Jump to content

Recommended Posts

Posted
  • అవి రాష్ర్టానికి రెండు కళ్లు
  • డబ్బుల్లేవ్‌.. ఆలోచనలే పెట్టుబడి
  • వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
  • వైద్యులు విమానాల్లో తిరగొద్దన్నారు
  • ఆరోగ్యాన్ని లెక్క చేయక తిరుగుతున్నా
  • ప్రజల నమ్మకమే నడిపిస్తోంది
  • అద్భుత రాజధాని నిర్మిస్తానన్నది వారి ఆశ
  • దాన్ని వమ్ము చేసి మురికివాడ కట్టలేను
  • ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు
‘ప్రజలు నాపై ఉంచిన విశ్వాసమే నన్ను నడిపిస్తోంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న సంకల్పంతో అన్ని అవరోధాలను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అద్భుత రాజధానిని నిర్మిస్తానన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మురికివాడను నిర్మించలేనని, మంచి చేయాలనుకున్నప్పుడు దేవతలకూ రాక్షసుల నుంచి బాధలు తప్పలేదన్నారు. అసూయ, ద్వేషాలతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటానికి ఆరోపణలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయని, అవే పెట్టుబడిగా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించి తీరుతానని తెలిపారు. సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకెళుతానన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈసారి రెండు దసరా పండుగలు వచ్చాయని చెప్పారు. అమరావతి రాజధాని శంకుస్థాపన మహోత్సవాన్ని పుర స్కరించుకుని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ విశేషాలు ఇవీ..
 
 
రాజధానిపై ఎన్నో ఆశలు, అంచనాలుకల్పించారు. సాధ్యమవుతాయా?

నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలను అమలు చేయగలిగినవారే ప్రపంచంలో ముందుకు వెళ్లగలిగారు. రాజధానికి స్థాన బలం, వాస్తు బలం, సంకల్ప బలం, ప్రజా బలం ఉన్నాయి. ఇక కావాల్సిందల్లా దైవ బలం. అందుకే రాజధాని శంకుస్థాపనను ఓ పవిత్ర క్రతువులా చేస్తున్నాం. అందరిని భాగస్వామ్యులను చేస్తున్నాం. రాజధాని పరిధిలో తొమ్మిది సిటీలను అభివృద్ధి చేస్తాం. ఆర్థిక నగరం, స్పోర్ట్స్‌, హార్డ్‌వేర్‌, ఇంధనం... ఇలా తొమ్మిది అంశాల పేరిట తొమ్మిది నగరాలను ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ యూనివర్శిటీలను రప్పిస్తాం. ఇవన్నీ వస్తే కార్పొరేట్‌ కంపెనీలు వాటంతట అవే వస్తాయి. ఆఫీసు నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఇళ్లు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం. రాజధాని నగరాన్ని కెనాల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం. రాజధానికి అటూ ఇటూ నది ఉన్నందున నగరం మీదుగా అనేక కాల్వలు వస్తాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి త్వరితగతిన వెళ్లేందుకు వాటర్‌ ట్యాక్సీలు వస్తాయి. దీంతో ట్రాఫిక్‌ జాంలు ఉండవు. అర్బన్‌ ట్రాన్స్‌పోర్టుకూ ఇబ్బందులు తొలగిపోతాయి.


 
 
రాజధాని శంకుస్థాపనపై ప్రచారం ఎక్కువగా లేదా?
రాజధాని ఒక మెగా ప్రాజెక్టు. రాజధాని నిర్మాణాన్ని ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరపాలని అభ్యర్థించా. ఆయన వస్తానని మాట ఇచ్చారు. ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు రాష్ట్రంలోని 16 వేల గ్రామాలలో కులమతాలకతీతంగా ప్రార్థనలు చేయించి మట్టి, నీరు తెప్పిస్తున్నాం. ఈ మట్టిని రాజధానిలో జరిగే అన్ని నిర్మాణాలకు వాడతాం. ఇదంతా ప్రజలందరిలో ఒక సంకల్పాన్ని కల్పించడం కోసమే తప్ప ప్రచారం కోసం కాదు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.
 
 
 
రైతులు మిమ్మల్ని నమ్మి భూములు ఇవ్వడానికి కారణం?

విభజన తర్వాత కూడా కొందరు ఎన్నో రాజకీయాలు చేశారు. రాజధానిని ఎక్కడ కట్టాలనే విషయంలోనూ ఎన్నో అడ్డంకులు సృష్టించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమదూరంలో ఉంటుందని కృష్ణానదీ తీరాన్ని రాజధాని కోసం ఎంపిక చేశాం. విభజన తర్వాత సంక్షోభ పరిస్థితుల కారణంగా రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడింది. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా రైతులు నన్ను నమ్మారు. నేను ఇచ్చిన పిలుపును విశ్వసించి భూసమీకరణ కింద 33 వేల ఎకరాలు ఇచ్చారు. దీనిని కూడా కొందరు నాయకులు భరించలేకపోయారు. భూములు ఎలా ఇస్తున్నారని రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ నాపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సడలింప చేయలేకపోయారు. ప్రజలు నా మీద ఉంచిన నమ్మకమే నన్ను నడిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒకప్పుడు బీడు భూములను హైటెక్‌ సిటీగా మార్చింది చంద్రబాబేనని ప్రజలు నమ్మారు. ఇప్పుడు అన్ని వనరులు ఉన్న అమరావతిని అంతకంటే అద్భుతమైన, అసాధారణంగా నిర్మించగలనన్న నమ్మకమే రైతులను భూములు ఇచ్చేలా చేసింది. సింగపూర్‌ వైశాల్యం కంటే మన రాష్ట్ర వైశాల్యం 200 రెట్లు పెద్దది. ఆ దేశ జనాభా కంటే ఇక్కడ పది రెట్లు ఎక్కువ. అలాంటి ఆంధ్రప్రదేశ్‌కి అద్భుతమైన రాజధానిని ఎందుకు నిర్మించుకోలేం.


 
 
ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించడం లేదంటారా?

కొంత మంది నాయకులు మనమే తెలివైన వాళ్లమనుకుంటారు. కానీ అందరికంటే ప్రజలు చాలా తెలివైనవాళ్లు. అసెంబ్లీ ఎన్నికలలో ఓ పార్టీ అక్కడ కేసీఆర్‌తో లాలూచీ పడింది. ఇక్కడ కాంగ్రెస్‌తో జతకట్టింది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఆ వ్యక్తిని జైలు నుంచి ఎన్నికల ముందే హడావుడిగా విడుదల చేయించింది. చివరికి ఏం జరిగింది? ప్రజలు ఎవరిని నమ్మారు? అయినా ఆ నాయకుల బుద్ధి మారటం లేదు.


 
 
కేంద్రం రాష్ట్రానికి సరిగా సహకరించడం లేదన్న విమర్శలపై..?

రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి ఇవ్వాల్సిన సంస్థలను పొందుపరిచారు. అయితే కేంద్ర ప్రభుత్వం వాటి కంటే ఎక్కువగానే ఇస్తోంది. చట్టంలో 11 విద్యాసంస్థల ఏర్పాటును మాత్రమే ప్రస్తావించగా కేంద్రం 16 సంస్థలను రాష్ట్రానికి మంజూరు చేసింది. రాష్ట్ర విభజన మనం కోరుకుంటే వచ్చింది కాదు. కనుక ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూతనివ్వాలని కోరుతున్నాం. కేంద్రం చేయూతనిస్తుందన్న నమ్మకం ఉంది. అయితే కొంత మంది దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. మీరు వచ్చేయండి.. మేం దూరుతాం..(నవ్వు) అని ఎన్డీయే చేరటానికి కొందరు తహతహలాడుతున్నారు.


 
 
కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని భావిస్తున్నారా?

రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ అత్యవసరం. ఒకటి వచ్చి ఒకటి రాకపోతే ఇబ్బందులే. కేవలం హోదా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదు. హోదా ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు? స్టేటస్‌ ఇచ్చిన 11 రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయి. నిధులతో కూడిన ప్యాకేజీ కూడా ఎంతో అవసరం. కొంత మంది రాజకీయం కోసం ‘హోదా’ను వాడుకుంటున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. వాళ్ళు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన సంస్థల గురించి మాట్లాడరు. ప్యాకేజీ ఊసు ఎత్తరు. స్టేటస్‌ గురించి ఢిల్లీలో మాట్లాడకుండా ఇక్కడ మాత్రం గోల చేస్తుంటారు. ఇదేం పద్ధతి. చిత్తశుద్ధి ఉంటే అడగాల్సిన చోట అడగాలి.


 
 
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మీ ప్రాధాన్యాలు ఏమిటి?

రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం రెండు కళ్లులాంటివి. ఈ రెండిటిని పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం మొత్తం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు గాలేరు నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సి ఉంది. తోటపల్లి, వంశధార-2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. దేశంలో ఉన్న గొప్ప నగరాలకు ధీటుగా అమరావతిని తీర్చిదిద్దుతాం.


 
 
రాజధాని భూములు సింగపూర్‌ కంపెనీలకు అమ్మేస్తున్నారన్న ఆరోపణలపై..?
నన్ను నమ్మి ఒక్క పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం అప్పగించారు. ఇప్పుడు అక్కడ ప్రపంచస్థాయి నగరానికి బదులు ఒక మురికివాడను ప్రతిపక్షనేతలు కోరుకుంటున్నారు. నేను, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ వ్యాపారభాగస్వాములమని ఆరోపిస్తున్నారు. ఇలాంటి అరోపణలు చేస్తే సింగపూర్‌లో అయితే బయట కూడా తిరగలేరు. సింగపూర్‌ మచ్చుకైనా అవినీతి లేని దేశం. నేను విమానాలు, హెలికాప్టర్‌లో తిరగడాన్నీ తప్పుపడుతున్నారు. నిజానికి నన్ను విమానాల్లో తిరగొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. తిరగడం మానేస్తే పనులు ఎలా అవుతాయి? విమానాల్లో ఎక్కువ తిరిగితే నిస్సత్తువగా తయారవుతాం. అయినా విమానాల్లో తిరగడం నాకేమైనా సరదానా? నా చేతికి గడియారం, ఉంగరం కూడా పెట్టను. కాలిబాటన రెండువేల కిలో మీటర్ల పైగా తిరిగాను. దోమల్లో పడుకున్నాను, బస్సుల్లో గడిపాను. అలాంటి నాపై నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. ఒక గంట సమయం ఆదా అయితే ఏదో ఒక ప్రభుత్వ శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తా. రూ.20-30 కోట్లు ఆదా చేయగలుగుతా. కేంద్రం దగ్గరికి వెళ్లి అడుక్కునైనా రాషా్ట్రనికి ఓ వంద కోట్లు తేగలుగుతా.
 
 
 
దేవతలకూ రాక్షసుల బాధ!
 
 
రాజధాని అభివృద్ధిని ‘రియల్‌’ వ్యాపారంగా మారుస్తున్నారన్న ఆరోపణలపై..?
దేవతలకు కూడా రాక్షసుల బాధ తప్పలేదు. ఒక మంచి వెంట ఎప్పుడూ చెడు కూడా ఉంటుంది. దానికి దుర్మార్గం కూడా తోడవుతుంది. నన్ను నమ్మిన వారి జీవితాలు బాగుండాలనేదే నా కోరిక. అంతకు మించి నాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. కొంత మంది నేనేదో డబ్బు కోసం చేస్తున్నానని పిచ్చి విమర్శలు చేస్తున్నారు. జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న దశలో కూడా హైదరాబాద్‌ను హైటెక్‌ సిటీగా మార్చి సంపద పెంచగలిగా. నా ఆత్మవిశ్వాసంతో అన్ని ఇబ్బందులు అధిగమిస్తా. సీమలో నెలకొన్న కరువు కాటకాలను తొలగించటానికే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేపట్టాం. దీంతో రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారుతుంది. నెల్లూరులోని శ్రీసిటీలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ శుభ సూచకాలు కావా? అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.
 
 
వచ్చే విద్యాసంవత్సరం లోపు అంతా రావాల్సిందే
 
 
ఉద్యోగుల తరలింపు, స్థానికతపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి?

వచ్చే విద్యాసంవత్సరంలోపు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరూ ఆంధ్రప్రదేశ్‌కు తరలి రావలసిందే. ఈ నెల 22 తర్వాత ఎంతమందికి వీలైతే అంతమందిని కొత్త రాజధానికి రమ్మని చెప్పాం. నేను హైదరాబాద్‌లో ఉంటే వారంతా ఇక్కడకి రారు. అందుకే నేను ముందు వచ్చాను. స్థానికత విషయంలో 2017 మార్చిని డెడ్‌లైన్‌ పెట్టినట్లే ప్రభుత్వ యంత్రాంగం తరలివచ్చేందుకూ డెడ్‌లైన్‌ పెడతాం.


 
 
ఎవరొచ్చినా స్థానికత ఇస్తామన్న ప్రకటనతో స్థానికులకు నష్టం జరగదా?
అందుకే స్థానికత నిర్ధారణకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. నిర్దిష్ట సమయంలోగా వచ్చిన వారికే స్థానికత ఇస్తామని ప్రకటించాం. పాకిస్థాన్‌ విడిపోయినప్పుడు కూడా కొంత మంది తరలి వచ్చిన మనదేశంలో స్థిరపడ్డారు.
 
 
జగన్‌ది ఓర్వలేనితనం
 
  • ప్రపంచంలో ఇలాంటి నెగిటివ్‌ థింకింగ్‌ వ్యక్తి ఉండరు
  • అమెరికాలో కాల్పులకు పాల్పడిన ఉన్మాది లాంటి వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి
 
ప్రతిపక్ష నేత జగన్‌ శంకుస్థాపనకు రానని ప్రకటించడంపై..?
వైసీపీ అధినేత జగన్‌కు అసూయ, ఓర్వలేనితనం. అందుకే ఆయన అమరావతి శంకుస్థాపనకు రానంటున్నారు. ప్రపంచంలో ఇలాంటి నెగెటివ్‌ థింకింగ్‌తో ఎవరైనా ఉంటారా?విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాలను అధిగమించి ముందుకు వెళుతుంటే కొత్త సమస్యలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై అడగాల్సిన చోట అడగాలి. మహావిరోధిగా భావించేవారైనా శుభకార్యానికి ఆహ్వానం పంపితే హాజరవుతారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను నా జీవితంలో చూడలేదు. కొంతమందికి ఏ పనీ ఉండదు. ఊరికే అయినదానికి కానిదానికి నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు. అందరినీ తిడుతుంటారు. గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీలోని ప్రధాని వరకు వీరు ఎవ్వరినీ వదలరు. ఇలాంటి నెగెటివ్‌ థింకింగ్‌ వారి గురించి మీకో విషయం చెబుతా.. ఇటీవల అమెరికాలో ఓ ఉన్మాది తుపాకీతో స్కూల్‌కి వెళ్లి పిల్లల్ని కాల్చి చంపేశాడు. ఆ ఉన్మాది మానసికస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సి ఉంది.
 
 
కేసీఆర్‌ను రేపు ఆహ్వానిస్తా..

కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానిస్తారా?
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదివారం స్వయంగా కలిసి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తా. ఆదివారం గవర్నర్‌ను కూడా కలిసి ఆహ్వానిస్తా. నాకు ఎవ్వరితోనూ విరోధం లేదు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. గోదావరి జలాలను పట్టిసీమకు తరలించడంపై తెలంగాణ నాయకులు చేస్తున్న విమర్శలు సబబుకాదు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలనే వాడుకుంటున్నాం. తెలంగాణలో వచ్చే నీటిని వాళ్లు వాడుకోవచ్చు. దుమ్ముగూడెం, ప్రాణహిత, చేవెళ్ల ద్వారా వాళ్లు గోదావరి జలాలను వినియోగించుకోవచ్చు.


 
 
రాష్ట్ర విభజన వల్ల ఏపీకే లాభమన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై..

రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే ఇద్దరికి సమన్యాయం జరగాలని నేను చెప్పాను. కానీ అలా జరగలేదు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎవరు సానుకూలంగా మాట్లాడినా స్వీకరిస్తా.

Posted

chestado ledo tarvata sangati..alanti confidence chala avasaram. 

Posted

chestado ledo tarvata sangati..alanti confidence chala avasaram. 

Confidence matters everytime anytime...

Posted

[quote name="loser" post="1307556772" timestamp="1445045142"]

Androlla kutra[/quote]


Correst

dXzT01.gif[/quote]

Posted

2 anipste kastam... framers ni kuda chussuovali 

polavaram valla farmers kega use

Posted

chestado ledo tarvata sangati..alanti confidence chala avasaram. 

 

Confidence matters everytime anytime...

×
×
  • Create New...