Jump to content

2 Suicide Attempts For Akhil Tickets


Recommended Posts

Posted

అఖిల్‌ టిక్కెట్‌ కోసం ఇద్దరి ఆత్మహత్యాయత్నం !

1447157465-172.jpg


కొత్త సినిమా.. అందులోను ఓ స్టార్‌ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు..థియేటర్లలో లో క్లాస్‌ నుంచి హై క్లాస్‌ వరకూ టిక్కెట్‌ ధరలు ఒకేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో థియేటర్ల యజమానులే బ్లాక్‌ టికెట్లను ప్రోత్సహిస్తుంటారు. లేకపోతే టిక్కెట్‌ ధరలను రెండింతలు చేసి సొమ్ముచేసుకుంటుంటారు. ఈ విషయంలో స్ట్రిట్‌గా ఉండాల్సిన పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తమకేం పట్టనట్టు వ్యవహరించడంతో బ్లాక్‌ టిక్కెట్ల జోరును అడ్డుకునే వారే లేకపోతున్నారు. అయితే ఈ బ్లాక్‌ టిక్కెట్ల విషయంలో చాలాసార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.

తాజాగా అఖిల్‌ సినిమా టిక్కెట్ల కోసం అలాంటి సంఘటనే కర్నూలు లోని ఆనం థియేటర్‌ వద్ద చోటుచేసుకుంది. నాగార్జున తనయుడు అఖిల్‌ నటించిన డెబ్యూ మూవీ 'అఖిల్‌' దీపావళి కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ను కొన్ని థియేటర్లలో నేటి నుంచి విక్రయిస్తున్నారు. అయితే వీటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కర్నూల్‌లో నాగార్జున అభిమానులు ఆందోళన చేపట్టారు. హాల్‌ బయట బీభత్సం సృష్టించారు. ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వారిని అరెస్టుచేశారు. అనంతరం వారిద్దరిని పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు. ఏదేమైనా అభిమానులు తమ అభిమాన హీరో సినిమా తొలి రోజే చూడాలని వస్తే థియేటర్ల యజమానులు వారిని నిలువునా దోచుకుంటున్నారు.

Posted

Marketing ehe, veedi cinema ki nijam gane nippu posikunte, vallu batiki kooda waste

Posted

Khandisthunna..50 dhi 3,00 pettina Akhil movie chustham Anna maa weakness ni dhochukundhamanukuntunna Ee theatres yaajamanya vaikari nashinchali

Posted

Marketing ehe, veedi cinema ki nijam gane nippu posikunte, vallu batiki kooda waste


Diehard fans antaru vallani ... Akhilism
Posted

Diehard fans antaru vallani ... Akhilism


Diehard kadu die avalsina batch
Posted

benefit show appude ayipoyinda :o

Posted

Khandisthunna..50 dhi 3,00 pettina Akhil movie chustham Anna maa weakness ni dhochukundhamanukuntunna Ee theatres yaajamanya vaikari nashinchali

#/{-  #/{-

×
×
  • Create New...