andhrabullet Posted November 20, 2015 Report Posted November 20, 2015 రైతుబజార్లో కూరగాయలు కొందా మని వెళితే నలుగురు అమ్మాయిలు చూడీదార్స్లో కనిపించారు. వాళ్ళను చూడగానే రెండు విషయాల్లో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదటిది అమ్మాయిలు రైతుబజార్‌కు వచ్చి కూరగాయలు కొనడం అయితే, మరొకటి రాజకీయాలు మాట్లాడుతుండటం. ఎందుకో నాకు వాళ్లపట్ల చాలా ఆసక్తిగా అనిపించింది. వాళ్లతో పాటే నడుస్తూ కూరగాయలు చూస్తున్నా. నా ధ్యాస కూరగాయల మీదకన్నా వాళ్ల సంభాషణ మీదే ఉంది. ''ఏమే ప్రియా! మొన్న మీ పవన్ పంచకట్టుతో వచ్చి సిఎంని కలిశాడే!'' అంది ఓ బక్కపల్చటి అమ్మాయి తన స్కార్ఫ్‌ను సరిజేసుకుంటూ. '' అవునే పవన్ పంచకట్టులో కూడా భలే బాగున్నాడు కదే! ఏమైనా పవన్ సినిమాలో అయినా, బయటైనా హీరోనేనే!'' ఏమైనా మా గబ్బర్‌సింగ్ ఎప్పుడూ న్యూట్రెండ్కు తెరలేపుతాడు! అంటూ ప్రియా అనే అమ్మాయే అనుకుంటా సమాధానమిస్తూ కించిత్తు తమ హీరో చాలా గ్రేట్ అన్న హావభావాలు ఇస్తూ చెప్పింది. ''మా మహేష్ 'శ్రీమంతుడు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు కదా! తనూ అలా పేరు తెచ్చుకోవడానికి మరో సినిమాలో నటించే టైమ్ లేదు కదా! అందుకే ఇలా పంచెతో 'పంచ్' ఇస్తున్నాడులే. లేకపోతే పాపం 'పవర్‌స్టార్' ఇమేజ్ తగ్గిపోదూ?'' అంది మరో అమ్మాయి. ఆ అమ్మాయి ముఖంలో ముక్కే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ''ఏరు బారూ! (నిక్‌నేమ్ అనుకుంటా) మా పవన్‌కు అంత కర్మేం పట్టలేదు. అంత అవసరమూ లేదు. మా వాడి ముందు మీ మహేష్ ఎంతే? మీ వాడు చాలా సాఫ్ట్! మా వాడు టైగర్...! హీరో అంటే అలా ఉండాలి!'' అంది కొంచెం ఆగ్రహంగా ప్రియ!. ''అబ్బబ్బా! మీ హీరోల గోల ఆపండే బాబు. మీలాంటి తిక్క మొఖాలు ఉండబట్టే వాళ్లలా గారడీలు చేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అసలు పవన్ ఎందుకొచ్చాడో? ఆ పంచకట్టు ఎందుకో? కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే మంచిది. మనకు ఓటు హక్కు వచ్చిందని కార్డులు తెచ్చుకోవడం కాదు. ఆలోచించడం మనలాంటి చదువుకున్న వాళ్ల బాధ్యత కూడా!'' అంది ఓ అమ్మాయి. ''అమ్మా తల్లీ ప్రత్యూషా! నీ క్లాస్ ఇక్కడ కూడానా? నీకున్నంత రాజకీయబుర్ర మాకు లేదమ్మా!'' అంది మొదటి అమ్మాయి కొంచెం నాటకీయంగా. ''అదేం కాదులే ప్రత్యూష. ఈసారి నీకు చెప్పే ఛాన్స్ ఇవ్వనులే! నాకు ఈ మధ్య మా పవన్‌స్టార్ వల్లే కాస్త రాజకీయాలు తెలుస్తున్నాయి. మా పవన్ పంచకట్టులో రావడానికి 'జనసేన పార్టీ' వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని కన్వే చేయడానికే 'నేను జనం మనిషినని' అని చెప్తూ ఇలా సింపుల్‌గా వచ్చాడు. సిఎంను కలవడానికి పంచకట్టులో అంత సింపుల్‌గా వచ్చినా, అందరి కళ్లూ మా పవన్ మీదే!' అంటూ చాలా గొప్పగా చెప్పింది ప్రియ. ''అదేం కాదు!'' అంటూ ప్రత్యూష టమాటాల దగ్గర ఆగి ''ఏంటి టమాటాలు ఇంత రేటా?'' అంది ఆశ్చర్యంగా. ''ఇక్కడ నయం, 47 రూపాయలే. మా ఇంటి దగ్గర ఉదయం 100 రూపాయలు అన్నారే? కందిపప్పు, మినపప్పు, చింతపండూ ఇలా అన్నీ రేట్లు పెరిగిపోయాయని ఉదయం ఇంట్లో అంటుంటే విన్నా'' అంది బారుముక్కు అమ్మాయి. ''మనం కళ్లు తిరిగి పడిపోయేలా అన్నింటి ధరలూ పెరిగిపోతున్నా, మనలో మాత్రం చలనం లేదు. ఇలాంటి హీరోల్ని మన ముందు పెట్టి కనికట్టు చేస్తోంది ప్రభుత్వం'' అంది ప్రత్యూష. ''నాకు తెలియక అడుగుతున్నా రేట్లు పెరగడానికి, మావాడు పంచకట్టుకు ఏంటే సంబంధం?'' అంటూ చాలా సీరియస్‌గా నిలేసింది ప్రియ. ''రేట్లు ఒక్కటే కాదు, మొన్న మోడీ వస్తున్నాడొహో అని గొప్ప ప్రచారం చేశారా? ప్యాకేజీనో, హోదానో అనుకుంటే గుప్పిడి మట్టి, చెంబుడు నీళ్లు పోసి పోయాడు. మరోపక్క జోగయ్య, రాగయ్యో.. ఆయన రాసిన దాంట్లో 'రంగా హత్య వెనుక బాబు ఉన్నాడోచ్!' అని రాశాడంట. దాంతో ఆయన కొడుకున్న ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ఆ సామాజిక తరగతిని తిప్పేసుకుంటుందో అని బాబుగారి ఆందోళన. మరోపక్క బాక్సైట్ బాంబు.. ఈ నెగిటివ్ 'పవనా'లన్నీ పాజిటివ్ 'పవనా'లు చేసుకోవాలంటే ఓ కని'కట్టు' కావాలి కదా! అందుకే పవన్‌కల్యాణ్‌ను డబ్బులు పెట్టి మరీ ప్రత్యేక విమానంలో మంత్రి వర్యులతో సాదర స్వాగతం పలికారని టాక్. అందుకే ఇదంతా 'పంచ్'తో చేసిన కని'కట్టు'. చదువుకున్న మనమే ఇంతలా ఇంప్రెస్ అయిపోతుంటే, ఆఫ్ట్రాల్ సామాన్య జనం.. వాళ్లెంత? మనమంతా వెర్రి పప్పల్లా ఉన్నంత కాలం ఇలాంటి కని'కట్టు'లు చేస్తూనే ఉంటారు.'' అంటూ ప్రత్యూష స్ట్రాంగ్ డోస్ ఇచ్చింది. దాంతో మిగిలిన అమ్మాయిలు కొంచెం తేరుకుని, ''వార్నీ ఇదా ఈ పంచ'కట్టు' వెనుక అసలు కథ!' వాళ్లను ఫాలో అవుతున్న నేను ఇక ఆగలేక ''వామ్మో! మీరేదో ర్యాంకులు చదువుల్లో పడి 'కట్టు'కు పోతున్నారనుకున్నా.. ఛ.. ఛ.. కొట్టుకుపోతున్నారని అనుకుంటున్నా. వెరీగుడ్ అమ్మాయిలు.. కీప్ ఇట్ అప్..! ఇంకా మున్ముందు చాలా కని'కట్టు'లు జరగబోతున్నాయి. నలుగురిలో ఒక్కరైనా ఇలా ఆలోచించేవాళ్లుంటే, మిగిలినవాళ్లూ తెలుసుకుంటారు? నా తల్లులే..! నా బంగారాలే!!'' అంటూ వాళ్ళని పొగడకుండా ఉండలేకపోయాను
Nellore Pedda reddy Posted November 20, 2015 Report Posted November 20, 2015 Any scenes in the story ?? Three girls make out in Bangalore raithu bazaar :giggle:
Recommended Posts