Jump to content

Recommended Posts

Posted
 కవిత ఎన్నికల ఖర్చులోనూ భారీ తేడా
    ఆమె లెక్క ప్రకారం ఖర్చు రూ.22 లక్షలు
    ఈసీ లెక్క ప్రకారం రూ.54 లక్షలు
    షాడో అబ్జర్వర్ల నివేదికతో వెలుగులోకి
    కవితకు జిల్లా ఎన్నికల అధికారి నోటీసు
 
                                                 తప్పుడు లెక్కలు తీవ్ర నేరం

ఎన్నికల ఖర్చుకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత తన తండ్రి కంటే రెండు లక్షలు ఎక్కువే ముందున్నారు. కేసీఆర్‌ ఖాతాలో రూ.30 లక్షల లెక్క తేడా ఉంటే.. కవిత ఖాతాలో రూ.32 లక్షలు తేడా తేలింది. విచిత్రం ఏమిటంటే.. పార్టీ ఇచ్చిన సొమ్ములను కేసీఆర్‌ తాను ఈసీకి సమర్పించిన నివేదికలో చూపలేదు. కానీ, కవిత మాత్రం పార్టీ తనకు ఇచ్చిన నిధులను యథాతథంగా చూపారు. అయితే, ఖర్చులోనే ఆమె తకరారు చేశారు. సాక్షాత్తూ జిల్లా ఎన్నికల అధికారి అయిన నిజామాబాద్‌ కలెక్టరే ఆమె ఈసీకి సమర్పించిన లెక్కలను తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్‌ నియమించిన షాడో అబ్జర్వర్ల లెక్కకు, కవిత సమర్పించిన లెక్కకు 32,65,773 రూపాయలు తేడా వచ్చిందని నోటీసు ఇచ్చారు. వాటికి లెక్క చెప్పాలని కూడా ఆదేశించారు.
 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదొకష్ట్రటే సరిపోదు. పెట్టిన ప్రతి పైసాకు కచ్చితమైన లెక్క ఉండాలి. తప్పుడు లెక్కలు చూపడం కూడా తీవ్రమైన నేరమే. ఎన్నికల కమిషన్‌లోని ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందం ఉంటుంది. ఆ బృందం ప్రతి నియోజకవర్గానికి ఒక గణాంక బృందాన్ని షాడో అబ్జర్వర్లుగా నియమిస్తుంది. అభ్యర్థుల వ్యయ లెక్కలను వీరు సొంతంగా నమోదు చేస్తారు. వాటిని ఈసీకి సమర్పిస్తారు. షాడో అబ్జర్వర్లు ఇచ్చిన లెక్కకు, అభ్యర్థుల లెక్కకు సరిపోలాలి. లేకపోతే, ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమ్‌లేశ్‌ యాదవ్‌ విషయంలో ఇదే జరిగింది. 2007లో యూపీలోని బిసౌలి నుంచి ఉమ్‌లేశ్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందరిలాగే ఆమె కూడా ఎన్నికలకు సంబంధించిన లెక్కలను ఈసీకి సమర్పించారు. కానీ, పత్రికల్లో వచ్చిన పెయిడ్‌ ఆర్టికల్‌కు ఆమె లెక్క చూపలేదు. అన్ని లెక్కలూ సక్రమంగానే చూపినా, ఒకే ఒక్క పెయిడ్‌ న్యూస్‌ లెక్క మాత్రం చూపలేదు. దాని ఖరీదు రూ.21,250 మాత్రమే. అయినా.. ఎన్నికల కమిషన్‌ దానిని తీవ్రంగా పరిగణించింది. ఆమెపై అనర్హత వేటు వేస్తూ 2011, అక్టోబర్‌ 21న నిర్ణయం తీసుకుంది.

లెక్కల్లో రూ.32 లక్షలకు కాళ్లు
కేసీఆర్‌ కుమార్తె కవిత చూపిన లెక్కల్లో కాస్తా కూస్తా కాదు.. ఏకంగా రూ.32.65 లక్షలు తేడా వచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీకి ఆమె తన అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆమెకు రూ.60 లక్షలు గ్రాంటుగా ఇచ్చింది. ఆ లెక్కను ఆమె యథాతథంగా పేర్కొన్నారు. సొంతంగా 25 వేలను ఖర్చు చేయడంతోపాటు పది లక్షలు అప్పుగా తీసుకున్న విషయాన్ని కూడా కవిత తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, ఎన్నికల్లో తనకు రూ.22.39 లక్షలు ఖర్చు అయ్యాయని ఆమె తన వ్యయ నివేదికలో పేర్కొన్నారు. అయితే, కవిత సమర్పించిన లెక్కలను జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన కలెక్టర్‌ తోసిపుచ్చారు. ఆమె ఎన్నికల ఖర్చును ఎన్నికల వ్యయ పర్యవేక్షణ విభాగానికి చెందిన గణాంక బృందం రూ.53.97 లక్షలుగా షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేసిందని స్పష్టం చేశారు. రెండింటినీ పోల్చి చూస్తే.. 32,65,773 తేడా వచ్చిందని, కొన్ని ప్రత్యేక ఖర్చులను కవిత తన అఫిడవిట్‌లో పేర్కొనలేదంటూ వాటి వివరాలను కూడా సమర్పించారు.
బహిరంగ సభలకు జనాలను తరలించడానికి వాహనాలను వినియోగించారని, వాటికి సంబంధించిన లెక్కలు చూపలేదని; కోరుట్ల, జగిత్యాల, మోర్తాడ్‌, బోధన్‌, ఆర్మూరు, డిచ్‌పల్లిల్లో జరిగిన బహిరంగ సభల లెక్కలు నమోదు చేయలేదని తప్పుబట్టారు. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ఇచ్చిన పెయిడ్‌ న్యూస్‌కు లెక్కలు చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రింట్‌ మీడియాలో వాణిజ్య ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించి దాదాపు రూ.20 లక్షల వరకూ వ్యత్యాసం ఉందని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే, గత ఏడాది జూన్‌ 16న జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కవితకు నోటీసు ((Rc.No. 01/Exp. Moni,/2014)) జారీ చేశారు. దానిలోని కొన్నింటిని అంగీకరించిన కవిత.. మరికొన్నింటిని తోసిపుచ్చారు.
 
అయితే, కలెక్టర్‌ మాత్రం లెక్కల తకరారుపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు. కేవలం రూ.21,250 తేడా వచ్చినందుకే యూపీలో మహిళా శాసనసభ్యురాలు మూడేళ్ల అనర్హత వేటుకు గురయ్యారు. మరి.. రూ.32.65 లక్షల తేడా చూపిన కవిత సంగతి ఏమిటి? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
Posted

Unofficial ga karchu pettinavi sting operation lo chupiste kaani teliyadu

Posted

Unofficial ga karchu pettinavi sting operation lo chupiste kaani teliyadu

 

baa... nuvu mottam chudu....UP lo EC deal chesina old case...it seems some thing cooking behind this issue
 

Posted

baa... nuvu mottam chudu....UP lo EC deal chesina old case...it seems some thing cooking behind this issue
 

title chuste artham ayipothadi le uncle, motham chadive antha matter kaadu

ayina 50lakhs ee karchu ayyindi ante nuvvu maatram nammuthaava cheppu

Posted

title chuste artham ayipothadi le uncle, motham chadive antha matter kaadu

ayina 50lakhs ee karchu ayyindi ante nuvvu maatram nammuthaava cheppu

 

nenu mammatam point kadu....any way

 

Kick-Movie-Animated-GIFs%2814%29.gif
Posted

zptc ki avuthundi 20-25lakhs easily.. Mp ki 50 aa :D

 

@gr33d

Posted

andhra media news TRS emanna andhra party la corrupted anukunnaraa , nippu nijaayithi party ec vallaki lekkalu raaka porabadi untaaru

Posted

andhra media news TRS emanna andhra party la corrupted anukunnaraa , nippu nijaayithi party ec vallaki lekkalu raaka porabadi untaaru

collector andhrodurlxuhc.jpg

chimple no

×
×
  • Create New...