Jump to content

Recommended Posts

Posted

హేట్ స్టోరీ అంటూ తీసిన అన్ని సినిమాల్లోనూ స్కిన్ షో అడల్ట్ కంటెంట్ బాగా ఉండడంతో.. కలెక్షన్స్ బాగానే కుమ్మేశాయి. ఇప్పుడు వచ్చిన హేట్ స్టోరీ 3 కూడా రిలీజ్ రోజు నుంచే వసూళ్ల దుమ్ము దులిపేస్తోంది. ఈరోజే ధియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా.. అన్ని చోట్లా కత్తిలాంటి ఆక్యుపెన్సీ రేటును కలిగి ఉండటంతో ఒక ఎనిమిది కోట్లు తొలిరోజు గ్యారెంటీ అంటున్నారు. 

డైసీ షా జరైన్ ఖాన్ ల బోల్డ్ అవతారాలను బాగా చూపించడంతో.. ట్రైలర్ ల నుంచే బోలెడంత రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి. సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో కంటే.. హేట్ స్టోరీ3 కే ఎక్కువ యూట్యూబ్ క్లిక్స్ వచ్చాయంటే.. ఈ కంటెంట్ కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కూడా అదే ప్రూవ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. హేట్ స్టోరీ3కి బీ సీ సెంటర్లలో తొలి రోజు 55 నుంచి 60శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక మెట్రో నగరాల్లో అయితే 35 నుంచి 40 వరకూ టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇలాంటి సినిమాలకు ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. తొలి రోజున ఈ చిత్రం కనీసం 7 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెబ్తున్నారు. రివ్యూలు రేటింగులు నెగిటివ్ గా ఉన్నా.. జనాలు హేట్ స్టోరీ సిరీస్ కి బాగానే అలవాటు పడ్డారు.

ఒక ప్రక్కన సూపర్ స్టార్లయిన రణబీర్ కపూర్ దీపికా పదుకొనె నటించిన తమాషా వంటి సినిమాకు.. కేవలం 10 కోట్ల తొలిరోజు గ్రాస్ వస్తే.. హేట్ స్టోరీ 3 వంటి సినిమాలకు కూడా అదే రేంజ్ గ్రాసంటే.. జనాలు ఎరోటిసిజంను ఏ రేంజులో ఆదరిస్తున్నారో చూస్కోండి. మరి ఫస్టు డే కలెక్షన్లు వచ్చాక మనం తదుపరి కామెంట్ల ప్రోగ్రాం పెట్టుకుందాం. 

Posted

Bollywood lo Konni rojulaki Porn direct ga release ai industry hits kodthai....

Posted

Elantivi mana Telugu lo eppudu vasthayoo eagerly waiting for that moment

×
×
  • Create New...