Jump to content

Jaffa Jagan Behind Nepali Star Akhil Movie


Recommended Posts

Posted

టాలీవుడ్‌లో నాగార్జున చాలా ఇంటిలిజెంట్ ప‌ర్స‌న్…ఈ విష‌యంలో తిరుగేలేదు. అటు సినిమాల‌తో బిజీగా ఉండే నాగ్‌..ఇటు బుల్లితెర మీద హంగామా చేస్తాడు. అటు త‌న ఇద్ద‌రి కొడుకుల‌ను బాగానే ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. ఇవ‌న్ని ఇలా ఉండ‌గా మ‌రోప‌క్క త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా చాప‌కింద నీరులా విస్త‌రించుకుంటున్నాడు. జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టిన నిమ్మ‌గ‌డ్డ మ‌నోడికి అత్యంత స‌న్నిహితుడు. ఒక ర‌కంగా చెప్పాలంటే నితిన్ రెడ్డి.. నిమ్మ‌గ‌డ్డ‌.. నాగార్జున‌.. మ‌రో పారిశ్రామిక‌వేత్త‌, కేవీపీ వియ్యంకుడు ర‌ఘురామ కృష్ణంరాజు, పీవీపీ వీరంతా జ‌గ‌న్ గూటి ప‌క్షులే.

వీరిలో నితిన్‌-జ‌గ‌న్‌ను సామాజిక‌వ‌ర్గాల నేప‌థ్యంలో ఒక్క‌టి చేసి చూసినా నాగార్జున‌, పీవీపీ, నిమ్మ‌గ‌డ్డ వీళ్లంతా జ‌గ‌న్ వ్యాపారాల‌తో ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో సంబంధాలు ఉన్న వాళ్లే. తాజాగా జ‌రుగుతున్న మ‌రో ప్ర‌చారం ఏంటంటే అఖిల్ సినిమాకు జ‌గ‌న్ పెట్టుబ‌డులు పెట్టాడ‌ని టాక్ వినవ‌స్తోంది. నాగార్జున త‌న‌యుడు అఖిల్ డెబ్యూ మూవీని యంగ్ హీరో నితిన్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే అఖిల్ మార్కెట్ ఏంటో తెలియ‌కుండానే నితిన్ ఏకంగా రూ.45 కోట్లు వ‌ర‌కు ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు.

నితిన్ ఆ రేంజ్‌లో అఖిల్ మీద ఇన్వెస్ట్ చేయ‌డానికి అంత ధైర్యం ఎక్క‌డిది….టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ నాన్న నాగార్జున‌, అన్న చైతుకే రూ.30 కోట్ల వ‌ర‌కు మార్కెట్ లేదు. మ‌నం సినిమా మిన‌హా వారు న‌టించిన సినిమాలేవి రూ.30 కోట్లు కూడా వ‌సూలు చేయలేదు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అఖిల్ సినిమాకు జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న అనుచ‌రులుగా ఉండి నాగ్‌కు అత్యంత స‌న్నిహితులైన కొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు కొంత పెట్టుబ‌డి స‌ర్దిన‌ట్టు తెలుస్తోంది.

వీళ్ల‌దంతా ఒకే సామ్రాజ్యం అని చెప్పేందుకు ఈ ఉదాహ‌ర‌ణ‌లు చాలు. మాటీవీ యాడ్స్ సాక్షికి వెళ్తాయి. క‌ళ్యాణ్ జ్యూయ‌ల‌ర్స్ ఫుల్ పేజీ యాడ్స్ సాక్షిలో ఉంటాయి. ఇక సాక్షి ఫ్యామిలీ పేజీల్లో అక్కినేని ఫ్యామిలీ గురించి మొత్తం డ‌ప్పువార్త‌లే ద‌ర్శ‌న‌మిస్తాయి. అఖిల్ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ రేంజ్‌లో ఊద‌ర‌గొడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అఖిల్ మూవీ ఆడియో లైవ్ టీవీ 5కి ఎక్స్‌క్లూజివ్‌గా వెళ్లింది. జ‌గ‌న్ టీవీ-5లో కూడా పెట్టుబ‌డులు పెట్టాడ‌న్నది చాలామందికి తెలిసిన విష‌య‌మే. ఇక నితిన్ ఎలాగూ జ‌గ‌న్ సామాజ‌కవ‌ర్గానికి చెందిన వ్య‌క్తే. పైగా తెలంగాణ‌కు చెందిన‌వాడు. త‌న సామాజిక‌వ‌ర్గం వాళ్ల ద్వారా ఇండ‌స్ర్టీలో కూడా త‌న పెట్టుబ‌డులు ఉండేలా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అఖిల్ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో నిమ్మ‌గ‌డ్డ‌, పీవీపీ, ర‌ఘురామ‌కృష్ణంరాజు వీరంద‌రు ద‌ర్శ‌న‌మిస్తారు. ఈ లెక్క‌ల‌న్ని చూసిన చాలా మంది అఖిల్ సినిమాలో జ‌గ‌న్ పెట్టుబ‌డుల లెక్క‌ల గురించి చెపుతున్నారు.

×
×
  • Create New...