Jump to content

Papam Man


Recommended Posts

Posted

 

fnhome.jpg రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం... మాజీ డీజీపీ పేర్వారం మనవల దుర్మరణం
     Wed, Nov 25, 2015, 09:15 AM      
హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్న పేర్వారం రాములు మనవలు దుర్మరణం పాలయ్యారు. నేటి ఉదయం ఔటర్ రింగు రోడ్డుపై కోకాపేట వద్ద ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్ ను వేగంగా దూసుకువచ్చిన స్కోడా కారు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పేర్వారం రాములు మనవలు (కూతురు కొడుకులు) అరుణ్, వరుణ్ లు అక్కడికక్కడే చనిపోయారు. మరో మనవడు రాహుల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వేగంగా స్పందించిన పోలీసులు రాహుల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కోకాపేట పరిధిలోని ఓ ఫాం హౌస్ నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో పేర్వారం రాములు మనవలు ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
   

 

Posted

$s@d

 

sad..ee ring road konni rojulu moosesi..ee bumps anni thiseyyali..lekunte speed limit pettali

Posted

$s@d $s@d unfortunate incident, celebrity mathramey ekkuva accidents avuthunnayaa on ORR or celebrities kabatti manki thelisi rest all un reported untunnayaa?

×
×
  • Create New...