Jump to content

Recommended Posts

Posted

[size=14pt][b]టెక్సాస్ డాక్టర్ గారింట్లో మేము 3D టివి చూసిన విధం బెట్టిదన...[/b][/size]

[center]
[img]http://3.bp.blogspot.com/_H8qtILKMzx0/TAfvTTw4EqI/AAAAAAAAAy8/rbux2CUKRPU/s400/3d_tv.jpg[/img][/center]

[size=14pt][b]డాక్టర్ గారు 3డి టివి యొక్క ప్రత్యేకతలను ఇంకా వివరిస్తూ వెళ్ళారు. నేను వారిద్దరితో  మొహమాటానికి తానా అంటే తందాన అనసాగాను కానీ కొద్ది సేపటికి నాకు ఓపిక నశించింది. కొద్దిగా బిక్క మొఖం వేసి "మీరు ఇంత బాగా చెబుతున్నారు కానీ నాకు 2D కంటే ఘోరంగా కనపడుతోంది" అని నసిగాను

"నిజ్జంగా!" అన్నారు బోలెడంత ఆశ్చర్యంతో. అపుడు వెలిగింది ఆయనకి. అద్దాలు పెట్టుకోగానే సరిపోదు. వాటిమీద వున్న బటన్ ఆన్ చేయాలి అని చెప్పారు. "ఆ విషయం మీకు తెలుసు కానీ మాకు తెలియదు కదా" అని ఆ బటన్ ఆన్ చేసుకున్నాం. అప్పుడు అద్భుతంగా ఆ టివిలోని దృశ్యాలు లో కనిపించసాగాయి. రాజు గారి బట్టల కథలో లాగానే 3D కనిపించడం లేదంటే మీరంతా ఏమనుకుంటారో అని నేను నోరు మెదపలేదు అని రెడ్డి గారు తాపీగా సెలవిచ్చారు! 

3D టివిని కాసేపు చక్కగా ఆనందించాక నాకో సందేహం వచ్చింది. 2D సినిమాలు ఇందులో చూస్తే 3డిలో కనపడుతాయా అని అడిగాను. కనపడుతాయి కానీ నిజమయిన 3D సినిమాలంత గొప్పగా అనిపించవు అని చెప్పారు. అయితే ఇందులో సింహా సినిమా చూపిస్తారా - బాల్కి (ఈ పేరు ఎవరో బ్లాగర్ వాడారు - నచ్చింది) తొడగొట్టడం 3Dలో చూడాలని వుంది. అలాగే నమితనూ...అని నసిగాను. అలాగే చూద్దాం అన్నారు కానీ అంతలోనే ఇంకా ప్రయాణానికి సిద్ధం కాలేదా అని నా హై కమాండ్ గాట్ఠిగా దూరం నుండి అరిచింది. ఇప్పుడు వద్దులెండి డాక్టర్ గారూ, నేను తయారు కాకుండా సింహా సినిమా 3Dలో చూస్తూపోతే బాల్కి ఏమోగానీ మా ఆవిడ నాకు 3Dలో కనపడుతుంది అన్నాను. కాదు మీ ఆవిడ 4Dలో మీ మీదకు ఏమయినా విసిరేస్తుందేమో  అని హెచ్చరించారు డాక్టర్ గారు. 

బాల్కి వీరాభిమాని అయిన మా మిత్రుడు సాగర్  ఈ సినిమాను 3Dలో చూసివుంటే ఆ ఆనందంతో ఒహటే తొడలు కొట్టుకొని వుండేవాడు కదా, అతన్నిక్కడికి తీసుకురావడం మరచిపోయాం అని అనుకున్నాం.[/b][/size] 

[url=http://sarath-kaalam.blogspot.com/2010/06/3d.html]http://sarath-kaalam.blogspot.com/2010/06/3d.html[/url]

×
×
  • Create New...