Jump to content

Recommended Posts

Posted

రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమలు
రేపు విశాఖలో జియోనీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): విపణిలోకి కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌లు వస్తే.. వాణిజ్యపరంగా బలమైన రాష్ట్రాల్లోని ప్రముఖ వేదికలపై వాటిని విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు నవ్యాంధ్రలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. కొత్తగా మార్కెట్లోకి తెచ్చే స్మార్ట్‌ ఫోన్లను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్నారు. ఇటీవల విశాఖలో జియోమీ-రెడ్‌మీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేశారు. జియోనీ స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఈ నెల 12న విశాఖలో చంద్రబాబు చేతుల మీదుగా విడుదల కానున్నది. రాష్ట్ర వేదికలపై స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేయడమే కాకుండా..
తయారీ ప్లాంట్లను నెలకొల్పడంపైనా ఈ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్రంలో జియోమీ ఉత్పత్తులను ప్రారంభించే అవకాశాలున్నాయని పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ అనుసరిస్తున్న ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలను ఆకర్షిస్తున్నది. దీంతో నవ్యాంధ్రలో ప్రపంచ శ్రేణి సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. సకాలంలో భూ కేటాయింపులు, వ్యాట్‌, రిజిసే్ట్రషన్‌, నీరు, విద్యుత్‌లలో ఇస్తున్న రాయితీలు పారిశ్రామిక వర్గాలను ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో అధికంగా అమ్ముడుపోయే ఆపిల్‌, శామ్‌సంగ్‌ మొబైల్‌లకు దీటుగా అమ్ముడుపోతున్న జీయోమీ-రెడ్‌ మీ ఫోన్‌ను ఇటీవల విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రముఖ సెల్‌ ఫోన్‌ కంపెనీలకు ఆర్డర్‌పై ఫోన్లు తయారుచేసి అందించే ఫాక్స్‌ కాన్‌ సంస్థ ఇప్పటికే చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్లాంట్‌లోనే జీయోమీ-రెడ్‌మీ తయారైందని పరిశ్రమల వర్గాలు వివరించాయి. కాగా రెడ్‌మీ మార్కెట్లోకి విడుదల చేసిన సమయంలో తాము భారత్‌లో తయారీ కేంద్రాలను విస్తరిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. సోమవారం విశాఖలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారని సమాచారం. ఈ ప్లాంట్‌ ప్రారంభమయ్యాయక జీయోమీ కూడా ఆర్డర్లు ఇచ్చేందుకు ముందుకువచ్చింది.

ఇక దేశీయ మార్కెట్‌లో ప్రత్యేక ముద్ర వేసుకుని మధ్య, దిగువ తరగతి వర్గాలను ఆకర్షిస్తున్న సెల్‌కాన్‌, మైక్రోమాక్స్‌, కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీలు కూడా రాష్ట్రంలో తయారీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ కంపెనీలకు రేణిగుంటలో ఏపీఐఐసీ భూములు కేటాయించింది. అసెస్‌ కూడా తమ సంస్థను ఏపీలో నెలకొల్పుతామని ప్రకటించింది. ఇలా వరుసగా సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా మార్చుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఏపీ సాఫ్ట్‌వేర్‌ రంగానికే పరిమితమై ఉన్న సమయంలో వస్తు తయారీ సంస్థలు కూడా ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకువస్తున్నాయి. త్వరలోనే మరో ప్రముఖ సెల్‌ తయారీ సంస్థ కూడా ఏపీలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నదని పరిశ్రమల వర్గాలు తెలిపాయి.

Posted

OnePlus India ‏@OnePlus_IN 3h3 hours ago
We've partnered with Foxconn to start local production in India. Special thanks to Andhra Pradesh Govt. @MakeInIndia #NextBigStep

Bl@st

Posted

Just in 18 months 

 

Oneplus, Gionee,Asus ,xiomi,foxconn,karbon, micromax,celkon, lava

 

CBN brahmanandam+whistle.gif

Posted

Cbn rocks

Aithe manaki one plus one cheAp ye annamata

Posted

Cbn rocks

Aithe manaki one plus one cheAp ye annamata

 

Yes  CITI_c$y

Posted

Anni china products ena

Jagan anna ayihte, Road Roller manufacturing company pettevaadu 
chudataniki cheppukotaniki final product pedda diga vundedi  waste CBN 

Intaki jaffa Jagan anna Vuunada poyada ? photo-thumb-13285.jpg?_r=1444655446

Posted

Aa memu inkolla meeda Assal edvam...maa TG meede edustharu...endo ee androllu :(

Posted

Ayinapdu chuddam le ani Tamarindi baa Annadu photo-thumb-13285.jpg?_r=1444655446

aaadu evadu?

×
×
  • Create New...