Hitman Posted November 16, 2015 Report Posted November 16, 2015 ఎన్నికలకు ఇదా కారణమని నిలదీయండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఆ ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని నిల దీస్తూ కేసీఆర్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే గర్వపడే వాళ్లమని, ఆ కారణంతో ఈ ఉప ఎన్నిక వచ్చి ఉంటే కాలర్ ఎగిరేసే వాళ్లమని టీఆర్‌ఎస్ నేతలకు చెప్పండి. కానీ కేసీఆర్ మోజు తీర్చుకోవడం కోసం ఈ ఎన్నిక వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని చెప్పండి. వరంగల్‌లో ఉప ఎన్నిక వచ్చినా ఫర్వాలేదుగానీ.. తాను కోరుకున్న అభ్యర్థి మంత్రిమండలిలో ఉండాలని కేసీఆర్ మోజు పడ్డారు. వరంగల్ జిల్లాలో తన పార్టీలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా.. వాళ్లను కాదని, ఆయన మోజుపడిన వ్యక్తి ఎంపీ అయినప్పటికీ ఆయనతో రాజీనామా చేయిం చారు. టీఆర్‌ఎస్ వాళ్లెవరైనా మిమ్మల్ని ఓటడగడానికి వస్తే ఉప ఎన్నికలకు ఇదా కారణం అని గట్టిగా నిలదీయండి.
Recommended Posts