Jump to content

Open Letter To Jagan - Dedicated To Langas...


Recommended Posts

Posted

జగన్ అన్న,
నీ ఒక్క కడుపు నిండటానికే, వాన్పిక్ అని ఒక 30 వేల ఎకరాలు, సైన్స్ సిటీ అని ఒక 50 వేల ఎకరాలు, బెంగలూరు లో 30 ఎకరాలలో ఇల్లు, హైదరాబాద్ లోటస్ పాండ్ అని, బినామీ కంపెనీస్ పేరుతో ఒక మహలు, ఇక ఇడుపులపాయ ఒక మాయ, 600 ఎకరాల అసైన్డ్ భూముల్ని అప్పనం గా తరతరాలు అనుభవించి, .. నీ భూదాహం తో ఐఏఎస్ ఆఫీసర్స్ ని జైలు కి పంపి, వ్యాపారవేత్తల్ని జైలు పక్షుల్ని చేసి, స్వయం గా నీ భుదాహం తో 16 నెలలు జైలు జీవితం గడిపి, ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్ట్ దర్సనం చేసుకుంటూ గడుపుతున్న నువ్వు, - కాపిటల్ సిటీ లేకుండా, ఒక సరైన ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా లేని ఆంధ్ర ప్రదేశ్ మీద కక్ష గట్టి, ప్రతి రోజు ఏదో ఒక రకంగా ఏడుస్తూ , నీ ఏడుపు లాగే అందరు ఏడవాలని శపిస్తూ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అడుక్కు తినాలని నీ కుటిల నీతితో కాపిటల్ కోసం భూమి ఎందుకు అంటావా... ఒక ప్రైవేటు సెజ్ కె 30, 40 వేల ఎకరాలు కేటాయించే ఈ రోజుల్లో, కాపిటల్ కోసం భూమి వద్దా? అన్న, నువ్వు మా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మీద దయవుంచి ఏ బెంగుళూరు లో నో , హైదరాబాద్ లో నో సెటిల్ అయిపో.. మా జీవితాలు గురుంచి, మా అభివృద్ధి గురుంచి బెంగ పెట్టుకోమాక.. అన్నో ఇంకో విషయం,
నీ ఖర్మ కాలి, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ రాజధాని అమరావతి లో నే వుంటుంది. అమరావతి అంటే గిట్టని నువ్వు ఇంకా శాశ్వతం గా బెంగుళూరు లో నో , హైదరాబాద్ లో నో , నీ ఏడుపు గొట్టు రాజకీయాలు చేసుకుంటూ ఆయా రాష్ట్ర రాజకీయాల్లో నీ విలువైన సమయాన్ని వెచ్చించి, ఆయా రాష్ట్ర అసెంబ్లీ ల కి ట్రై చేసుకోవాల్సింది గా నిన్ను వేడుకొంటున్నాము. మీ అన్న కెసిఆర్ నీకు అండగా వుండగా, నీ లోటస్ పాండ్ లో నువ్వు సేఫ్ గా వుండి, ఆ రాష్ట్ర ప్రజల కోసం నీ జీవితం అంకింతం చేసుకోవాల్సింది గా మనవి.. ఇంకో విషయం , నీకు ఎంతో అవసరమైన హై కోర్ట్, నీకు అనువుగా వుండటం కోసమై ఇప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ లో కట్టొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ని వెడుకుంటున్నమ్..
అన్నో,, నీకు చేతనైతే కొన్ని ఇటుకలు, వదిన ని అడిగి కొన్ని సిమెంట్ బస్తాలు, మీ గాలి అన్న ని అడిగి కొంత ఇనుము అమరావతి నిర్మాణానికి విరాళం గా ఇవ్వు..
లేకపోతే నీ లాయర్స్ కి ఫీజు కట్టడానికి ఉపయోగపడుతుంది, నువ్వే ఉంచుకో.. అంతే గాని ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి కొట్టమాకు ఆ సోనియా గాంధీ లాగ..

సెలవు.
ఇట్లు,
ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి అని కోరుకునే ఒక సగటు ఆంధ్రుడు

×
×
  • Create New...