Jump to content

Recommended Posts

Posted

మొబైల్ ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సాధించామని ఇ-కామర్స్ అగ్రసంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రకటించుకుంది. 10 గంటల్లోనే 5 లక్షల ఫోన్లు విక్రయించామని తెలిపింది. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఇన్ని ఫోన్లు అమ్మడం ఇదే మొదటిసారి అని ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

'బిగ్ బిలియన్ డేస్ సేల్'లో భాగంగా నేటి నుంచి సెల్ ఫోన్లు విక్రయిస్తోంది. గత అర్ధరాత్రి నుంచే కొనుగోలుదారులు పోటెత్తారని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు నాగపూర్, ఇండోర్, కోయంబత్తూరు, విశాఖపట్నం, జైపూర్ వంటి నగరాల్లోనూ అమ్మకాలు జోరెత్తాయని వెల్లడించింది. 4జీ ఫోన్లు ఎక్కువగా కొన్నారని, 10 గంటల్లో 75 శాతం 4జీ ఫోన్లు అమ్ముడయ్యాడని తెలిపింది.

భారత్ లో స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ కు తాము సాధించిన రికార్డు అద్దం పడుతోందని ఫ్లిప్ కార్ట్ వాణిజ్య విభాగం అధిపతి ముఖేష్ బన్సల్ అన్నారు. 'బిగ్ బిలియన్ డేస్ సేల్' ఈనెల 17వరకు కొనసాగుతుంది.

 

 

http://www.sakshi.com/news/business/flipkart-sells-half-a-million-handsets-in-10-hrs-283940?pfrom=home-top-story

Posted

yesterday nenu kondam ante ne yavva only app offers evvi... 

 

APP open ayyi sasthey kada

Posted

yesterday nenu kondam ante ne yavva only app offers evvi...

APP open ayyi sasthey kada


@3$%
×
×
  • Create New...