Jump to content

Recommended Posts

Posted

2014 ఎన్నికలకు కాస్త ముందు సీమాంధ్ర (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌)లో తెలుగుదేశం పార్టీ వైఎస్‌ జగన్‌ కారణంగా చాలా దెబ్బ తినేసింది. అలా ఇలా కాదు, తెలంగాణలో కేసీఆర్‌ దెబ్బ, సీమాంధ్రలో వైఎస్‌ జగన్‌ దెబ్బకి తెలుగుదేశం పార్టీ విలవిల్లాడింది. నేతల వలసల్ని ఎలా ఆపాలో అప్పట్లో చంద్రబాబుకి అర్థం కాలేదు. ఇక, తెలుగు నాట తెలుగుదేశం పార్టీ అటకెక్కింది.. అనే టైమ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించింది. అది కాంగ్రెస్‌కి లాభించకపోగా, తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చింది. తెలంగాణలో దెబ్బతిన్నా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి అధికారం దక్కిందంటే అదంతా విభజన పుణ్యమే. 

'ఉమ్మడి రాష్ట్రంలో అయినా అధికారం తెలుగుదేశం పార్టీదే..' అని ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పుకోవచ్చుగాక. గతంలో టీడీపీ పరిస్థితి ఏంటన్నది జగమెరిగిన సత్యం. గతం గతః ప్రస్తుతానికి వస్తే, తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సంకటం తప్పేలా లేదు. ఎటూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతంతమాత్రంగానే వుందనుకోండి.. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేందుకు 'ప్రత్యేక హోదా ఉద్యమం' ఉధృతం చేసే పనిలో వైఎస్‌ జగన్‌ బిజీగా వున్నారు. 

ప్రస్తుతానికి ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా రాజకీయ రంగు పులుముకోలేదనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్‌లో. అయితే వైఎస్‌ జగన్‌ దీక్ష తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉద్యమానికి రాజకీయ రంగు అంటుకోవడం ఖాయమే. అప్పుడిక జంపింగ్‌లు షురూ అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ముచ్చటకి ఎంతో దూరం లేదనీ, వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా దీక్ష మొదలు పెట్టారు గనుక, కొద్ది రోజుల్లోనే ప్రత్యేక హోదా ఉద్యమం చుట్టూ రాజకీయం భగ్గుమంటుందనీ జనం సైతం అభిప్రాయపడ్తున్నారు. 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ప్రజా ఉద్యమంతోపాటు, రాజకీయ ఉద్యమం, రాజకీయ నిర్ణయాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. తెలంగాణలో ఆ స్థాయిలో పొలిటికల్‌ వాక్యూమ్‌నీ, పొలిటికల్‌ పవర్‌నీ కేసీఆర్‌ జనరేట్‌ చేశారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు అదే రూట్‌లో వైఎస్‌ జగన్‌ కూడా పయనిస్తున్నారు. ఎటూ 15 నెలల పాలన పూర్తవడంతో చంద్రబాబు పాలనపై ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే ప్రత్యేక హోదా ఉద్యమాన్నీ తన భుజానికెత్తుకున్నారు వైఎస్‌ జగన్‌. 

జాతీయ స్థాయిలో బీజేపీకి వున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆ ఇబ్బందులన్నీ చెప్పుకోడానికేగానీ, అవి నిజమైన ఇబ్బందులు కావనే వాదనా లేకపోలేదు. ప్రత్యేక హోదా తేనెతుట్టె కదిపితే అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా గురించి ఆందోళనలు మొదలెడ్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది బీజేపీ. ఇదే వైఎస్‌ జగన్‌కి ఆయుధంగా తయారైంది. కేంద్రం ఎటూ ఇవ్వదు గనుక, తాను ఉద్యమాన్ని ఉధృతం చేసి, సెంటిమెంట్‌ని రగల్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బ తగిలే అవకాశాలు తక్కువ.. తగిలినా, ఆ పార్టీకి అదేం లెక్క కాదు. ఇక నష్టపోయేది టీడీపీనే. 

'జగన్‌ దీక్ష ముదిరి, రాజకీయ దుమారం మొదలైతే, ఇక టీడీపీలో వుండడం వల్ల ఉపయోగం లేదు..' అనే నిర్ణయానికి చాలామంది టీడీపీ నేతలు వచ్చేశారట అప్పుడే. వీరిలో ఇతర పార్టీల నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు దూకినవారే ఎక్కువగా వున్నారట. గతంలో 150 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతున్నప్పుడే జగన్‌ సీఎం పదవిని తృటిలో చేజార్చుకున్నారు.   :3D_Smiles_38:  :3D_Smiles_38:

ఈసారి అలాంటి అవకాశం వస్తే మాత్రం ఆయన చేజార్చుకునే ఛాన్సే లేదు. దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. 

మళ్ళీ మళ్ళీ ప్రత్యేక హోదాపై 'చేతకాదు' అనే అంటోంది కేంద్రం. ఇది చాలు, జగన్‌ ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉధృతమవడానికి, రాజకీయంగా జగన్‌ బలోపేతమవడానికీ. ఎంత ప్యాకేజీ ఇచ్చినా సరే, ప్రత్యేక హోదా సెంటిమెంటు తీరే వేరు. అది ఉధృతమయ్యాక దాన్ని తట్టుకోవడం చంద్రబాబు వల్ల కాదు. ఇప్పటికే ఈ దిశగా చంద్రబాబులో వణుకు ప్రారంభమయ్యిందనీ, పార్టీలో గోడ దూకేందుకు ఎవరైనా సిద్ధంగా వున్నారా? అని ఆరా తీస్తున్నారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

చూద్దాం.. నిరాహార దీక్షతో తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌లానే, నిరాహార దీక్షతో వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ఝలక్‌ ఇచ్చి, ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకుంటారేమో.!

:3D_Smiles: 

Posted

which paper ma?


Inka ardam kaale ma sachi paper
Posted

Inka ardam kaale ma sachi paper

Anukunna sakshit ani.
NnFjIA.gif
Posted

SVSC lo Rao Ramesh dialogue ikkada padalsinde..kasta evaraina unte ikkada veyandamma...

×
×
  • Create New...