Jump to content

Recommended Posts

Posted

best-ganesh.jpg

 

 

వినాయకుడు అనగానే  ఆకాశాన్ని తాకే ఎత్తు, భారీ భారీ  ఆకారాల్లో ఉండే ప్రతిమలు, లక్షల రూపాయలు ఖర్చు చేసి కొన్న విగ్రహాలే గుర్తుకు వస్తున్న ఈ తరుణంలో…. ఈ కుర్రాడు రూపొందించిన వినాయకుడు అందరి మన్ననలను పొందుతున్నాడు. పైగా అనేక వినాయక విగ్రహాలతో పోటీ పడి ది బెస్ట్ ఇన్నోవేటివ్  వినాయకుడి అవార్డ్ ను కూడా  సొంతం చేసుకున్నాడు. ఇక విగ్రహ తయారీకి వస్తే.. పాస్టర్ ఆఫ్ పారీస్ కానీ, బంక మట్టి కానీ,  ఏం వాడలేదు. కేవలం ఓ అట్టాపెట్టె, ఓ లైట్ , ఓ గ్లాస్ సహాయంతో షాడో గణపతిని రూపొందించాడు ఈ కుర్రాడు.

 

 

అట్టాపెట్టెను వినాయకుడి రూపంలో తీర్చిదిద్ది… దాని వెనుక చిన్న లైట్ ను ఏర్పాటు చేసి … అట్టా పెట్టె ముందు అద్దం పెట్టి ఉంచాడు.. లైట్ వేయగానే అట్టా పెట్టె మీద  వినాయకుడి రూపం గ్లాస్  మీద పడుతుంది..ముందు ఉన్న అద్దం ఈ రూపాన్ని 10 ఇంతలు పెద్దగా చూపడంతో తెల్లని గోడ మీద నల్లని ఆకారంలోని వినాయక నీడ  ఏర్పడుతుంది.

×
×
  • Create New...