siru Posted December 4, 2015 Report Posted December 4, 2015 శంకరాభరణం' మీద అపారమైన నమ్మకంతో ఈ చిత్రానికి రచనతో పాటు సమర్పకుని బాధ్యతలు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన కోన వెంకట్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కథ అందించిన బ్రూస్‌లీ పరాజయానికి శ్రీను వైట్ల బాధ్యుడని, తాను రాసిచ్చిన సన్నివేశాలని వాడుకోలేదని, అందుకే ఆ చిత్రం అంతటి ఫ్లాప్ అయిందని, అంతే కాక అది పోవడం వల్ల తన పేరు పోయిందని కూడా అన్నాడు. పోయిన ప్రతిష్టని తిరిగి నిలబెట్టే చిత్రమిదే అంటూ శంకరాభరణంకి బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. కట్ చేస్తే... 'శంకరాభరణం' మరో తలనొప్పి కారక చిత్రంగా తయారైంది. బ్రూస్‌లీకి తన బాధ్యతేమీ లేదని చెప్పుకున్న కోన వెంకట్‌కి ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఫస్ గయారే ఒబామా చిత్రానికి రీమేక్ అయిన శంకరాభరణం అంచనాలని తలకిందులు చేసింది. కథ: తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో బీహార్‌లో వున్న తమ పాత భవంతిని అమ్మి డబ్బులు పట్టుకెళ్లడానికి గౌతమ్ (నిఖిల్) యుఎస్ నుంచి ఇండియాకొస్తాడు. తమ భవంతిని అమ్మడానికి వీల్లేదని, దాన్నిండా తమ బంధువులే వుంటున్నారని అర్థం కావడంతో దానిని అమ్మే దారులు అన్వేషిస్తుంటాడు. ఈలోగా ఇతని దగ్గర చాలా డబ్బుందని వివిధ కిడ్నాప్ గ్యాంగ్‌లు గౌతమ్‌ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకోవాలని చూస్తుంటాయి. కిడ్నాప్‌కి గురైన గౌతమ్ వారి బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు, తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ. కథనం: తను రాయని కథకి తన పేరేసాడని శ్రీను వైట్లని తిట్టిపోసిన కోన వెంకట్ ఈసారి వేరెవరో రాసిన కథకి అవసరం లేని కొంత డ్రామాని అద్ది అది తన కథేనని వేసుకున్నాడు. ఫస్ గయా రే ఒబామా చిత్రాన్ని చాలా దారుణంగా రీమేక్ చేస్తే తప్ప ఇలాంటి సబ్‌స్టాండర్డ్ ప్రోడక్ట్ రాదు. చక్కని కథ, హాయిగా నవ్వించే వినోదంతో పాటు టాలెంటెడ్ స్టార్ కాస్ట్ ఆ చిత్రాన్ని ఒక మంచి చిత్రంగా నిలబెట్టాయి. ఆ కథని కోన వెంకట్ తన రచనతో కంగాళీ చేసి పారేసాడు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ షేపే మారిపోతుందని, కొత్త కథల ట్రెండ్ మొదలవుతుందని ఎన్నో కబుర్లు చెప్పిన కోన వెంకట్ ఒక కొత్త కథని తీసుకుని కూడా తన నాసిరకం కథనంతో దానిని బోరింగ్‌గా మార్చేసాడు. సినిమా మొదలైన ఎంత సేపటికీ కథలో లీనం కావడం కాదు కదా కనీసం కామెడీకి నవ్వు కూడా రాదు. ఒక పదిహేను నిమిషాలు గడిచేసరికి సీన్ ఏంటనేది అర్థమైపోతుంది. ఒరిజినల్ చూసిన వారికైతే అసలు కథని సెకండ్ హాఫ్‌కి వాయిదా వేసి కాలయాపన చేస్తున్న సంగతి తెలిసిపోతుంది. ఇంటర్వెల్ వరకు నాగార్జున 'గ్రీకువీరుడు' సినిమాకీ దీనికీ తేడా ఏమీ కనిపించదు. కామెడీ పేరుతో చేసిందేమీ క్లిక్ అవకపోవడం వల్ల ఇక మిగిలిన సినిమాపై అంచనాలు కూడా ఏమీ వుండవు. కాకపోతే భరించలేని ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. దీనికి కారణం ఆ హిందీ సినిమానే. ఇక్కడ్నుంచి అయినా దానిని యథాతథంగా ఫాలో కాకుండా కోన తన తెలివితేటలు చూపించడం వల్ల అది కూడా అంతంతమాత్రంగానే నవ్విస్తుంది. పతాక సన్నివేశాల్లో మినహా చెప్పుకోతగ్గ హాస్యం పండకపోవడంతో శంకరాభరణం ఒక నాసి రకం సినిమాగా మిగిలిపోయింది. దీనికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా తానే చేసానని చెప్పుకుంటున్నాడు కనుక ఈ చిత్రానికి ఇక కర్త, కర్మ, క్రియ అన్నీ కోన వెంకటే అవుతాడు. ఈసారి నిందించడానికి, తప్పించుకోవడానికి కూడా వీల్లేదు కనుక ఇప్పుడు జరిగే డ్యామేజ్ ఎంతనేది లెక్క వేసుకోవాలిక.
siru Posted December 4, 2015 Author Report Posted December 4, 2015 mv baagane undi antunnaru ga man ? Anni reviews lo consistent ga kona gadini matrame 10garu because he claimed he is everything for the movie.. Even story kuda kona anta Remake cinema ki story credit enti ra ani 10gutannru lol
Nellore Pedda reddy Posted December 4, 2015 Report Posted December 4, 2015 Koka gadiki, ilage template movie lu teese aa boyapati gadiki, ilanti vallandariki bomb lagadenge
Prakashnagar Posted December 4, 2015 Report Posted December 4, 2015 Koka gadiki, ilage template movie lu teese aa boyapati gadiki, ilanti vallandariki bomb lagadenge Boypati Bob tho kuda testhaud antale, teesthe, nuuve aapudu , aha keka director antav
Nellore Pedda reddy Posted December 4, 2015 Report Posted December 4, 2015 Boypati Bob tho kuda testhaud antale, teesthe, nuuve aapudu , aha keka director antav Nenu bob last 2 movies e choodaledu uncle, inka boyapati gaditho ante samasye ledu :giggle:
Prakashnagar Posted December 4, 2015 Report Posted December 4, 2015 Nenu bob last 2 movies e choodaledu uncle, inka boyapati gaditho ante samasye ledu @3$% Suddam aapudu
Nellore Pedda reddy Posted December 4, 2015 Report Posted December 4, 2015 Suddam aapudu Wait and see :d
Prakashnagar Posted December 4, 2015 Report Posted December 4, 2015 Wait and see :D Baruvu mariyu Samudaramu
Recommended Posts