Jump to content

Srimanthudu 50 Days Posters, Videos And Celebrations Thread


Recommended Posts

Posted

మహేష్ ఎదిగిపోతున్నాడు !!

 

మనిషి ఎత్తు కొలత అంటే ఒడ్డు పొడవులు కాదు..మంచితనం,ప్రవర్తన..ఈ విషయంలో మహేష్ బాబు చాలా ఎదిగిపోతున్నాడు. సినిమాల్లో తాను పార్ట్ కావడం ద్వారా తనకు లాభం, భాధ్యత వుండేలా చూసుకున్నాడు. దాని రిజల్ట్ చూసాడు. మీడియాతో క్లోజ్ గా వుండడం ద్వారా దాని ఫలితం కూడా చూసాడు. 

నిన్నిటికి నిన్న అఖిల్ ఫంక్షన్ కు రావడం ద్వారా తన ప్రవర్తనను మరో మెట్టు ఎక్కించుకున్నాడు. అడ్డాల శ్రీకాంత్ కష్టాల్లో వున్న వైనం గమనించి, డేట్లు ఇచ్చి చకచకా సినిమా చేస్తూ, శభాష్ అనిపించుకున్నాడు. మరో టాలెంటెడ్ డైరక్టర్ శేఖర్ కమ్ములకమ్ములకు అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తున్నాడ. ఇలా అన్ని విధాలా అందరితో శభాష్ అనిపించేసుకుంటుననాడు. 

ఇప్పుడు ఉన్నట్లుంది తనకు వంద కోట్ల సినిమా ఇచ్చిన కొరటాల శివకు ఏకంగా యాభై లక్షల విలువైన కారును బహుకరించి, వారెవా అనిపించుకున్నాడు. ఇప్పుడు డైరక్టర్ల చూపంతా మహేష్ పై ఎలాగూ వుంటుంది. మాంచి సబ్జెక్ట్ దొరికినా, తయారైనా మహేష్ దగ్గర వాలిపోతారు. ఇది మాంచి స్ట్రాటజీగా వర్కవుట్ అవుతుంది మహేష్ కు. 

×
×
  • Create New...