Jump to content

Recommended Posts

Posted

సంక్రాంతికి ఎన్టీఆర్‌ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' రిలీజ్‌ ఫిక్స్‌ అయింది. సంక్రాంతి బరిలోనే బాలకృష్ణ 'డిక్టేటర్‌' కూడా వుంటుందని ఆ చిత్ర బృందం మరోసారి తేల్చి చెప్పింది. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్‌ వార్‌ ఖాయంగా కనిపిస్తోంది. నందమూరి అభిమానుల్లో కొందరికి ఈ క్లాష్‌ నచ్చడం లేదు. అయితే రెండు సినిమాలు సంక్రాంతికి రావడమనేది స్పష్టం కావడంతో ఇక ఈ యుద్ధానికి వారు కూడా ప్రిపేర్‌ అవుతున్నారు. కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్‌ ఎక్స్‌క్లూజివ్‌ అభిమానుల మధ్య సంబంధాలు సరిలేవు.

ఎన్టీఆర్‌ సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు వాటికి సపోర్ట్‌ ఇవ్వవద్దంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మెసేజ్‌లు వెళుతున్నాయని జూనియర్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు బాబాయ్‌, అబ్బాయ్‌ కలిసి కనిపించినా కానీ ఈమధ్య ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పోటీ నందమూరి అభిమానుల పరంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు సినిమాల్లో దేనిది పైచేయి అవుతుందో అనే ఆసక్తి అభిమానుల్లోనే కాక ఇతరుల్లో కూడా బాగా కనిపిస్తోంది.

Posted

saul annai babai fans ki abbai fans ki godava pettaalani trying aaa

Posted

saul annai babai fans ki abbai fans ki godava pettaalani trying aaa

Already they r fighting no :o
Posted

Already they r fighting no :o

 

naanna ki badhulu babai ki prematho ani theesunte baagundedi

×
×
  • Create New...