రచ్చ జరుగుతోంది కదా అని చెప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. అలా చేస్తే మిగతా మంత్రులకి ఉమకి పెద్ద తేడా ఉండదు. నిజం. ఓ మిషన్ పూర్తికావాలంటే చొరవతోపాటు కమిట్మెంట్ దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉండాలని క్లినికల్ హ్యాండ్లింగ్ అవసరమని నీరుపారుదల శాఖ సక్సెస్ చూస్తే అర్థమవుతోంది. ఇపుడు అనుసంధానం అయ్యిందనే కాదు. అంతకు ముందు కూడా ! హైద్రాబాద్ నుంచి విజయవాడకి శాఖ కార్యాలయం పనులు మార్చిన తొలి మంత్రి ఉమ. బెజవాడలోనే ఉండి ఇక్కడ నుంచే కార్యకలాపాలు సమీక్షిస్తా… ప్రాజెక్టుల తీరును విజన్ ను అనుసంధానిస్తా అని ముందుగా చెప్పింది కూడా ఆయనే ! ఆ తర్వాతే మిగతావాళ్లు కదిలారు.
బడ్జెట్ కేటాయింపులే లేవు అంటూ ఒకరు. ఇపుడు సీజన్ మారిపోయిందిగా మళ్లీ బడులు తెరిచినప్పుడు చూద్దాం అంటూ మరొకరు నిస్తేజం గా కొట్టుకుపోతున్న సమయంలో ప్రతి రోజూ వేలిబులే… నేను చేయకపోతే సీఎం సమాధానం చెప్పాల్సి వస్తుందంటూ కళ్లు చెరిచిన మొదటి మంత్రి ఉమ. సీనియారిటీ… ఇంతకు ముందు పనిచేసిన రికార్డ్ అంటూ ఒకరిద్దరు కబుర్లు చెబుతున్న కేబినెట్లో… ఇలాంటి స్పిరిటే ఓ స్పెషాలిటీ. వీటితోపాటు జిల్లా రాజకీయాల విషయంలో దృక్పథం మార్చుకోవడం కూడా ఉమకి కలిసొచ్చిందనే చెప్పాలి. అర్బన్ – రూరల్ అధ్యక్షులు అంటూ వివాదం రేగినపుడు… తలనొప్పులు తేవొద్దని జిల్లా నాయకులకి రెండేళ్లనాడు చంద్రబాబు చెప్పినప్పుడు పరిస్థితి వేరు. ఆ తర్వాత లీడ్ తీసుకొని పంథా మార్చడం ఉమని ఎలివేట్ చేసింది. పరిస్థితి అనుకూలంగా లేని సమయంలోనూ వరస విజయాలతో స్థిరంగా నిలచిన నాయకుడిగా జిల్లాలో పేరు ఉండనే ఉంది. రాజకీయమే కాదు పరిపాలనా పరంగా కూడా ఇపుడు మెచ్యూరిటీ చూపించడం అంటే ప్రోగ్రెస్సివ్ సిగ్నలే ! నాకు ఇంకా మెరుగైన, బరువైన బాద్యతలు అప్పగించొచ్చని సీఎంకి సక్సెస్ ఫుల్ గా సంకేతం ఇచ్చినట్టే !
ఇవి రాతని మార్చే నీళ్లు… !
రాజకీయంగా ధాటిగా ఎదురుదాడి చేయడం తెలుసు. విధానపరంగా ముందుండి ఫైట్ చేయడం చూశాం. ఇపుడు శాఖల వారీగా పనితీరు ఏపీకి ఊపుతెచ్చే టాప్ సిక్స్ లిస్ట్ లో కూడా చోటు ఉండేసరికి ఉమ ఇన్ ఫ్లూయెన్స్ పెరిగిందా ? లేదంటే ఇప్పుడు సర్ఫేస్ అయ్యిందా ? అనే చర్చ జరుగుతోంది బెజవాడలో ! నిజానికి శాఖల ప్రాధాన్యం ప్రకారం చూస్తే నీటిపారుదల తొలి మూడు స్థానాల్లో ఉండదు. రెవిన్యూ హోం ఆర్థికం లాంటివాటి తర్వాత వస్తుంది. అదే పనిలో ముందుకు దూసుకొచ్చిందిపప్పుడు. ప్రభుత్వానికి ఇదో సంజీవని అయ్యిందిప్పుడు. కేంద్ర సాయంపై తేల్చకపోవడం హోదా కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న ప్రచారం… లేనిపోని రాజకీయాలు జడలువిప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలో పట్టిసీమ తొడగొట్టి చూపించింది. నీటిపారుదల శాఖ ఏపీ దశ మార్చింది. దిశ నిర్దేశించింది. మరి రాజకీయాలకి కూడా ఇది మలుపు అవుతుందా ? చుట్టుపక్కల మంత్రులు తేలిపోవడం… సక్సెస్ కలిసిరావడం లాంటి పరిణామాలు కీలకంగా కనిపిస్తున్నాయ్. మార్పులు చేర్పుల్లో రాజధాని జిల్లా వెయిటేజి పెరగడానికి పట్టిసీమ కూడా కారణం అవుతుందా… చూడాలి !

Nice Post...Thanks Boss.

×
×
  • Create New...