Jump to content

Recommended Posts

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • saptagiri

    11

  • TOM_BHAYYA

    6

  • Force

    6

  • solman

    3

Popular Days

Top Posters In This Topic

Posted
  • కార్నివాల్‌-15లో కొరియా రాయబారి జ్యూంగ్‌ లీ
  • చంద్రబాబు విధానాలు భేష్‌
  • ఏపీ ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా విశాఖపట్నం

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నూతన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా చేరతామని కొరియా రాయబారి జ్యూంగ్‌ లీ ప్రకటించారు. భారతదేశంతో వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడానికి విశాపట్నంలో మంగళవారం నిర్వహించిన కొరియా కార్నివాల్‌-15లో ఆయన ప్రసంగించారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల నిర్మాణంలో కొరియా కంపెనీలు గ్లోబల్‌ లీడర్లుగా వున్నాయని, వాటి సహకారం ఏపీకి ఎంతైనా అవసరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ పెట్టుబడిదారులందరినీ ఆకర్షిస్తోందన్నారు. భారతదేశంలో పెట్టుబడుల కోసం మొదట తాము ఆంధ్రప్రదేశ్‌నే ఎంచుకోవడానికి బలమైన కారణాలు వున్నాయన్నారు. ఇప్పటివరకు గుర్తించని అనేక రంగాలతో పాటు నూతన సరళీకృత విధానాలు, భారతదేశంలో పెట్టుబడులకు గుజరాత్‌ తరువాత ఏపీయే అనుకూలంగా వుందని ప్రపంచబ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌ తమను ఇటు వైపు అడుగులు వేయించాయన్నారు. ఏపీలో రహదారులు, రైళ్లు, విమాన సౌకర్యాలతో పాటు జల రవాణాకు అవసరమైన పోర్టుల్లో విస్తృతమైన మౌలిక వసతులు వున్నాయన్నారు. ఆర్థిక మండళ్లు, సహజ వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు మరింత ఆకర్షిస్తున్నాయన్నారు. స్నేహపూర్వక వ్యాపార సంబంధాల కోసం సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ, ఇండసీ్ట్ర మిషన్‌, ఇండసీ్ట్ర పాలసీ, సెక్టార్‌ పాలసీ, సింగిల్‌ విండో క్లియరెన్స్‌ వంటివి కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయన్నారు. కార్నివాల్‌ కోసం కొరియా ఎంచుకున్న విశాఖపట్నం భవిష్యత్తులో మెగా ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌గా మారబోతుందన్నారు. ఆటోమొబైల్‌, పెట్రో కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇంకా ఇతర రంగాల్లోను కొరియా, ఆంధ్రప్రదేశ్‌ అర్థవంతమైన సహకారం ఇచ్చిపుచ్చుకోవలసి వుందన్నారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా ఇపుడు భారతదేశంవైపే చూస్తున్నారని జ్యూంగ్‌ లీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌సిటీలు అర్థవంతంగా వున్నాయని, వాటిలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ ఆయన చేస్తున్న విదేశీ యాత్రలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గత మే నెలలో ప్రధాని నరేంద్రమోదీ కొరియా పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారని, భారతదేశానికి రావాలని ఆహ్వానించారని వివరించారు. తయారీ, నైపుణ్య రంగాలు, స్మార్ట్‌సిటీల నిర్మాణంలో కొరియా కంపెనీలకు అపార అనుభవం వుందని, దాన్ని భారతదేశానికి అందిస్తామన్నారు.

కొరియా కోసం ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు: ఐవైఆర్‌ కృష్ణారావు, ముఖ్య కార్యదర్శి
కార్నివాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ కొరియాతో భారతదేశానికి అనేక శతాబ్దాలుగా సంబంధాలు వున్నాయన్నారు. ఎల్‌జీ, హుండాయ్‌ వంటి ఉత్పత్తులను చూసి ఆసియా దేశమైన కొరియా వీటిని ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వించాలన్నారు. ఎగుమతుల్లో కొరియా అందరికీ ఆదర్శమని, ఏటా పది శాతం అభివృద్ధి సాధించడం విశేషమన్నారు. కొరియాతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి ఆసక్తిగా వుందని, ఎటువంటి సహకారం కావాలన్నా తక్షణమే అందిస్తామని ప్రకటించారు. కొరియా నుంచి వచ్చే పెట్టుబడిదారుల కోసం తన సెక్రటేరియేట్‌లోనే ప్రత్యేకంగా ఓ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తానని, వాటిని స్వయంగా తానే పరిశీలించి కావల్సినవన్నీ సమకూరుస్తామన్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశమని, ఆయన సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అతి తక్కువ కాలంలో ఏపీని నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు లక్ష్యమని, దాని కోసం అంతా కృషిచేస్తున్నామన్నారు. అత్యవసరంగా సింగపూర్‌ వెళ్లాల్సి రావడంతో సీఎం ఈ కార్నివాల్‌కు రాలేకపోయారని ముఖ్య కార్యదర్శి కృష్ణారావు వివరించారు. ఏపీలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని వాటికి సహకరించాలని కోరారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్టి మాట్లాడుతూ ఏపీలో సుదీర్ఘమైన సముద్ర తీరప్రాంతం వుందని, కొత్త పోర్టులు వస్తున్నాయని, నదుల అనుసంధానం చేస్తున్నామని చెప్పారువిశాఖలో కొత్తగా నాలుగు వేల మెగావాట్ల ఎన్‌టీసీపీ పవర్‌ ప్లాంటు వస్తోందన్నారు. సీఐఐ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ కార్నివాల్‌కు కొరియా నుంచి 30 మంది వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఏపీలో ఐటీ, పర్యాటక రంగాల్లో గల అవకాశాలను ఆయా రంగాలకు చెందిన అధికారులు వివరించారు. ఇన్‌కేప్‌ ఎండీ సాంబశివరావు, పర్యాటక శాఖ కమిషనర్‌ కజూరియా, ఐటీ సెక్రటరీ ఫణికిశోర్‌, సీఐఐ తరపున రాష్ట్ర వైస్‌ఛైర్మన్‌ శివకుమార్‌, విశాఖ చాప్టర్‌ అధ్యక్షులు నీరజ్‌ శారద, కలెక్టర్‌ యువరాజ్‌, వుడా వీసీ బాబూరావునాయుడు, జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Posted

Ante Singapore hand icchesinda

Posted

Ante Singapore hand icchesinda

 

yaa avunvu man... n8 party shuru chey 

Posted

Amaravathi building lo Korea also helping anthena matter inka emana undi aa, okavela unte one line please tell no.... if yes and anthe then nice  bl@st

Posted

Ante Singapore hand icchesinda

 

 

yedavadam manandi man.

Posted

Amaravathi building lo Korea also helping anthena matter inka emana undi aa, okavela unte one line please tell no.... if yes and anthe then nice  bl@st

 

telugu chdvatam radha bro?

Posted

enni bagaswamyalu ra ayya. lathkor gadu insulting indian companies. India lo ne companies ki develop chese chance iyyochu kada enta sepu singapore, china ippudu south korea.

Posted

telugu chdvatam radha bro?

vastadi kaani antha pedadi antha fast ga chadive opika ledu, meeru evaro okaru chadivintaru kada so reply istaru ani asha cxtd.gif

Posted

enni bagaswamyalu ra ayya. lathkor gadu insulting indian companies. India lo ne companies ki develop chese chance iyyochu kada enta sepu singapore, china ippudu south korea.

Local mytas ki isthe ameeepet flyover ki monna right canal ki emayyindho chulledha :o quality kaavali.. L&t gmr lu unna Antha large scale projects chesina exp ledhanukunta
Posted

Aina 7hills ankul news esaadante chusi lite theeskovali.. Sakshit aj nt news lekka eeyanavanni.

×
×
  • Create New...