Jump to content

Recommended Posts

Posted

2 anipste kastam... framers ni kuda chussuovali 

 

 

This time IT vadilesi farming meda padadu Babu last time chesina mistakes repeat kakunda.

 

Pattiseema dwara almost 17 lakhs acres farming and krishna,guntur,prakasham ki drinking water vastundi. Ikada save ayina water ni rayalaseema ki iste chalu Rayalaseema farmers and drinking water kuda vastundi but by next year it is possible.

Posted

2 anipste kastam... framers ni kuda chussuovali



  • కరువు రైతుకు దన్ను.. ఈ-మార్కెటింగ్‌
  • ఉత్పత్తుల విక్రయాల కోసం సరికొత్త ప్రయోగం
  • హిందూపురంలో ట్రయల్‌ రన్‌ పూర్తి
  • త్వరలో కళ్యాణదుర్గంలో ప్రారంభం
  • మరో మూడు యార్డుల్లో అమలుకు ప్రతిపాదనలు
  • దళారుల మోసాలకు చెక్‌ పడినట్లే..!
  • అటు రైతుకు, ఇటు యార్డుకు పెరగనున్న ఆదాయం
ఆరుగాలం శ్రమించినా రైతన్నకు వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి. సకాలంలో వర్షాలు కురవక పంటలు చేతికందని దుస్థితి. అప్పో సప్పో చేసి పంటలు పెట్టిన రైతన్నను ప్రతిఏటా ప్రకృతి వెక్కిరిస్తూనే వస్తోంది. అరకొరగా చేతికందిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు వెళితే దళారులు దగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ- మార్కెటింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే హిందూపురంలో ట్రయల్‌ రన్‌ పూర్తి చేసింది. కళ్యాణదుర్గంలోనూ త్వరలోనే అమలు చేయనుంది. అనంతపురం, తాడిపత్రి, కదిరి మార్కెట్‌ యార్డుల్లోనూ అమలు చేయాలంటూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇదే గనుక అమలు జరిగితే దళారులు, వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టినట్లే.. అటు రైతు, ఇటు మార్కెట్‌ యార్డుల ఆదాయం పెరగనుంది.

అనంతపురం కలెక్టరేట్‌ : పంట సాగు చేసిన తర్వాత దిగుబడులు రావడం ఎంత ముఖ్యమో... పండిన పంటను మద్దతు ధరకు విక్రయించడం అంతే అవసరం. వర్షాభావ పరిస్థితుల్లో అరకొరగా పండిన ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకుంటూ రైతులు మరింత నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు, దళారులు రైతులను నట్టెట ముంచుతున్నారు. ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ-మార్కెటింగ్‌ విధానాన్ని అమలు చేసి రైతులకు వెన్ను దన్నుగా నిలిచేందుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో తొమ్మిది మార్కెట్‌యార్డులలో ఈ మార్కెటింగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి విడతగా జిల్లాలోని హిందూపురం, కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డుల్లో ఈ విధానం అమలుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో హిందూపురం మార్కెట్‌ యార్డులో గత నెలాఖరులో ట్రయల్‌రన్‌ చేశారు. మరో కొన్ని రోజుల్లో కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డులో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 వరకు మార్కెట్‌ యార్డులున్నాయి. వీటిలో ఐదారు ప్రాంతాల్లోని యార్డులు మాత్రమే సక్రమంగా నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనంతపురం, తాడిపత్రి, కదిరి మార్కెట్‌ యార్డుల్లోనూ ఈ మార్కెట్‌ విధానం విధానం అమలుకు ఇక్కడి మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.



ఈ మార్కెటింగ్‌ అమలుకు చర్యలు...రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించుకునే సదుపాయం కల్పించి రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బు చెల్లించనున్నారు. హిందూపురం మార్కెట్‌ యార్డులో రూ. 20లక్షలు ఖర్చుచేసి 20కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్‌నెట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధం చేశారు. 10 మంది సిబ్బందికి ఆన్‌లైన్‌ విధానంపై ప్రత్యేక శిక్షణనిచ్చారు. అదే విధంగా పలువురు ఎంపిక చేసిన రైతులు, ట్రేడర్స్‌ను కర్ణాటకకు తీసుకువెళ్లి నూతన విధానంపై అవగాహన కల్పించారు. ఎన్‌సీడీఈఎక్స్‌ కంపెనీతో ఈ-మార్కెటింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ విఽధానంలో కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్లకు ఐడీ నెంబర్లు, పాస్‌వర్డ్‌లు అందజేయనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు రిజిసే్ట్రన్‌ వివరాలు, బ్యాంకు ఖాతాను నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఈ- మార్కెటింగ్‌ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.



అమలు విధానం ఇలా...
ఇదివరకు మార్కెట్లకు తీసుకొచ్చిన చింతపండు, ఎండు మిరప, బెల్లం, ఇతరత్రా ఉత్పత్తులను కమీషన్‌ ఏజెంట్లు షాపుల్లో ఉంచి రాసులుగా పోసి అమ్మేవారు. దీనివల్ల కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్లు రింగై ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చేవారు. అయితే నూతనంగా అమలు చేసే ఈ బిడ్డింగ్‌ ద్వారా సరుకు తీసుకెళ్లిన రైతులు మొదట మార్కెట్‌యార్డ్‌ ప్రధాన గేటువద్ద తమ సరుకు నాణ్యత, మొత్తం కేజీలు చెప్పాలి. అదే విధ ంగా రైతు సెల్‌ నెంబర్‌ అందజేసి రైతుకు సంబంధించిన గుర్తింపు కార్డు, సరుకు వేసే కమీషన్‌ ఏజెంట్ల దుకాణం పేరు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్కెటింగ్‌ అధికారులు సంబంధిత రైతుకు లాట్‌ నెంబర్‌ కోడ్‌ ఇస్తారు. అనంతరం రైతులకు సూచించిన కమీషన్‌ ఏజెంట్‌ దుకాణానికి తీసుకువెళ్లాలి. వ్యాపారులు సరుకును బట్టి లాట్‌నెంబర్‌ తీసుకుని యార్డ్‌ కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ద్వారా ధరను కోడ్‌ చేస్తారు. ఒకే లాట్‌కు ఎక్కువమంది వ్యాపారులు కోడ్‌ చేస్తే అధిక ధరకు పాడుకున్న వ్యాపారికి అప్పగిస్తారు. అలాకాకుండా ఒకేలాట్‌ను ఇద్దరు ముగ్గురు వ్యాపారులు ఒకే ధరకు పాడుకుంటే మొదట పాడినవారికే సరుకును అప్పగిస్తారు.

కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్ల విముఖతఈ మార్కెట్‌ విధానంపై కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్లు విముఖత చూపుతున్నారు. ఆన్‌లైన్‌ విధానం మూలంగా ట్రేడర్లలో పోటీ నెలకొని రైతుకు గిట్టుబాట ధర లభించనుంది. ఆన్‌లైన్‌ విధానంలో కమీషన్‌ ఏజెంట్లకు కమీషన్‌ తగ్గి, తమకు అనుకూలమైన వ్యాపారులకు సరుకును అమ్మడానికి వీలుండదు. అదే విధంగా ట్రేడర్స్‌ రింగై మార్కెట్‌కు వచ్చిన సరుకు ధర తగ్గించి రైతులను మోసం చేయడానికి వీలుండదు. అదే విధంగా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసే సరుకు మొత్తానికి కమీషన్‌ చెల్లించాల్సిందే. హిందూపురం మార్కెట్‌లో భారీగా చింతపండు, మిరప విక్రయాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి 8శాతం కమీషన్‌ తీసుకుని మార్కెట్‌కు మాత్రం ఒక శాతమే చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ మార్కెంటింగ్‌ విధానంతో ఇలాంటి అక్రమాలకు చెక్‌ పడనుంది. హిందూపురం మార్కెట్‌ యార్డుకు ఆన్‌లైన్‌ విధానం మూలంగా ఎక్కువ మంది రైతులు, వ్యాపారులు చింతపండు, మిర్చి తీసుకుని వస్తూంటారు. అయితే ఈ-మార్కెటింగ్‌ వల్ల మార్కెట్‌ యార్డుకు వారు రాకుండా పోతారని ట్రేడర్స్‌, కమీషన్‌ ఏజెట్లు వాదిస్తున్నారు. అయితే ఈ మార్కెట్‌ విధానం అమలుతో రైతులతోపాటు యార్డుకు కూడా ఆదాయం భారీగానే వచ్చే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌ యార్డుల్లో ఆన్‌లైన్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరంఎంతైనా ఉంది. ఆ దిశగా పాలకులు, సంబంధిత ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో ముందుకువెళ్లాల్సి ఉంది.
×
×
  • Create New...