Jump to content

Recommended Posts

Posted

గౌహతి , సెప్టెంబర్ 23: తప్పు చేస్తే పోలీస్ కేసు పెట్టడం చూసుంటారు.. లేదా మహా అయితే నాలుగు దెబ్బలేయడం చూసుంటారు కానీ, తల నరకడం ఎక్కడైనా చూశారా..! అలాంటి ఒళ్లు గగుర్పోడిచే దారుణమైన ఘటన అస్సాంలోని సోనిట్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే సోనిట్‌పూర్ ఎస్పీ.. సన్‌జుక్ట్ పర్సార్ కథనం ప్రకారం బర్గులి గ్రామానికి చెందిన ఫగుణీ కవారీ అనే మహిళ సోమవారం నాడు చికెన్ దొంగిలించి కుటుంబ సభ్యులతో కలిసి వండుకుని తినేసిందని స్థానిక దుకాణదారుడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతను మరో నలుగురిని వెంట బెట్టుకుని కవారీ ఇంటికి వెళ్ళి భార్యా, భర్తలతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత ఆవేశం పట్టలేక ఆమె తల నరికేశారు. ఈ దాడి నుంచి ఆమె భర్త స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కానీ, ఆ తన మహిళ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆమె కోడలు ఇంటి నుంచి పారిపోయి తన ప్రాణాలను రక్షించుకుంది. ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో అతను తప్పించుకున్నాడు.

 

 

&.,?  &.,?  &.,?  &.,? 

Posted

odiyamma, manishi pranam kanna kodi eekuva ayipoyinda vellaki :O

 

×
×
  • Create New...