Jump to content

Recommended Posts

Posted

12196060_1105918526106070_29566484541656

 

 

 

ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.
ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు పరమఅసహ్యం.వీరి ప్రక్కన కూర్చుండి ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.
కొంత మంది ప్రయాణికులను సీటు ఎక్చేంజ్ కోసం మర్యాదగా అడిగి చూసింది.కాని, రూపం అందంగా ఉన్నా మనసు అందవిహీనమైన ఆమె ప్రక్కన కూర్చుని ప్రయాణించడానికి ఎవరూ ఓప్పుకోలేదు.
ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.
కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.ఇక మీరొక్కరే ఆనందంగా ప్రయాణం చేయండి!"
ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....
ఎయిర్ హోస్టెస్ సీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక హృదయం లేని వ్యక్తి ప్రక్క, సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుండి ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కార్గిల్ యుద్ధంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
అని ఆ వ్యక్తి అందమైన స్త్రీ వైపు తిరిగి
"అమ్మా ! నీ అందమైన మొఖానికి కొద్దిగా అందమైన హృదయం అనే పౌడర్ ను కూడా అద్దుకో తల్లి!" అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది...........

Posted

Is this real, munde eeapudo FB lo kuda chusa ee story 

Posted

Is this real, munde eeapudo FB lo kuda chusa ee story 

 

 

real ayyiundachu but konchem story kosam masala add chesinattu anipisthondi

Posted

please single line lo chepandi or english lo post cheyandi please...

Posted

Mostly fake..but cheppalem


Fake. As is ga us soldier gurinchi chadivanu chala rojula poorvam
Posted

idi vere story anukunta....manollu indianize chesaru....anyway, gp

Posted

please single line lo chepandi or english lo post cheyandi please...

 

 

you no telugu read brahmi55.gif

Posted

idi vere story anukunta....manollu indianize chesaru....anyway, gp


Copy kottaru, kaneesam kincham anna originality pettandra
Posted

you no telugu read brahmi55.gif

i read telugu but time padings.. so nduku risk ani asking, tell no myan gallery_8818_6_385253.gif?1367349476

Posted

fake story.. Black and white meedha same story chadivanu.. White lady disagree to sit beside black guy.. and remaining story antha same.

Posted

fake story.. Black and white meedha same story chadivanu.. White lady disagree to sit beside black guy.. and remaining story antha same.

gallery_8818_6_385253.gif?1367349476

Posted

fake story.. Black and white meedha same story chadivanu.. White lady disagree to sit beside black guy.. and remaining story antha same.

 

 

+1 neeku memory power bagundi raja gallery_8818_6_385253.gif?1367349476

Posted

fake story.. Black and white meedha same story chadivanu.. White lady disagree to sit beside black guy.. and remaining story antha same.

yep nenu kuda

Posted

fake. copied and added telugu style story

https://www.youtube.com/watch?v=cbszEPKtX18

×
×
  • Create New...