micxas Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 మందారమకరందమాధుర్యమునఁ దేలు; మధుపంబు బోవునే మదనములకు? నిర్మల మందాకినీవీచికలఁ దూఁగు; రాయంచ జనునె తరంగిణులకు? లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ? బూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరక; మరుగునే సాంద్రనీహారములకు? నంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపానవిశేషమత్తచిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు? వినుతగుణశీల! మాటలు వేయునేల? :)
micxas Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 భావము: ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట; ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య; ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు; మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా; స్వచ్చ మైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు వంకల దగ్గరకు చేరదు కదా; తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా; నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా; అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు.
micxas Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 https://www.youtube.com/watch?v=TAt6prHWqQU :)
micxas Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 Source: http://telugubhagavatam.org/
kiladi bullodu Posted September 28, 2015 Report Posted September 28, 2015 Madhurima pics anukoni vachha
micxas Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 Madhurima pics anukoni vachha updated the title :police:
micxas Posted September 30, 2015 Author Report Posted September 30, 2015 మ్రింగెడి వాఁడు విభుం డని మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్మ్రింగు మనె సర్వమంగళమంగళసూత్రంబు నెంత మది నమ్మినదో? ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది. (ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన గ’, ళ’ లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని, శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.)
micxas Posted October 2, 2015 Author Report Posted October 2, 2015 ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణంబెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁడెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
micxas Posted October 4, 2015 Author Report Posted October 4, 2015 సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డేపరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాంతర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచోపరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై. గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు. Ghajendra Moksham :)
Krish Posted October 4, 2015 Report Posted October 4, 2015 Bapu gari drusyakavyam https://www.youtube.com/watch?v=0QzCAbLA7qs&list=EL8k7jOYIzefg
Recommended Posts