Jump to content

Rod Lee -- Genuine Review


Recommended Posts

Posted

అది 1963 వ సంవత్సరం... అల్బేనియా దేశం...ఒక దుండగుడు ఒక చర్చ్ లోకి చొరబడి నాటు తుపాకీ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు,ఎవరు గాయపడలేదు సరి కదా వాడు దొరికిపోయాడు... పోప్ ముందు ప్రవేశ పెట్టారు...పోప్ ఒరే పాపి నువ్ వచ్చే జన్మ లో ఇంతకింత అనుభవిస్తావ్ అని శాపం పెట్టాడు...

అది 2015 వ సంవత్సరం... అల్బేనియా లో పాపం చేసిన పాపి బ్రూస్లీ థియేటర్ లో తేలాడు... వాడి పేరు ప్రవీణ్ అంట...అంటే నేనే....

సినిమా మొదలయ్యింది... డిల్లీ పబ్లిక్ స్కూల్ అనే కాస్ట్లీ స్కూల్ మీద సీన్స్ చూసి నా కళ్ళు తడిచి ఆ నీళ్ళ వల్ల కాళ్ళు తడిచాయ్....

కలెక్టర్ అవ్వాలనే అక్క... తనే సొంత గా తన కూతురు ని కలెక్టర్ ని చెయ్యాలనే నాన్న... నాన్న వల్ల కాదు నేనే చేస్తా అని అండర్ కవర్ లో కష్టపడే తమ్ముడు...సినిమా మొత్తం పూలు కడతానో బియ్యం ఏరతానో ఉండే తల్లి.... ఇది ఒక అందమైన కుటుంబం... యాయ్ దొంగ నీ కళ్ళు తడిచాయ్ కదా...

కట్ చేస్తే హీరో కి డూప్ కి రాం చరణ్ చేసే ఫైట్స్ నభూతో...

కథ లో ఏం లేకుండా ఇంటర్వల్ దాకా లాగారు..ఇంటర్వల్ లో ఆల్ ఇండియ ఐ జి చీఫ్ ముఖేష్ రుషి గారు వచ్చి అరే రాం చరణ్ నువ్ పోలీస్ అని మా అమ్మాయ్ ని మోసం చేశావ్... నేను ఐ జి చీఫ్ ని... నన్ను మోసం చెయ్యలేవ్ అంటాడు.. నాకు టెన్షన్ తో రెండు షర్ట్ గుండీలు తెగిపోయాయ్... సార్ నేను మీ అమ్మాయ్ కి అబద్దం చెప్పలేదు..నేను స్తంట్ మాన్ ని అని చెప్తా అంటే... లేదు నువ్ విలన్ ని విలన్ అని ప్రూవ్ చెయ్యాలి...అదే నీకు అత్యంత ముఖ్యమైన మిషన్...అంటాడు...ఐ జి చీఫ్ ఆఫ్ట్రాల్ సినిమాల్లో డూప్ గా చేసే వాడికి అంత పెద్ద మిషన్ అప్పగించటం అనే ఎమోషన్ లో మిగతా గుండీలు నేనే తెంపుకున్నా...

అక్కడ విరామం ఇచ్చి లోపల గుచ్చిన రాడ్స్ తీసారు.... మళ్ళి కాల్చాటానికి అనుకుంటా...

సెకండ్ హాఫ్ స్టార్ట్... మళ్ళి తడిక తడిక స్టార్ట్.... జాలి దయా లేకుండా ఆగడు ఫ్లాప్ చేసినందుకు సీనన్నా... గోవిందుడు ఫ్లాప్ చేసినందుకు చరణన్న కలిసి మరణ మృదంగం వాయించారు....

ఆ మిషన్ లో రాం చరణ్ కి ఒకడు అవసరం అవుతాడు అని వాడు బ్రహ్మానందం అవుతాడని మనకి ముండే తెలుసు....అయినా కొత్త గా ప్రవేశ పెట్టారు... ఆ కొత్త దనం చూసి నాకు మూర్చా ఆయా...

అలా అలా హీరో ని కాల్చెసి గండిపేట్ చెరువు లో వేస్తారు....కాని హీరో చావలేదని మళ్ళీ లేస్తాడని మనకి తెలుసు... కారణం ఆయన హీరో అవ్వటం.....

హీరో హెలికాపటర్ లో ఓడ మీద దూకి యాయ్ బిషా యాయ్ డిషా అని ఫైట్ చేస్తాడు....సినిమా అయిపోయిందా అంటే అవ్వదే..... చిరంజీవి రావాలి గా

చిరంజీవి కూడ హెలికాప్టర్ లో వచ్చాడు...రకుల్ ప్రీత్ ని స్లో మోషన్ ఫైట్ లో కాపాడి రాం చరణ్ తో కలిసి గుర్రం స్వారి చేసుకుంటా వెళ్ళిపోతాడు...

బ్రూస్లీ కంటే రాడ్లీ అనేది మాచ్ అవుద్ది..ఆగడు తో జనం క్లియర్ గా చెప్పినా శీనన్న మళ్ళీ రొటీన్ కథ ఏస్కొచ్చాడు....తమన్ బాబ్ పగ బట్టి మ్యూజిక్ కొట్టాడు....రాం చరణ్ డాన్సెస్ లో సూపర్ చేశాడు.....యాక్టర్ గా ఇంప్రూవ్ అయ్యాడు....

నేనే కనుక అల్బేనియా ఆ పాప కార్యం చేసి పోప్ తో పాపి అనిపించుకోకుండా ఉండుంటే నాకు ఇలా జరిగేదా...

ఈ సినిమా కూడా ఆడితే జనాలకి ఎర్రటి రాడ్స్ కాల్చి దోపాలి... ..క్రికెట్ లో ధొబి సినిమాల్లో సెర్రి వట్ర సుడి గాళ్ళు... కాని ఈ సినిమా ఆడదు అని నా గట్టి నమ్మకం..

×
×
  • Create New...