Jump to content

Recommended Posts

Posted

ఎ ఎమ్ రత్నం...కాస్త టేస్ట్ వున్న నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు తీసాడు. ఓ స్థాయికి చేరుకున్నాడు. కానీ అనూహ్యంగా పుత్రోత్సాహం ఆయనను కష్టాల్లోకి నెట్టింది. పిల్లలు ఇద్దరినీ సినిమా ఫీల్డ్ లోనే పైకి తేవాలన్న తపన ఆయన ను నష్టాల్లో ముంచింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎ ఎమ్ రత్నం హవా మొదలైంది. అజిత్ పుణ్యమా అని బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లు అందించగలిగాడు.

ఆరంభం పెద్దగా విజయం సాధించకపోయినా, ఎన్నయ్ ఆరిందాళ్, వేందళం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసాయి. రత్నం కష్టాలు, నిబద్దత తెలిసి, మద్దతుగా వుండేందుకే వరుస అవకాశాలు ఇస్తున్నాడట అజిత్. నిజానికి అజిత్ సినిమా చేస్తానంటే, తమిళనాట ఏ నిర్మాత ఎగిరి గంతేయడు. కానీ అజిత్ ఓ కాజ్ తో రత్నం సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో టాక్ ఏమిటంటే, రాబోయే మరో రెండు సినిమాలు కూడా అజిత్ ఎ ఎమ్ రత్నానికే చేస్తాడని. ఆ దిశగా డిస్కషన్లు జరుగుతున్నాయని. అదే కనుక నిజమైతే, రత్నానికి అజిత్ నిజంగా దేవుడే. బంగారు బాతుగుడ్డే.

ఇదిలా వుంటే ఇదంతా ఎ ఎమ్ రత్నం మంచితనం కూడా అని, అతని మంచితనం, కష్టాలు రెండూ చూసి, తమిళనాట సినిమా నేపథ్యం నుంచి వచ్చిన ఓ టాప్, పవర్ ఫుల్ పొలిటీషియన్ కూడా రత్నం కు ఆర్థికంగా మద్దతు ఇచ్చారని కూడా టాక్ వుంది. మొత్తానికి ఇదే మన టాలీవుడ్ లో అయితే రత్నం పేరు మన సోకాల్డ్ అనేకానేక బడా నిర్మాతల మాదరిగా మాయం అయిపోయి వుండేది. నాగార్జున కామాక్షి మూవీస్ ఒక్కసారి గుర్తు చేసుకోండి..సుమంత్ రాజుగార్ని, అశ్వనీదత్ గార్ని కూడా. తమిళ నాట కాబట్టి ఎ ఎమ్ రత్నం మళ్లీ నిలబడ్డాడు.

Posted

yennai arindal hit aa? mind burning sir mind burning

Posted

AM Rathnam anni blockbusters icchi kooda sankanakipoyadu ante valla kodukulu entha item raja lo artham autondi...

Posted

AM Rathnam anni blockbusters icchi kooda sankanakipoyadu ante valla kodukulu entha item raja lo artham autondi...

Shankar tho 6 films teesadu

×
×
  • Create New...