micxas Posted October 4, 2015 Author Report Posted October 4, 2015 Krish any idea how to watch them by bypassing the country name, hola is pretty slow. Bapu gari drusyakavyam
nako_job_kavali Posted October 4, 2015 Report Posted October 4, 2015 Garikapati uncle chepparu bhakthi tv lo....chala baga cheppevaru....i used to follow idhi varaku
micxas Posted October 12, 2015 Author Report Posted October 12, 2015 అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్ :) దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. https://www.youtube.com/watch?v=jY76hKF5kd0
micxas Posted October 28, 2015 Author Report Posted October 28, 2015 ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. భావము: బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
micxas Posted December 4, 2015 Author Report Posted December 4, 2015 అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై. భావము: కష్టాలలో చిక్కుకున్న వారిని రక్షించే విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ వారి అంతఃపురం ఉంది. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఒళ్ళు తెలియని భయంతో కాపాడు కాపాడు అని మొరపెట్టుకోటం ఆలకించాడు.
micxas Posted December 4, 2015 Author Report Posted December 4, 2015 Anukuna ts nuvve ayuntavani :giggle:
aakathaai Posted December 5, 2015 Report Posted December 5, 2015 ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.
Recommended Posts