Jump to content

Recommended Posts

Posted
నల్గొండ జిల్లా కస్తాలలో రెడ్డి సామాజికవర్గం కుర్రాళ్ల వ్యధ ఎన్ని ఎకరాల భూస్వామి అయినా పెళ్లి కష్టమే  పాతికేళ్లు దాటిన వాళ్లు 80 మందికి పైగానే వ్యవసాయదారులైనందునే వారికి కుదరని సంబంధాలు
 
‘‘ప్రైవేటు కంపెనీలో పనిచేసే స్వీపర్‌కైనా పిల్లనిస్తాం తప్ప.. ఎంత పెద్ద భూస్వామి అయినా సరే, వ్యవసాయం చేసుకునే రైతుకు మాత్రం మా అమ్మాయిని ఇవ్వం’’ ..నల్గొండ జిల్లా కస్తాల గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం అబ్బాయిలకు.. అందునా వ్యవసాయం చేసుకునే కుర్రాళ్లకు ఇటీవలికాలంలో తరచుగా ఎదురవుతున్న తిరస్కారమిది. ‘‘పైసా కట్నం తీసుకోం. పిల్లనిస్తే చాలు.. పెళ్లి చేసుకుని తీసుకెళ్తాం’’ అని బతిమాలుతున్నా అమ్మాయిలు దొరక్క.. ఆ ఊళ్లో చాలా మంది వయసు ముదిరిన బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. వానలు లేక.. పంటలు పండక.. వర్షాధార వ్యవసాయం చేయలేక రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే అమ్మాయిల తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఏకరాకు ఏడాదికి రూ.కోటి ఆదాయం తీసే ప్రభుత్వ పెద్దలున్న రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలూ ఉండటం గమనార్హం.

ఊళ్లో మెజారిటీనేగానీ..


కస్తాల గ్రామ జనాభాలో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారి సంఖ్య ఎక్కువ. గ్రామంలోని మొత్తం ఓటర్లలో మూడో వంతు ఈ సామాజిక వర్గం వారే ఉంటారు. గ్రామ పరిధిలోని మొత్తం 3100 ఎకరాల భూమిలో ఈ సామాజిక వర్గం వారివే 1200 ఎకరాలకు పైగా ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలో నాలుగు మదిర గ్రామాలుండగా, అందులో మెండువారి గూడెం, గోపిడివారి గూడేల్లో పూర్తిగా రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారు. మెండువారి గూడెంలో 100 కుటుంబాలకు వంద, గోపిడివారిగూడెంలో 30 కుటుంబాలకు 30 కుటుంబాలు రెడ్డి సామాజికవర్గం వారివే ఉన్నాయి. కానీ.. ఈ ఊళ్లల్లో యువ రైతులకు పెళ్లి మాత్రం కావట్లేదు. దీంతో చుట్టుపక్కల ఏ ఊళ్లో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉందని తెలిసినా.. ఆశగా వెళ్లడం, వారు ‘రైతులకు పిల్లనివ్వం’ అని కరాఖండీగా చెప్పగానే నిరాశగా వెనుదిరగడం పరిపాటిగా మారింది. గ్రామంలో ఇలా 25 సంవత్సరాలు దాటిన యువకులు 70 మందికి పైగా ఉన్నారు. ఉదాహరణకు.. 12 ఎకరాల భూమి ఉండి ఒకే ఒక కొడుకు ఉన్నప్పటికీ, అతడు రైతు కావడంతో పిల్లనివ్వమంటున్నారని వాపోతున్నారు.
 
ఓ యువకుడి తల్లిదండ్రులు. మరొకాయనకు నలుగురు కొడుకులు కాగా అందులో ముగ్గురు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ముగ్గురికీ పెళ్లి అయింది. చిన్న కుమారుడు 40 ఎకరాలను సాగు చేస్తున్నప్పటికి, వ్యవసాయం చేస్తున్నాడన్న కారణంగా అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వీరంతా మూడు పదుల వయస్సుకు దరిదాపులో ఉన్నవారే. ఒకింట్లో ముగ్గురు కుమారులుంటే ముగ్గురికీ.. రైతులు అయినందునే పెళ్లి కాలేదు. దీంతో గ్రామంలోని చాలా మంది యువకుల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు.
Posted

Pedda recession vasthe/ 4-5 years continuos ga varhalu padithe....story reverse avthadi....mana kanna valle better antaru appudu

×
×
  • Create New...