Jump to content

3 Stars At One Place,,,,,


Recommended Posts

Posted

gas andhra article.: njoi

 

బ్రూస్ లీ సినిమా మీద అక్కర్లేనంత హడావుడి జరుగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, తన అన్న చిరంజీవి ఇంటికి ఓదార్పు యాత్రకు బయల్దేరారు. నిన్ననేమో అబ్బాయ్ వెళ్లి బాబాయ్ ను కలిసారు. ఇవన్నీ దేనికి సంకేతాలు..సినిమా ఫ్లాప్ అయింది..లేపాలి అన్నదానికేగా. ముందు మీకే సినిమా విజయం మీద కాన్ఫిడెన్స్ లేకుంటే ఎలా?

ఎంత దారుణం అంటే..

బ్రూస్ లీ స్పెషల్ షోలు ఐమాక్స్ లో ఇంకా పూర్తి కాలేదు. అఖిల్ వాయిదా అన్న వార్త వచ్చింది. బ్రూస్ లీ షో పూర్తయింది. ఆ మరు నిమషంలో క్రిష్ తన కంచె సినిమా డేట్ ను ట్విట్టర్ లో ప్రకటించేసాడు. ఏ ధైర్యంతో ప్రకటించాడు..వారం గ్యాప్ లో మరో మెగా ఫ్యామిలీ హీరో సినిమాను? అది కూడా నాగబాబు కుమారుడి సినిమాను, వాళ్లను సంప్రదించి ప్రకటించాడా? సంప్రదించి వుంటే నాగబాబు తన అన్న కొడుకు చరణ్ సినిమా మీద, తన కొడుకు సినిమా వేయడానికి ఓకె అన్నాడా? పోటీకి రావాలనా? లేక, చరణ్ సినిమా ఫ్లాప్ అని డిసైడ్ అయ్యా? ఇదంతా స్పెషల్ షో జరిగిన కొద్ది నిమషాల్లోనే.

అంటే మీకు మీరే, ఫ్యామిలీలోనే మీ సినిమా ఫ్లాప్ అని డిసైడ్ అయినట్లు సందేశం వెళ్లదా ఫ్యాన్స్ లోకి, జనంలోకి?

సరే అది అయింది. వెంటనే చరణ్ బాబాయ్ దగ్గరకు వెళ్లారు. రెండు రోజు ముందే కదా వెళ్లింది. ఇప్పుడు రివర్స్ లో పవర్ స్టార్ వచ్చి అభినందించి వుంటే, సినిమా హిట్ అన్న ఫీల్ వచ్చేది.  పవన్ వెళ్లి అభినందించి వచ్చి వుంటే సందేశం వేరుగా వుండేది. కానీ అలా చేయలేదు. దీనివల్ల పవన్ ఫ్యాన్స్ ప్రాపకం కోసం చరణ్ పాకులాడుతున్నాడన్న ఫీల్ వచ్చింది.

పోనీ అక్కడితో ఆగారా? ఇప్పుడ పవర్ స్టార్ అన్న ఇంటికి ఈ సినిమా గురించే వెళ్తున్నారు అంటూ నోట్ వచ్చేసింది. జనాలు ఓదార్పు యాత్రా అంటూ జోకులు వేస్తున్నారు. మరోపక్క మరి నాగబాబు ఎక్కడ? అల్లు అరవింద్ ఎక్కడ? అంటూ ఆరాలు తీస్తున్నారు. 

మెగా ఫ్యామిలీ ఒక్క సినిమా గురించి ఇలాహైరానా పడడం తప్పుడు సంకేతాలను, ఫ్యామిలీలో చీలికలు వచ్చాయన్న సంకేతాలను తనకు తెలియకుండానే ప్రజల్లోకి పంపుతోంది. సినిమా ముందు అల్లు అర్జున్ రుద్రమదేవి వ్యవహారం, షష్టిపూర్తిలో నాగబాబు వ్యవహారం, అడియో ఫంక్షన్ లో పవర్ అభిమానులను పక్కన పెట్టిన వైనం ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్ పాయింట్లుగా మారుతున్నాయి. 

సినిమాను పవర్ స్టార్ అభిమానులు చూడకపోతే, అది ఫ్లాప్ అయిపోతుందా?  మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు అంత వీక్ నా? వాళ్ల అభిమానులు తప్ప, వేరే జనాలు చూడరా? అభిమానులు చూడకుంటే ఫ్లాప్ అనుకుంటే ఎలా? సినిమాలో దమ్ము వుండాలి..అప్పుడు అభిమానులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూస్తారు. కేవలం అభిమానుల బలం మీదే తమ సినిమాలు ఆడుతున్నాయని ఇప్పుడు ఈ వ్వవహారం ద్వారా చాటుతున్నట్లుంది. 

ఏమైనా బ్రూస్ లీ మీద మెగా ఫ్యామిలీ ఇంత హడావుడి చేయడం తప్పే అవుతోంది. సినిమాను దాని మానానికి దాన్ని వదిలేసి, కాస్త పబ్లిసిటీ హడావుడి చేస్తే సరిపోయేది. ఆడితే ఆడుతుంది..లేదంటే లేదు. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల అక్కర్లేని సంగతులు అన్నీ డిస్కషన్లోకి వస్తున్నాయి.

Posted

Dress testhey power pothundi ani jc garu chepparu

inka nayam otti dress gurinchey chepparu JC gaaru...snanam chesthey power clean ayyipothundi antey tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

×
×
  • Create New...