Jump to content

2.5 lakhs NANOS from gujrat


Recommended Posts

Posted

అహ్మాదాబాద్‌: టాటా మోటార్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నానో కార్ల తయారీ ఫ్యాక్టరీని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం సనంద్‌లో ప్రారంభించారు. నానో ప్లాంట్‌ నుంచి ఏడాదికి 2.5 లక్షల కార్లు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా టాటా గ్రూప్‌ సంస్ధల అధినేత రతన్‌టాటా నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. 50 ఏళ్లలో టాటా గ్రూప్‌ సంస్ధ గుజరాత్‌లో అతి పెద్ద పెట్టుబడి పెట్టడం ఇదే ప్రథమమని రతన్‌ టాటా అన్నారు. నానో కార్ల తయారీ ఫ్యాక్టరీ సింగూర్‌ నుంచి వెదొలగటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. టాటా మోటార్స్‌ భూ వివాదం కారణంగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని సింగూరు నుంచి తరలించారు. నానో ప్రాజెక్టు కోసం గుజరాత్‌ ప్రభుత్వం 1000 ఎకరాల భూమి కేటాయించింది. ఈ రోజు నుంచే కార్ల డెలివరీ చేస్తామని టాటాలు ప్రకటించారు.

×
×
  • Create New...