Jump to content

Recommended Posts

Posted

                                                                               12049427_1145027458858381_81560320957082



కథ:

హీరో కార్తీక్ (రామ్ చరణ్) కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చే రకం. కార్తీక్ తండ్రి రామచంద్రరావు (రావు రమేష్)కి కొడుకుని కలెక్టరు చేయాలని ఆశ. అది కుదరక కూతురు (కృతి కర్బందా)ని కలెక్టరు చదువు చదివిస్తాడు. అయితే ఫ్రెండు చెల్లెలిని రక్షించడం కోసం పోలీసు డ్రెస్సులో వెళ్లిన కార్తీక్ ని నిజమైన పోలీసనుకుని అతనికి దగ్గరవుతుంది రియా (రకుల్ ప్రీత్ సింగ్). రియా  అత్యుత్సాహం వల్ల కార్తీక్ విలన్ల ఆస్తులు ధ్వంసం చేయాల్సి వస్తుంది. దీంతో వారికి అతను టార్గెట్ అవుతాడు. అయితే అనుకోకుండా వాళ్లు తన అక్కకు కూడా హాని తలపెడతారు. దీంతో అటు అక్క కోసం ప్రియురాలి కోసం విలన్ లను ఎలా ఎదుర్కొంటాడన్నది మిగతా కథ.


కథనం విశ్లేషణ:


ఏ దర్శకుడికైనా తనకంటూ ఒక స్టైల్  ఉంటుంది, బ్యాక్ డ్రాప్ లు మార్చినా ,కధలు మారినా హీరో క్యారెక్టర్ లో అయినా, కధనం లో అయినా ఆ స్టైల్ కనిపిస్తుంది. అలాగే మూలకధ ఏదైనా హీరో తన లక్ష్యం కోసం కమెడియన్స్ తో పాటు విలన్లని బకరా చేసి తను అనుకున్నది సాదించడం శ్రీను వైట్ల ఫార్ములా. ఐతే ఆ ఫార్ములాని శ్రీను వైట్ల ఏ కాకుండా మిగతా దర్శకులు కూడా బాగా వాడుకున్నారు, ఆగడు లాంటి రిజల్ట్ తరువాత కూడా ఇంకా అదే ఫార్ములాని శ్రీను వైట్ల  నమ్ముకోవడం విడ్డూరం. ఫస్టాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు ,చరణ్ - రావు రమేష్ /కృతి కర్బందా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ,అలాగే చరణ్ - రకుల్ లవ్ ట్రాక్ బాగానే ఎంటర్టైన్ చేయగలిగాయి.కృతి సమస్యల్లో చిక్కుకోవడం ,విలన్స్ తో చరణ్ తలపడడం నుంచి ఇంటర్వెల్ వద్ద ట్విస్ట్ తో ముగుస్తుంది ఫస్టాఫ్. సెకండాఫ్ లో హీరో  మెయిన్ విలన్ ని ఎదురుకోవడానికి ముందుగానే చెప్పుకున్నట్టు తన రిపీట్ కామెడీ ఫార్ములానే వాడినా కామెడీ అస్సలు వర్కవుట్ అవలేదు.హీరో బ్రహ్మి కి ఈసారి చెప్పి తన అవసరం కోసం వాడుకుంటాడు అంతే తేడా,ఐతే ఆ ఎపిసోడ్ పూర్తిగా మిస్ ఫైర్ అయింది,బోనస్ గా అలీ "పీకే' స్పూఫ్ కూడా ఫెయిల్ అయింది.రెగ్యులర్ గా శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే హిలేరియస్ కామెడీ ఎక్కడా కనపడదు.విలన్ నిజం తెలుసుకున్న తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది.టేకాఫ్ లో బాగుంది అనిపించిన హీరో- ఫాదర్ కాన్ఫ్లిక్ట్ ని వదిలేసి ఎక్కడో చివర్లో చిన్న డ్రమాటిక్ సీన్ తో ఎండ్ చేయడం అంతగా బాగోలేదు.పోర్ట్ ఫైట్ దగ్గరే అయిపొయింది అనిపించిన సినిమా ని అనవసరంగా సాగదీసి చేయించిన మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పిరియన్స్ ఒక్కటే సెకండాఫ్ లో హైలైట్. అలా చూసుకుంటే సెకండాఫ్ లో అసలు కన్నా ఈ కొసరే  బాగుంది అని చెప్పాలి.


నటీనటులు :

కార్తిక్ అలియాస్ బ్రూస్ లీ గా రామ్ చరణ్ ఆకట్టుకున్నాడు,ముఖ్యంగా రావు రమేష్ తో ఉన్న అన్ని
సీన్స్ లో ,ఇంటర్వెల్  ఎంగేజ్మెంట్ కి ముందు సన్నివేశం లో అతని నటన చాలా  బాగుంది. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కి అంతగా స్కోప్ లేకున్నా తన గ్లామర్ తో ఆకట్టుకుంది.రావు రమేష్ ,నదియా లు తమ పాత్రలకు న్యాయం చేసారు. సంపత్ రాజ్ ఒకే.అరుణ్ విజయ్ కి ఏమంత స్కోప్ లేదు.జయప్రకాశ్ రెడ్డి బాగానే నవ్వించాడు.బ్రహ్మాజీ,సప్తగిరి తదితరులు ఒకే.

 

సాంకేతిక వర్గం :


డైలాగ్స్ పరవాలేదు ,మనోజ్ పరమహంస కెమెరా వర్క్ చాలా  బాగుంది, ఎడిటింగ్ బాగోలేదు.తమన్ సంగీతం లో పాటలు పరవాలేదు, కొన్ని చోట్ల లౌడ్ అయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.యాక్షన్ ఎపిసోడ్స్ పరవాలేదు.


రేటింగ్ : 5/10

Posted

Asalu pedha pedha heros sons kooda alanti stories ki yes ela chebtaru, asalu ee movie lo story eh ledu, and movie title also in appropriate, dance baga chesadu, fights kooda ok.

P.S. Nenu comedian balayya fan ni kadu, and chiru fan ni kadu, a common person ga chebtunna.

×
×
  • Create New...