posaanisam Posted November 21, 2015 Report Posted November 21, 2015 'Telugu Samskrutika Niketanam' was inaugurated by CM, atop Kailasagiri hill in Visakhapatnam. World Telugu Federation (WTF) , Visakhapatnam Urban Development Authority (VUDA) have jointly developed it at a cost of 12.75 crore. The museum has a revolving seating platform, to witness 56-minute AV about Telugu heritage through 48 important phases of its history.Paintings, Kalamkari art work, magnificent wood works, sculptures are part of the museum.
posaanisam Posted November 21, 2015 Author Report Posted November 21, 2015 తెలుగు సాంస్కృతిక నికేతనం భారతదేశం ఒక మిశ్రమ సంస్కృతి. వివిధ భాషల ఆధారంగ ఏర్పడిన అనేక ప్రాంతీయ సంస్కృతులతో ఇది రూపుదిద్దుకుంది. భారతీయ సంస్కృతిలో తెలుగు సంస్కృతి ఒక ముఖ్యమైన భాగం. లయ ప్రాసలతో సంపూర్ణమైన మధుర భాష, ప్రపంచస్థాయి సాహిత్యం, ప్రశస్తమైన లలిత కళలు, యుగాల నాటి జానపద కళలు, దక్షిణభారత దేశానికి దీప్తిమంతమైన కర్ణాటక శైలిని అందించిన సమ్మోహనకరమైన సంగీతాల వారసత్వం కలిగిన తెలుగు ప్రజలకి ఓ వైభవోపేతమైన గతం ఉంది. ఇక్కడి హస్త కళాకారులు నైపుణ్యంతో, కళాత్మకతతో నిండిన అత్యంత మనోహరమైన ఆకృతులకు రూపమిచ్చారు. వీటికి కొండపల్లి బొమ్మలు, గద్వాల్, వెంకటగిరి, పోచంపల్లి చేనేత వస్త్రాలు, లేపాక్షి హస్తకళలూ అతి చక్కని కొన్ని ఉదాహరణలు. శాతవాహనులు ఏలిన కాలం నుండి తెలుగు ప్రజలు తమ కోసం జాతీయ స్థాయిలో విస్తృతంగా, చివరికి అంతర్జాతీయ రంగస్థలంలో కూడా ఒక సముచిత స్థానాన్నినిర్మించుకున్నారు అయితే ఇప్పటిదాకా తెలుగు చరిత్ర, సంస్కృతి, వార సత్వానికి శాశ్వతమైన చిహ్నమేదీ నిర్మించాలనే ఆలోచన కలగలేదు. ఈలోపాన్ని సరిదిద్దడానికి, ఈ కార్యాన్ని సాకారం చేయడానికి ప్రపంచ తెలుగు సమాఖ్యత నంతట తానుగా ఆ అవకాశాన్ని సృష్టించుకుంది. భారత సంస్కృతి మౌలిక వారసత్వం మాదిరిగానే సజీవం, క్రియాశీలకం కాబట్టి ఈ మౌలిక సంస్కృతుల్ని ప్రతి దశలోనూ భద్రపరచడం, పరిరక్షించడం ప్రోత్సహించడం ఆవశ్యకం. ప్రత్యేకించి మౌలిక సంస్కృతుల్ని ఆవరించే ప్రమాదం ఉన్న వివిధ బహిర్గత ప్రభావాల ముప్పువాటికి పొంచి ఉన్న సమయంలో ఇది మరింత అవసరం. ప్రస్తుత, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం ఈ మహా నాగరికతకు "ప్రపంచ తెలుగు సమాఖ్య" మార్గ దర్శకత్వాన్ని ఇవ్వబోతోంది. 1992లో ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య తెలుగు భాష, సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని పదిలపరచి, ప్రోత్సాహించడానికి కృషి చేస్తోంది. తద్వారా విశ్వవ్యాప్త తెలుగు సమాజం తన సంప్రదాయాల మూలాల్ని సగర్వంగా పునరావిష్కరించుకోవడానికి దోహదపడేలా విస్తృతంగా చొరవ తీసుకుంటోంది.
posaanisam Posted November 21, 2015 Author Report Posted November 21, 2015 తెలుగు సాంస్కృతిక నికేతనం ఓ చారిత్తాత్మకమైన కట్టడం. ప్రతి తెలుగు వాడి నిరంతర స్వప్నం ఇప్పుడు సాకారమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య సర్వోత్కృష్టమైన కృషి, మనోహరమైన కైలాసగిరిపైన కొలువుతీరిన తెలుగు సాంస్కృతిక నికేతనం ఇప్పుడొక వాస్తుకళా సౌందర్యనిధి, శాత హహనుల కాలం నుండీ ఆధునిక యుగం దాకా తెలుగువారి చరిత్ర తాలూకు వైభవాన్నంతటినీ ఛాయాచిత్ర, దృశ్య, శ్రవణ, ధ్వని & కాంతి (సౌంట్ & లైట్) వివరణల ద్వారా ప్రదర్శించి, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుంచీ వచ్చే తెలుగు, తెలుగుతేర సందర్శకుల ఊహాశక్తిని ఆకట్టుకునేందుకు తెలుగు సాంస్కృతిక నికేతనం సిద్ధమైంది. శాతవాహన రాజుల కాలం నుండీ ప్రాచీన శిల్పాలు, చిత్ర కళాకృతుల ద్వారా తెలుగు ప్రజల చరిత్ర, పరిణామం, వారి సంస్కృతి విలువలను ఇది వర్ణిస్తుంది. ప్రాచీన లలిత కళలు, హస్త కళలు, సంస్కృతిని తెలియజేసే వస్తువులు, పటాలు పాత లిఖిత ప్రతుల్ని ప్రదర్శిస్తుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేస్తుంది. పర్యాటకులనూ, తెలుగు యువతనూ ఆకర్షించి, తెలుగు ప్రాచీన సంస్కృతి గురించి వారిలో స్ఫూర్తి, అవగాహన కలిగించేందుకు, ఇతర చారిత్రక, ప్రాచీన అంశాల్లాంటి వాటిని ప్రదర్శిస్తుంది. విశాఖనగరాభివృద్ధి సంస్థ (వుడా), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో, అద్వితీయమైన తెలుగువారసత్వ ప్రదర్శనశాల, జానపద కళల ప్రదర్శన కేంద్రాన్ని విశాఖపట్నం సమీపంలో అత్యంత మనోహరమైన పర్యాటక స్థలం కైలాసగిరిపై అయిదు ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రపంచ తెలుగు సమాఖ్య కృషి చేస్తోంది. చుట్టుపక్కల అడవి, సముద్రం ఉన్న ఈ ప్రాంతం పర్యాటకుల్ని అన్ని విధాలా ఆకర్షిస్తుంది. ఈ తెలుగు వారసత్వ ప్రదర్శనశాలలో వర్ణభరితమైన చరిత్ర, సంస్కృతి, జానపద కళలు, తెలుగు భాష, సాహిత్యం సంస్కృతులను అభివర్ణించే 48 ఎపిసోడ్స్ ఉన్నాయి.
posaanisam Posted November 21, 2015 Author Report Posted November 21, 2015 శాతవాహనుల కాలం నుండీ ప్రస్తుత కాలం దాకా తెలుగు ప్రజల చరిత్రను ఈ ప్రదర్శనశాల ప్రదర్శిస్తుంది. తెలుగు కళారూపాల్ని ప్రోత్సహించడం కోసం క్రమం తప్పకుండా సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడానికి ఒక రంగ స్థలాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ఉంది. అనేక విధాలుగా ఈ ప్రదర్శనశాల అద్వితీయమైనది. తెలుగు సంస్కృతికి సంబంధించిన వివిధ వాస్తవాల్ని సందర్శకులు తెలుసుకుని, అర్ధం చేసుకోవడానికి, తెలుగువారిగా గర్వించడానికి ఇదెంతో తోడ్పడుతుంది.
aakathaai Posted November 22, 2015 Report Posted November 22, 2015 wahh super undi location ippude vizag velli live lo choodalanipisthundi
posaanisam Posted November 22, 2015 Author Report Posted November 22, 2015 wahh super undi location ippude vizag velli live lo choodalanipisthundi ori ni esaalo
aakathaai Posted November 22, 2015 Report Posted November 22, 2015 ori ni esaalo telugudanam uttipaduthundi bommallo bhavodwegaalaki guri ayyaanule
Recommended Posts