Jump to content

Ramuism Megafamily


Recommended Posts

Posted

[media]http://www.youtube.com/watch?v=UjTtAgjKsQ4[/media]

 

 

[media]http://www.youtube.com/watch?v=5_EXR6WIQ6w[/media]

 

 

[media]http://www.youtube.com/watch?v=OWUveJPT8OA[/media]

Posted

ఇడియట్‌ సినిమాలో ''నాకిక్కడ ఏమనిపిస్తే అది చేస్తే.. ఇక్కడేదనిపిస్తే అది మాట్లాడతా'' అంటాడు రవితేజ. తన గురువు రామ్‌ గోపాల్‌ వర్మను దృష్టిలో పెట్టుకునే పూరి జగన్నాథ్‌ ఈ డైలాగ్‌ రాశాడో ఏమిటో కానీ.. వర్మ ఈ టైపే అని అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో తెలియదు. ఎవరిపై ఏమని కామెంట్‌ చేస్తాడో తెలియదు. ముఖ్యంగా ఈ మధ్య తెలుగు సినిమా హీరోలు, దర్శకుల మీద ఆయన సెన్సేషనల్‌ కామెంట్లు చేస్తున్నారు. అందులోనూ మెగా ఫ్యామిలీ హీరోలపై ఆయన ఫోకస్‌ చాలా ఉంటోంది. తన ట్వీట్ల ద్వారా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల గురించి ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌ చేస్తుంటారాయన. చిరు 150వ సినిమా గురించి, పవన్‌ రాజకీయాల గురించి ఈ మధ్య సెన్సేషనల్‌ కామెంట్లెన్నో చేశాడు వర్మ.

ఇప్పుడు ట్వీట్లతో సరిపెట్టకుండా నేరుగా టీవీలోనే మెగా ఫ్యామిలీ మీద స్పెషల్‌ షో ఒకటి చేశాడు వర్మ. రామూయిజం పేరుతో వర్మ వివిధం అంశాలపై మాట్లాడే టీవీ షో ఒకటి ఉందన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సాక్షి టీవీలో వచ్చిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం టాలీవుడ్‌ ఛానెల్లో ప్రసారమవుతోంది. ఈ ఆదివారం ఇందులో టాపిక్‌ 'మెగా ఫ్యామిలీ'. చిరు, పవన్‌ ఇతర మెగా హీరోల గురించి మాట్లాడబోతున్నాడు వర్మ. ప్రధానంగా ఫోకస్‌ పవన్‌-రాజకీయల గురించే. దీని ప్రోమోలే చాలా సెన్సేషనల్‌ గా ఉన్నాయి. పవన్‌ కు రాజకీయాలు తెలుసా అని అడిగేస్తున్నాడు వర్మ అందులో. ''సింహం గర్జించాలి కానీ.. ఎక్స్‌ప్లైనేషన్స్‌ ఇవ్వకూడదు'' అన్న డైలాగ్‌ కూడా పవన్‌ను ఉద్దేశించిందే. ఇంకా వర్మ ఏమేమన్నాడో తెలియాలంటే ఈ ఆదివారం 11 గంటలకు ఆ షో చూడాల్సిందే.

Posted

Veedini backend lo Mohan Babu nadipistunnadu

×
×
  • Create New...