Jump to content

SUNIL..RAJAMOULI...maryadharamanna....25 crores business.....!


Recommended Posts

Posted

            [img]http://www.cinejosh.com/newsimg/newsmainimg/1258053746_sunil-rajamouli-2.jpg[/img]
సునీల్, రాజమౌళి కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'మర్యాద రామన్న' చిత్రం బిజెనెస్ ఇరవై మూడు కోట్ల వరకూ జరగుతున్నట్లు సమాచారం. అలాగే ఓవర్ సీస్, శాటిలైట్, డీవిడి రైట్స్ కలపితే మొత్తం పాతిక కోట్లు వరకూ బిజెనెస్ అని చెప్తున్నారు. అయితే అంత లేదని పదిహేను వరకూ జరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. పదిహేను జరిగినా, పాతిక జరిగినా సునీల్ సినిమాగా చూస్తే బాగా ఎక్కువ. అయితే అపజయం అంటూ ఎరగని రాజమౌళి చిత్రంకు ఆ రేంజి అనేది చాలా కామన్ అంటున్నారు. ఏ హీరో అయినా అతని స్టాంప్ పోస్టర్ పై పడుతోందంటే ఆ క్రేజ్ అంటున్నారు. ఫుల్ లెంగ్త్ కామిడీగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు సైతం సరైన ప్రాధాన్యత ఉందంటున్నారు.

ఇక ఫ్యాక్షన్ నేపధ్యంలో కామిడీగా సాగే 'మర్యాద రామన్న' లో సలోని హీరోయిన్ గా చేస్తోంది. మగధీర చిత్రం తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఎప్పుడు తన తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన కథలతో సినిమాలు చేసే రాజమౌళి ఈసారి తన తండ్రి దగ్గర సహాయకుడిగా వ్యవహరిస్తోన్న కాంచీ ఇచ్చిన కథతో ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన బేసిక్ ఐడియా ముళ్ళపూడి వరది(నా అల్లుడు దర్శకుడు). ఆ ఐడియాని కాంచీ డెవలప్ చేసాడు. ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు కెమెరామెన్ గా వ్యవహరించనున్నాడు

Posted

abba abba sunil entha business chesadu ba


sunil dhe biggest hit industrey lo

sunil  you rock you rock

×
×
  • Create New...