psycopk Posted June 7, 2010 Report Posted June 7, 2010 వివి వినాయక్ తనకు అన్నయ్య లాంటి వాడని, ఆయన తండ్రి కృష్ణారావు తనకు తండ్రితో సమానమని అన్నారు. కృష్ణారావు ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తండ్రి గండ్రోతు కృష్ణారావు పెద్దకార్యానికి హాజరై ఎన్టీఆర్ పై విధంగా స్పందించారు. మీడియా తో మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు లో జరిగింది.జూనియర్ ఎన్టీఆర్ ను చూడడానికి అభిమానులు తరలివచ్చారు. ఆయన వచ్చిన నలుపు సఫారీ కార్ల కాన్వాయ్ ఆకట్టుకుంది. ఆయన తొలుత వినాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఫ్యాక్టరీ యార్డులో ఏర్పాటు చేసిన కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫ్యాక్టరీ అతిథి గృహంలో భోజనం చేశారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు గెస్ట్ హౌస్ గోడలు, చెట్లు ఎక్కి నిరీక్షించారు. బయటకు వచ్చిన ఆయన అభిమానులకు అభివాదం చేశారు.
rvarma Posted June 7, 2010 Report Posted June 7, 2010 It's a great gesture from NTR. He skipped T20 dress launch to stay with his dearest director in bad time.
Recommended Posts