Jump to content

Kaki Tho Chat Chestadu

Recommended Posts

Posted
Ragpicker-Deepu-can-summon-crows.jpg
ఈ ఫోటోలో బాలుడిని చూశారా..?. లక్నోకు 255 కిలోమీటర్ల దూరంలోని ఓ చోట నివసించే ఈ బాలుడి పేరు దీపూ. వయసు తొమ్మిదేళ్ళు. చిన్న వయసులో శాస్త్రజ్ఞులు చేయలేని పనిని దీపూ చేస్తున్నాడు. అదే..కాకులతో స్నేహం చేయడం! పంచతంత్రం కథల్లో పాత్రలా కాకులతో వాటి భాషలోనే సంభాషించడం దీపూ ప్రత్యేకత. ఏకలవ్యుడిగా మారి కాకుల భాష నేర్చుకున్నాడు. చదువుకోవాల్సిన వయసులో సంచీ పట్టుకుని చెత్త ఏరుకునే ఈ బాలుడి జీవితం ఆద్యంతం ఆసక్తికరం.
 
దీపూ తండ్రి 2012లో చనిపోయాడు. కుటుంబ పోషణ భారం దీపూపై పడింది. నగరంలో చెత్త ఏరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు దీపూ. ఓ రోజు చెత్త ఏరుకుంటుండగా కొన్ని కాకులు అక్కడ పడిన అన్నం మెతుకులు తినడం గమనించాడు. వాటి కదలికలను, సంభాషణను కొన్ని నెలలపాటు తీక్షణంగా పరిశీలించాడు. కాకులతో గడిపేవాడు. వాటి భాష నేర్చుకున్నాడు. దీపూ రోజూ కాకులతో మాట్లాడుతూ వాటిని తన స్నేహితులుగా మార్చుకున్నాడు. ఓసారి కొందరు చెత్త ఏరుకునే వాళ్లు తమ పరిధిలోకి వచ్చాడనే కారణంతో దీపూపై దాడికి యత్నించారు. సహాయం అర్ధిస్తూ తన స్నేహితులను వాటి భాషలోనే పిలిచాడు. దీంతో వందలాది కాకులు వచ్చి వారిపై దాడి చేసి తమ స్నేహితుడు దీపూని రక్షించుకున్నాయి. పితృకర్మలు చేయడానికి వచ్చేవారు కాకులను తెచ్చిపెట్టమని దీపూకి కబురు పంపుతారు. అతడక్కడికి వెళ్ళి, పితృకర్మలు పూర్తయ్యాక పిండాలను తినడానికి తన స్నేహితులను పిలుస్తాడు. ఇందుకుగానూ అతడేమీ డబ్బులు తీసుకోడు. ‘తన స్నేహితులకు అన్నం పెడుతున్నారు. అది చాలు నాకు’ అంటాడు దీపు.

Posted

Good job deepu

Afdb dkc tho chat chesina npr tharuvatha nuvve great

Veedu evaro TomBhayya laga vunnadu
×
×
  • Create New...