Jump to content

Krishna Godavari Linking Successful.. Now Krishna And Penna


Recommended Posts

Posted

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం కొలిక్కి వస్తోంది! ఇక కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం మొదలుకానుంది! గోదావరి, కృష్ణా నదుల సంగమానికి దారి చూపిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్రంలో మరిన్ని నదుల అనుసంధానానికి స్ఫూర్తినిచ్చింది. పట్టిసీమ విజయవంతమైనసందర్భంగా తనను కలిసిన జల వనరుల శాఖ ఇంజనీర్లతో మరో మహా సంకల్పానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. 2005 నుంచి 2013 వరకూ ఏటా 55 నుంచి 975 టీఎంసీల కృష్ణా జలాలు నిరుపయోగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. దాంతో, జలవనరుల శాఖ ఇంజనీర్లు కొత్త ప్రాజెక్టును సిద్ధం చేశారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను ఇచ్చారు. వివరాలివీ..

  •  పోలవరం ప్రాజెక్టు ద్వారా రోజూ 11,200 క్యూసెక్కుల చొప్పున 80 టీఎంసీల గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరతాయి.
  •  తద్వారా, దాదాపు 80 టీఎంసీల కృష్ణా జలాలు నాగార్జున సాగర్‌ వద్ద అందుబాటులోకి వస్తాయి.
  • ఈ జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు.
  • కృష్ణా పశ్చిమ డెల్టాలోని కొమ్మమూరు కాలువను 95.40 కిలోమీటర్ల మేర వెడల్పుచేస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి రోజూ12,000 క్యూసెక్కుల నీటిని కొమ్మమూరు కాల్వ ద్వారా సంతరావూరు వరకూ పంపే వీలు.
  • తద్వారా ఇక్కడ నిర్మిస్తున్న 338 మెగావాట్ల జల విద్యుత్కేంద్రానికి నీళ్లు అందించవచ్చు.
  •  ఇక్కడి నుంచి మూడు మీటర్ల వ్యాసం కలిగిన 20 మైల్డ్‌ స్టీల్‌ పైప్‌ లైన్ల ద్వారా సంతరావూరు నుంచి గుండ్లకమ్మ రిజర్వాయరు వరకూ 35 కిలోమీటర్ల మేర 12000 క్యూసెక్కులను పంపవచ్చు.
  •  గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి 3000 క్యూసెక్కులను నెల్లూరు బ్యారేజీకి.. అక్కడి నుంచి తడకు పంపిస్తారు. మరో 9000 క్యూసెక్కులను చినరికట్ల నుంచి సోమశిల రిజర్వాయర్‌కు పంపిస్తారు.
  •  గుండ్లకమ్మ నుంచి 3000 క్యూసెక్కులను 151 కిలోమీటర్ల మేర సరఫరా చేస్తే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చవచ్చు. 
  • ప్రకాశం బ్యారేజీ నుంచి తడ వరకూ జాతీయ రహదారిని ఆనుకుని పైప్‌లైన్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల తాగు నీటి అవసరాలను వాటర్‌ గ్రిడ్‌ ద్వారా తీర్చే వీలుంది.
    • 12 మీటర్ల వ్యాసార్థం కలిగిన గ్రావిటీ లైన్‌ టన్నెల్‌ ద్వారా గుండ్లకమ్మ నుంచి చినరికట్ల వరకూ 60 కిలోమీటర్ల మేర 9000 క్యూసెక్కులను పంపే వీలు. 
    •  కొమ్మమూరు అభివృద్ధికి 1200 కోట్ల వ్యయ అంచనా
    • కొమ్మమూరు-గుండ్లకమ్మ రిజర్వాయరు వరకూ ఎత్తిపోతలకు రూ.2400 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
    •  గుండ్లకమ్మ-తడ వరకూ సిమెంట్‌ కాంక్రీట్‌ లైన్‌ గ్రావిటీ కాలువ నిర్మాణానికి రూ.2000 కోట్ల వ్యయ అంచనా.
    •  ఈ కాలువల అభివృద్ధి, నిర్మాణం, భూ సేకరణకు దాదాపు రూ.800 కోట్లు అవసరమవుతాయని అంచనా. 
    •  స్టేజ్‌-2 పనుల కింద కొమ్మమూరు-గుండ్లకమ్మకు రోజూ 9000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే పథకానికి 7100 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. 
    • గుండ్లకమ్మ రిజర్వాయరు నుంచి.. గ్రావిటీ టన్నెల్‌ నిర్మాణానికి మరో రూ.7500 కోట్లు ఖర్చవుతాయని అంచనా.
    •  సోమశిల వరకూ గ్రావిటీ సీసీ లైన్‌ ఏర్పాటుకు రూ.2000 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇందుకు భూ సేకరణకు రూ.2200 కోట్లు ఖర్చవుతాయని అంచనా. స్టేజ్‌-2 కోసం మొత్తం రూ.18,000 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా.
    • రాయలసీమకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌
      భారీ వరద కాలువ తవ్వకానికి సర్వే
      హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి: గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం.. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను రాయలసీమకి మళ్లించడం ద్వారా కరువును జయించాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. శ్రీశైలం నుంచి వెలిగొండలో భాగమైన నల్లమల సాగర్‌కు; అక్కడి నుంచి కడప, నెల్లూరు జిల్లాలకు, వీలైతే ప్రకాశం జిల్లాలోని సాగర్‌ కుడి కాలువ చివరి ఆయకట్టుదారులకు నీటిని ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఇటీవల జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను సీమ కు మళ్లించడానికి భారీ వరద కాలువను నిర్మించాలని ,దాని ద్వారా కడప, చిత్తూరు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాకు కూడా సాగు, తాగునీటిని అందించవచ్చని ఆ శాఖ భావిస్తోంది. 
      కృష్ణా డెల్టాకు మంచి రోజులు
    • ముందస్తు ఖరీఫ్‌కు వీలు.. ఇంజనీర్ల ఆశాభావం
      హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ నుంచి పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని ఎత్తిపోయడం ద్వారా లక్షా 25 వేల ఎకరాలకు మంచి రోజులు వచ్చాయని ఏపీ జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఖరీఫ్‌ పంట ముందే వేసే అవకాశం ఈ ప్రాంత రైతులకు దక్కుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి యేటా ఖరీఫ్‌లో జూలై 15 తర్వాత.. సాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరేంత వరకూ రైతులు వేచి చూస్తున్నారు. సకాలంలో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వానలు కురిస్తే.. జూలై మొదటి వారంలో నారుమళ్లు వేస్తారు. అంతా సవ్యంగా ఉంటే.. ఆగస్టు మూడో వారంలోనో.. లేదంటే ఆఖరిలో నాట్లు వేస్తారు. డిసెంబర్‌ చివరిలోనో.. జనవరి మొదటి వారంలోనో పంట చేతికి వస్తుంది. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో వరి చేళల్లో గింజ కన్పిస్తుంది. అక్టోబర్‌లో పచ్చగా కన్పించే గింజను పిండితే పాలలా నీరొస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతి యేటా కోస్తాలో తుఫానులు వస్తాయి. ప్రధానంగా నవంబర్‌ నెలలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గింజ పట్టిన వరిపొలాలను చూసి అధిక దిగుబడులొస్తాయని, పంట అమ్మిన డబ్బుతో సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా చేసుకోవచ్చని రైతులు ఆశిస్తారు. కాని.. తుఫానుల కారణంగా అకాల వర్షాలు చేనును ముంచేస్తుంటే .. కళ్ల నీళ్ల పర్యంతం కావడం మినహా చేసేదేమీ లేని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో రైతులు పంటపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. ఈ కష్టాలన్నింటికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం చెక్‌పెట్టినట్లేనని ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరిలోకి జూన్‌నుంచే ప్రవాహం ఉంటుందని, ఈ నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఎత్తిపోయడం ప్రారంభిస్తే ..జూన్‌ రెండో వారంలో నారు వేయవచ్చంటున్నారు. జూలై రెండోవారంలో నాట్లు వేస్తే.. అక్టోబర్‌ మొదటి వారం నాటికి పంట చేతికి వస్తుందని.. మహా ఆలస్యమైతే నవంబర్‌ మొదటివారానికే కోతలు పూర్తవుతాయని పేర్కొంటున్నారు.
    •  
Posted

PPT la kae parimitham annavallu ravalibrahmilaugh.gif

Posted

PPT la kae parimitham annavallu ravalibrahmilaugh.gif

vallaki inka CBNni support chesina vallu anta pulkas ee...brahmilaugh.gif..manam teliviga unna vallalo better ani CBNni gelipincham...vallu athi teliviga langani gelipincharu..brahmilaugh.gif

Posted

PPT la kae parimitham annavallu ravalibrahmilaugh.gif

 

 

Sachhipotharu emo intha info isthe

 

 

entaiana maavollu telivigallolura bai..brahmilaugh.gif

 

 

state division is the best thing happened for AP... ofcourse starting lo probs vundochu but sannasula gola ithe ledhu brahmilaugh.gif

Posted

vallaki inka CBNni support chesina vallu anta pulkas ee...brahmilaugh.gif..manam teliviga unna vallalo better ani CBNni gelipincham...vallu athi teliviga langani gelipincharu..brahmilaugh.gif

 

 

maa  CM maku vunadu ra  bhai brahmilaugh.gif

×
×
  • Create New...